అమీర్ ఖాన్ 'డెల్లీ బెల్లీ' అడల్ట్ సినిమాకు లీగల్‌ నోటీసులు!

Delhi Belly
బాలీవుడ్ విలక్షణ నటుడు అమీర్‌ ఖాన్‌ నిర్మించిన తాజా చిత్రం 'డెల్లీ బెల్లీ' వివాదాలకు తెరలేపుతోంది. అసలే సెన్సార్ వారు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిన ఈ సినిమాపై హ్యుందాయ్‌ లీగల్ నోటీసు జారీ చేయాలని భావిస్తోంది. ఈ సినిమాలో హ్యుందాయ్ కంపెనీ మోడల్‌గా భావిస్తున్న శాంత్రో కారుపై అసభ్యకరమైన విధంగా వ్యాఖ్యలు రాయడంపట్ల కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఈ విషయంపై తమ లీగల్ టీమ్ దృష్టి సారించిందని, ఈ సినిమా క్లిప్పింగ్‌లను పరిశీలించిన తర్వాత ఏవైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కనిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భారదేశపు రెండవ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన హ్యుందాయ్ మోటార్‌ ఇండియా లిమిలెడ్‌ (హెచ్‌ఎమ్ఐఎల్‌) అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

అయితే సినిమా చిత్రీకరణలో నిర్మాతలు సదరు కార్ బ్రాండ్‌ కనపడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చూడటానికి అచ్చం హ్యుందాయ్ శాంత్రోలా ఉండే ఈ కారుపై డెల్లీ బెల్లీ సినిమాలో కొన్ని అభ్యంతకరమైన డైలాగులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. డెల్లీ బెల్లీ సినిమాను అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌, యూటీవీ మోషన్‌ ఫిక్చర్‌లు సంయుక్తంగా నిర్మించాయి.

ఈ విషయంపై అమీర్‌ ఖాన్‌ ప్రొకడక్షన్‌ ప్రతినిధిని సంప్రదించగా.. ఏ మోటార్ కంపెనీ నుంచి తమకు ఎలాంటి లేఖ కానీ, సమాచారం కానీ లేదని తెలిపారు. హ్యుందాయ్ శాంత్రో మోడల్‌ను ఐ10 ఓవర్‌టేక్ చేయక ముందుకు కంపెనీ బెస్ట్-సెల్లింగ్ మోడల్‌గా ఉండేది.

ఇకపోతే డెల్లీ బెల్లీ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే. ఇదో అడల్ట్ కామెడీ మూవీ. అమీర్‌ ఖాన్‌ తన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌తో ఈ సినిమాను నిర్మాంచారు. ఈ సినిమాలో ఓ పాట కూడా కాపీ రైట్‌ వివాదంలో చిక్కుకుంది. జూలై 1వ తేదీన విడుదలైన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులనుంచి మంచి ఆదరాభిమానాలను పొందుతోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 6, 2011, 10:51 [IST]
English summary
Hyundai Motor India Ltd (HMIL) is considering legal action against Aamir Khan's latest film, 'Delhi Belly', for allegedly depicting one of the company's cars in a derogatory manner.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+