Live Video టాటా నెక్సాన్‌ను ఢీకొట్టిన హ్యుందాయ్ i20 కారు.. బోల్తాపడినా చెక్కుచెదరని నెక్సాన్ క్యాబిన్!
భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా ఉంటోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం సహా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం కూడా భారీగా జరుగుతున్న ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
తాజాగా ఓ సిటీ రోడ్డుపై టాటా నెక్సాన్ (Tata Nexon) మరియు హ్యుందాయ్ i20 (Hyundai i20) కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో టాటా నెక్సాన్ కారు బోల్తా పడింది. ఈ ఘటన అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్యాబిన్ చెక్కుచెదరలేదు: రద్దీ తక్కువగా ఉన్న రోడ్డుపైన టాటా నెక్సాన్ సరైన మార్గంలో నెమ్మదిగా ప్రయాణం చేస్తోంది. అంతలో ఎదురుగా వచ్చిన హ్యుందాయ్ i20 కారు.. నెక్సాన్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా నెక్సాన్ కారు బోల్తాపడింది. ఇంత ప్రమాదంలో కూడా టాటా నెక్సాన్ కారు క్యాబిన్ చెక్కుచెదరలేదు. పిల్లర్లు కూడా డ్యామేజీ కాలేదు. ఫలితంగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
లైవ్ వీడియో : ఈ వీడియో ఆధారంగా టాటా నెక్సాన్ కారు సరైన మార్గం, తక్కువ వేగంతోనే ప్రయాణం చేస్తోంది. అయితే ఎదురుగా వచ్చిన హ్యుందాయ్ కారు అదుపుతప్పి వేగంగా నెక్సాన్ వాహనం వైపు దూసుకొచ్చింది. దీన్ని గమనించిన నెక్సాన్ డ్రైవర్ కారును కుడివైపునకు మళ్లించాడు.

అయినా హ్యుందాయ్ i20 కారు వేగంగా వచ్చి టాటా నెక్సాన్ వాహనాన్ని (hyundai i20 hatchback crashed Tata nexon ) ఢీకొట్టింది. దీంతో నియంత్రణ కోల్పోయిన టాటా నెక్సాన్ కారు అక్కడికక్కడే బోల్తా పడింది. కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
తొలి కారు ఇదే..! : టాటా నెక్సాన్ తొలి తరం కారు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకున్న తొలి మేడ్ ఇన్ ఇండియా కారుగా నిలిచింది. ఈ కాంపాక్ట్ SUV పెద్దల రక్షణలో 17 పాయింట్లకు గాను 16.06 పాయింట్లను సాధించింది. బిల్డ్ క్వాలిటి సహా ఇతర భద్రతా ఫీచర్లతో టాటా మంచి ఆదరణ పొందింది.
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇటీవల విడుదల అయింది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటుంది. కారు ముందు భాగంలో LED DRL, బంపర్ దిగువన హెడ్‌ల్యాంప్‌లతో సిగ్నేచర్ స్ల్పిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది. అలాగే LED టెయిల్‌లైట్ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది.
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కారు భద్రతా పరంగా కీలక ఫీచర్లను కలిగి ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా రానున్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రజర్ మానిటర్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి కీలక ఫీచర్లను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








