హ్యుందాయ్ IPOకి సంబంధించి కీలక విషయాలు.. ఇవి తెలుసుకొని షేర్స్ కొనండి.. అస్సలు రిస్క్ వద్దు!!
దేశంలో హ్యుందాయ్ కార్స్‌కి మంచి డిమాండ్ ఉంది. భారతదేశంలో వాహనాల తయారీలో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ రెండవ స్థానంలో ఉంది. దేశంలో తన మొదటి IPOను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి దాదాపు 800 మిలియన్ షేర్లు ఉన్నాయి. ఇప్పుడు IPO ద్వారా రూ. 25,000 కోట్లకు సమానమైన నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఈ IPOని కొనుగోలు చేయడంలో వల్ల కలిగే నష్టాలు ఏమిటి? ఇది భారతదేశంలో అతిపెద్ద IPOగా ఎందుకు చెప్పబడుతోంది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
దేశంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద IPOగా LIC ఉంది. ఈ సంస్థ రూ. 21,000 కోట్లు సేకరించింది. ఆ తర్వాత హ్యుందాయ్ IPO తదుపరి అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. మారుతి 2003లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయబడింది. దీని తర్వాత హ్యుందాయ్ మార్కెట్‌లో కీ ప్లేయర్‌గా మారింది.

ప్రస్తుతం హ్యుందాయ్ వార్షిక టర్నోవర్ రూ. 60,000 కోట్లుగా ఉంది. ఇందులో లాభాలు కేవలం రూ.4,653 కోట్లు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆదాయంలో పోల్చితే భారతదేశంలో కేవలం 1% మాత్రమే ఆర్జిస్తుంది. ఈ కారు సంస్థ ఐ20, వెర్నా, క్రెటా, ఆరా మరియు టక్సన్ వంటి మోడళ్ల ద్వారా కంపెనీ భారతదేశంలో గణనీయమైన ఆదాయాన్ని పొందుతోంది.
తాజాగ IPO కోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను హ్యుందాయ్ విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్‌లో ఉన్న సమాచారం ప్రకారం ఈ IPOని కొనుగోలు చేయడంలో నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. ఏదైనా ఒక కంపెనీ IPOను జారీ చేసినప్పుడు ఇలాంటి ప్రాస్పెక్టస్‌ని విడుదల చేస్తాయి. ప్రతి కంపెనీకి ఉండే రిస్క్ కారణాలను ఇందులో వెల్లడిస్తారు. వీటిని పెట్టుబడిదారులు పరిగణనలోకి పెట్టుబడులు వస్తాయి.
హ్యుందాయ్ ఇంజిన్లు, గేర్‌బాక్స్‌లు, స్టీల్ వంటి విడిభాగాలను భారతదేశం మరియు విదేశాల నుండి కొనుగోలు చేస్తుందని కంపెనీ డాక్యుమెంట్‌లో వెల్లడించింది. ఈ ఉత్పత్తుల ధరల పెరుగుదల నేరుగా హ్యుందాయ్ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది. అదనంగా, హ్యుందాయ్ మరియు దాని అనుబంధ సంస్థలపై భారతీయ కోర్టులలో వివిధ కేసులు కొనసాగుతున్నాయి. అననుకూల తీర్పులు కంపెనీ వ్యాపారం మరియు ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
ఇండియాలో హ్యుందాయ్ సంస్థ కియా బ్రాండ్ కింద ఒక ప్రత్యేక సంస్థను స్థాపించింది. ఈ రెండు కూడా ఒకే కేటగిరి వాహనాలను తయారు చేస్తున్నాయి. ఈ కంపెనీల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అదే జరిగితే నేరుగా హ్యుందాయ్ ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ కంపెనీ మహారాష్ట్రలోనూ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త ప్లాంట్‌లో నిర్వహణ సమస్యలు ఉండే అవకాశం ఉంది.
ఇక ఈ సంస్థకు ప్రభుత్వం నుంచి వివిధ ప్రోత్సాహకాలు మరియు రాయితీలు ప్రధాన నిధుల వనరులుగా ఉన్నాయి. ప్రతికూల ప్రభుత్వ నిర్ణయాలు హ్యుందాయ్ వ్యాపారం మరియు ఆర్థిక స్థితిని గణనీయంగా ప్రభావితం చేయవచ్చు. హ్యుందాయ్ ప్రస్తుతం తన వ్యాపార మార్కెట్ ట్రెండ్స్ మరియు కస్టమర్ డిమాండ్‌లపై మాత్రమే దృష్టి పెడుతుంది. ఇందుకు సంబంధించి సేల్స్ పెరగాలంటే కొత్త అప్‌గ్రేడ్స్‌తో రావాల్సిందే. లేదంటే ఆదాయం తగ్గే అవకాశం ఉంది.
ఈ సంస్థ కార్యకలాపాలు దేశంలో ఉన్నప్పటికీ అంతర్జాతీయ సంస్థ హ్యుందాయ్‌ని నియంత్రిస్తుంది. అంతర్జాతీయ సంస్థ తీసుకునే నిర్ణయాలు భారతీయ కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. హ్యుందాయ్ ప్రస్తుతం భారతదేశంలో SUVలను విక్రయించడం ద్వారా గణనీయమైన లాభాలను ఆర్జిస్తోంది. అయితే, SUV ఉత్పత్తిలో సమస్యలు మొదలైతే లేదా వినియోగదారులు ఇతర కార్ల వైపూ చూస్తే కంపెనీ ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది.
దేశంలో సాంప్రదాయ వాహనాలకు భిన్నంగా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడానికి దీర్ఘకాలిక ప్రణాళికలతో హ్యుందాయ్ వస్తుంది. ఈ మార్కెట్ ట్రెండ్‌ను ఉపయోగించుకోవడంలో ఈ సంస్థ విఫలమైతే కంపెనీ ఆదాయంపై నేరుగా దెబ్బ పడుతుంది. ఇప్పటికే హామీల కోసం కేటాయించిన నిధులు సరిపోవడం లేదు. ఇక ఫైనల్‌గా విదేశీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు హ్యుందాయ్ వాల్యూని తగ్గించగలవు.
విదేశీ కరెన్సీని దేశీయ కరెన్సీకి మార్చేటప్పుడు చాలా కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటాయి. దీనికి హ్యుందాయ్ మినహాయింపు కాదు. ఆర్థిక నష్టాలను నివారించడానికి కంపెనీ ఈ ముందే అంచనా వేసి జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎక్కువ దిగుమతి భాగాలపై ఆధారపడటం, న్యాయపరమైన చిక్కులు వాటిని కంపెనీ అధిగమించాలి. హ్యుందాయ్ IPOలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకునే ముందు పెట్టుబడిదారులు ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.


Click it and Unblock the Notifications








