ఎక్స్‌ప్రెస్‌వేపై కారుతో విన్యాసాలు.. పోలీసులు ఏం చేసారో తెలుసా?

పబ్లిక్ రోడ్ల మీద కార్లు లేదా బైకులతో విన్యాసాలు చేయడం సర్వ సాధారణం అయిపోయింది. నిజానికి ఇవి చట్ట విరుద్ధం, ప్రమాదం కూడా. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. దీనికి కారకులైనవారి మీద పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అలాంటి సంఘటనే తాజాగా మరొకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎవరికైనా ప్రమాదం జరిగిందా? దీనిపైన పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం, నోయిడా - గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలో విన్యాసాలు చేస్తున్న హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ20 కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో గమనించనట్లయితే.. కారును డ్రైవ్ చేసే వ్యక్తి నేషనల్ హైవే మీద వాహనాలకు అడ్డంగా.. అటు ఇటూ తిరుగుతూ విన్యాసాలు చేసింది. ఇది ఇతర వాహనదారులకు చాలా ఇబ్బంది కలిగించినట్లు ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.

Hyundai i20 Stunting On Expressway

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. దీనిని పోలీసులు సైతం గమనించారు. పబ్లిక్ రోడ్డు మీద హ్యుందాయ్ ఐ20 కారుతో విన్యాసాలు చేసిన వ్యక్తి మీద చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే.. అతనికి ఏకంగా రూ. 50000 జరిమానా విధించారు. ఈ వీడియో చూసిన చాలామంది జనం రోడ్డుపై ఇలాంటి విన్యాసాలు చేయడాన్ని తప్పుపట్టారు. పోలీసులు అతని మీద తీసుకున్న చర్యను సమర్థించారు.

నిజానికి కారుతో విన్యాసాలు చేసే సమయంలో.. రోడ్డుపైన ఎక్కువ సంఖ్యలో కార్లు రావడాన్ని గమనించవచ్చు. అయినప్పటికీ ఆ వ్యక్తి అవేమీ పట్టించుకోకుండా.. తనకు నచ్చినట్లు రోడ్డుపై విన్యాసాలు చేశారు. దీన్ని గమనించిన వాహనదారులు తమ వాహనాలను మెల్లగా నడిపారు. అనుకోకుండా ఇతర వాహనదారులు కూడా వేగంగా వచినట్లయితే వాహనాలు ఢీ కొట్టుకునే ప్రమాదం ఉంది. ఇదే జరిగి ఉంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగేదో ఊహించవచ్చు.

Hyundai i20 Stunting On Expressway

ఈ సంఘటన గురించి ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను మేము గమనించాము. పబ్లిక్ రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా, తప్పు నెంబర్ ప్లేట్ ఉపయోగించడం, టింటెడ్ గ్లాసెస్, ఇన్సూరెన్స్ లేకుండా కారును డ్రైవ్ చేయడం వంటి నేరాల కింద 1988 సెక్షన్ 179 (1) ప్రకారం రూ. 55000 జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు.

పబ్లిక్ రోడ్డు మీద విన్యాసాలు చేసిన వ్యక్తికి జరిమానా విధించడమే కాకుండా.. కారుకు తప్పు నెంబర్ ప్లేట్ ఉపయోగించడం వల్ల ఇతర చర్యలు తీసుకోవడానికి పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారిని ఊరికే వదిలితే.. మరికొందరు దీనిని పాటిస్తారని వారు అభిప్రాయపడుతున్నారు. బహుశా ఆ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ పూర్తిగా రద్దు చేయవచ్చు, లేదా కారునే సీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

నిజానికి ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. గతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పబ్లిక్ రోడ్‌లపై విన్యాసాలు చేసి భారీ జరిమానాలు చెల్లించారు. ఇలాంటి ఘటనలు పూర్తిగా నిషిద్ధం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదం కూడా. ఇలాంటి ఘటనలు వారికి మాత్రమే కాకుండా ఇతర వాహన వినియోగదారులను ప్రమాదంలో పడేస్తాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, June 3, 2024, 13:30 [IST]
English summary
Hyundai i20 stunting on expressway police fined rs 55000
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+