19 గంటల్లోనే 1030 కి.మీ ప్రయాణం.. అది కూడా ఇలాంటి కారుతో! మధ్యలో వర్షాలు, చెడు రోడ్లు.. స్టోరీ వేరే లెవెల్!

హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి చిన్న SUV సెగ్మెంట్‌లో మంచి పేరు సంపాదించుకుంది. ప్రాక్టికల్ డిజైన్, ఫీచర్లు, మైలేజ్ అన్ని ఒక ప్యాకేజ్‌గా భావిస్తూ చాలామంది దీనిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఒక వినియోగదారుడు ఈ కారుతో చేసిన ప్రయాణ అనుభవం సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. బెంగళూరుకు చెందిన ఈ వ్యక్తి కొత్తగా కొనుగోలు చేసిన ఎక్స్‌టర్ AMT వేరియంట్‌తో కేవలం 19 గంటల్లో 1030 కి.మీ ప్రయాణించి తన అనుభవాన్ని రెడ్డిట్‌లో పంచుకున్నారు. అదీగాక, ఆయన చేసిన ఈ ప్రయాణం సాదాసీదా రోడ్లపై కాదు. భారీ వర్షాలు, పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు, ట్రాఫిక్‌తో నిండిన ప్రాంతాలు.. ఇవన్నీ ఎదురైనా ఎక్స్‌టర్ తన పనితీరులో ఎక్కడా రాజీపడలేదని ఆయన వివరించాడు. దీనికోసం అతను ఎక్స్‌టర్ AMT కారును ఉపయోగించాడు

సాధారణంగా చిన్న SUVs పై కొంతమంది లాంగ్ డ్రైవ్‌కి సరిపోవనే అభిప్రాయం కలిగి ఉంటారు. కానీ, ఈ వ్యక్తి చేసిన 1030 కి.మీ ప్రయాణం ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేలా ఉంది. అందుకే ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక కారు ఎంత దూరం వెళ్లగలదో కంటే, కఠిన పరిస్థితుల్లో కూడా ఎంత నమ్మకంగా పనిచేస్తుందో, డ్రైవర్‌కు ఎంత సేఫ్‌గా అనిపిస్తుందో అదే ఈ కథలో ప్రధానాంశం.

Hyundai Exter Owner Completes 1030 Km Trip Shares Real World Experience

ఆ వ్యక్తి బెంగళూరు నుంచి హ్యుందాయ్ ఎక్స్‌టర్ AMTతో మొదటి పెద్ద రోడ్ ట్రిప్‌ను ప్లాన్ చేసినప్పుడు, అది ఇలా గుర్తుండిపోయే ప్రయాణం అవుతుందని అతడికే తెలియదు. ఉదయం 4.25 గంటలకు బెంగళూరు ఇంకా నిద్రలో ఉన్నప్పుడు, ఈ ట్రావెలర్ మాత్రం స్టీరింగ్ పట్టుకుని రోడ్డెక్కాడు. ప్రయాణం మొదటి గంటల్లోనే వర్షం ఒక్కసారిగా కురవడంతో రోడ్లు జారుడు మారాయి. అయినా కూడా ఎక్స్‌టర్ ఇచ్చిన స్థిరత్వం అతనికి నమ్మకాన్ని ఇచ్చింది.

బెంగళూరు నుంచి కోగ్యకర్త దిశగా సాగుతున్నప్పుడు పచ్చని పర్వతాల మధ్య పొగమంచులో కార్ హెడ్ల్యాంప్స్ మెరుస్తూ ముందుకు దూసుకెళ్లాయి. ఆ తర్వాత బెల్గాం వైపు మలుపులు తిరిగే రహదారులు, ఎత్తుపల్లాలు, దెబ్బతిన్న రోడ్లు, ఎలా ఉన్నా కార్ పనితీరు మాత్రం అతన్ని ఆశ్చర్యపరిచిందట. కొన్ని చోట్ల భారీగా వర్షం కురవడంతో రోడ్డుపై గుంతలు స్పష్టంగా కనిపించకపోయినా, AMT గేర్‌బాక్స్ స్మూత్‌గా పనిచేస్తూ, ఎటువంటి జర్కులు లేకుండా కారును ముందుకు నడిపింది.

Hyundai Exter Owner Completes 1030 Km Trip Shares Real World Experience

అప్పుడప్పుడు చిన్న విరామాలు తీసుకుని టీ తాగుతూ, ప్రయాణ దుమ్ము దులిపేసుకుని, మళ్లీ రోడ్డుపైకి వచ్చాడు. ఇలా కోగ్యకర్త-బెల్గాం-దావణగెరె మీదుగా సాగిన అతని లాంగ్ రైడ్ చివరకు తిరిగి బెంగళూరులో ముగిసే వరకు మొత్తం విరామాలతో 22 గంటలు గడిచిపోయాయి. ఆయన చెబుతున్న ప్రకారం, అలసట కంటే ఈ ప్రయాణం ఇచ్చిన సంతృప్తి పెద్దది. అతి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే రోడ్లు చెడ్డగా ఉన్నా ఎక్స్‌టర్ ఇచ్చిన మైలేజీ.

1030 కిలోమీటర్ల ఈ పెద్ద ప్రయాణానికి కారు 17.5 కి.మీ/లీటర్ మైలేజీ ఇచ్చిందని అతడు చెప్పాడు. అతని మాటల్లో చెప్పాలంటే ఎంత వర్షం, ఎంత గుంతలు, ఎంత బంపీలు ఉన్నా... ఎక్స్‌టర్ ఒక్క క్షణం కూడా ఇబ్బంది పెట్టలేదు. ఈ పర్యటనలో, అతను 15 గంటల పాటు భారీ వర్షంలో ప్రయాణించాడు. ఈ వాతావరణంలో, అతను సౌకర్యవంతమైన రైడ్‌ను పొందాడు. ఈ SUV ట్రిప్ అంతటా బాగా పనిచేసిందని పేర్కొన్నాడు.

బయట వర్షం కారణంగా చలి ఉన్నప్పటికీ ఈ కారు లోపల ఎయిర్ కండిషనింగ్ కూడా వారిని సౌకర్యవంతంగా ఉంచింది. ఈ కారును కొన్నప్పటి నుండి ఆయన 11,500 కి.మీ.లు జాతీయ రహదారిపై ప్రయాణించారు. ఇది కారు యజమానికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అంతే కాదు, ఇది కారుపై కొత్త కస్టమర్ల విశ్వాసాన్ని పెంచుతుంది, కార్ల అమ్మకాలను పెంచుతుంది.

More from DriveSpark

Article Published On: Sunday, December 7, 2025, 13:16 [IST]
English summary
Hyundai exter owner completes 1030 km trip shares real world experience
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+