రోడ్డు డివైడర్‌పైకి ఎక్కిన హ్యుందాయ్‌ Kona EV .. నెటిజన్ల కామెంట్లు వైరల్‌!

భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, సహా అనేక కారణాలున్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారుల వంటి ప్రాంతాల్లో రోడ్లపైకి అకస్మాత్తుగా వచ్చిన పశువులు, పాదచారులు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ప్రమాదం అందరిలో ఓ ప్రశ్నను లేవనెత్తింది.

కారుకు పేరు పెట్టిన నెటిజన్లు : ఈ కారుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ కారుకు FDAS - ఫ్లైయింగ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ అని పేరు పెట్టారు. గతవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఘటన ఎక్కడ జరిగిందనే స్పష్టత లేదు. ఇప్పటివరకు 1.39 లక్షలకు పైగా ఈ వీడియోను లైక్‌ చేశారు.

Hyundai Kona EV lodged on road divider

హ్యందాయ్ కోనా ఎలక్ట్రిక్‌ కారు రోడ్డు డివైడర్‌పైన ఉంది. అయితే ఆ ప్రాంతంలో డివైడర్‌పైకి కారు వెళ్లేందుకు ర్యాంప్‌ సహా ఎటువంటి ఆధారం లేదు. అయినా ఆ కారు ఎలా వెళ్లింది అనేదానిపై ఆరా తీస్తున్నారు. కోనా EV డివైడర్‌పైకి ఎలా వెళ్లిందనేది తెలియలేదు. ఆ ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాల వీడియో లేదా కారు డ్రైవర్‌ చెబితే గానీ అసలు ఏం జరిగిందనే విషయం తెలియదు.

32 లక్షల మంది : ఈ వీడియోను చూసిన నెటిజన్లు హ్యుందాయ్‌ కారులో (Hyundai Kona EV) ఎఫ్‌డీఎఎస్‌ అంటూ క్యాఫ్షన్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 32 లక్షల మంది వీక్షించారు. అలాగే 1.39 లక్షల మంది లైక్ చేశారు. అంతేకాకుండా వేలాది మంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఉన్న కారు భారీగా డ్యామేజీ కాలేదు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది బయటపడలేదు.

Hyundai Kona EV lodged on road divider

రెండో అంతస్తులోకి కారు : గతంలోనూ ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయి. కొన్ని రోజుల క్రితం అమెరికాలోని పెన్సిల్వేనియోలో టాయోటా కరోలా సైడాన్‌ వీడియో వైరల్‌ అయింది. ఓ ఇంటి రెండో అంతస్తులోకి కారు దూసుకెళ్లింది. అప్పట్లో ఈ ఫోటోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో ఇంటి యజమాని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్నారు. అయితే కారును నడిపిన యువకుడు గాయపడ్డారు.

అయితే ఘటనపై పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరగలేదని, ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగా పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో కారు భారీగా డ్యామేజ్‌ అయింది. ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించి, ఘటన ప్రాంతం నుంచి కారును తొలగించారు. అప్పట్లో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి.

Hyundai Kona EV lodged on road divider

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Sunday, September 24, 2023, 8:30 [IST]
English summary
Hyundai kona ev lodged on road divider video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+