సెహ్వాగ్, పియుష్‌లకు వెర్నా కారును బహుకరించిన హ్యుందాయ్

Sehwag and Piyush Chawla
క్రికెట్ ప్రపంచ కప్‌ 2011లో నెగ్గిన భారత జట్టు సభ్యులందరికీ సరికొత్త వెర్నా కారును బహుమతిగా ఇస్తానని ప్రకటించిన దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) తన వాగ్ధానాన్ని నిలుపుకుంది. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచ కప్‌ను సాధించి పెట్టిన ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2011 విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన వీరేంద్ర సెహ్వాగ్ మరియు పియుష్ చావ్లాలకు సరికొత్త "వెర్నా ఫ్లూయిడిక్" సెడాన్ కారును బహుకరించింది.

వీరేంద్ర సెహ్వాగ్ మరియు పియుష్ చావ్లాలకు హెచ్ఎమ్ఐఎల్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అరవింద్ సక్సేనా వెర్నా ఫ్లూయిడిక్ తాళం చెవులను అందజేసి కారును బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2011 విన్నింగ్ టీమ్‌కు సరికొత్త వెర్నా కారును బహకరించడం గర్వంగా ఉందని, ఈ కొత్త కారు హ్యుందాయ్ ఫ్లూయిడిక్ డిజైన్ ఫిలాసఫీను కలిగి ఉంటుందని, ఇంకా ఇది డిజైన్, నాణ్యత మరియు టెక్నాలజీలలో అత్యుత్తమమైనదని తెలిపారు.

ప్రపంచ కప్‌లో పాల్గొన్న టీంఇండియాలోని ఇతర ఆటగాళ్లకు కూడా ఇదే రీతిలో వారి వారి స్వంత ప్రాంతాల్లో సరికొత్త వెర్నా కారును బహుకరించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. 2011-2015 వరకూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)కు హ్యుందాయ్ అధికారిక కార్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గడచిన మే నెలలో విడుదలైన హ్యుందాయ్ వెర్నా ఫ్లూయిడిక్ సెడాన్ కారు భారత మార్కెట్ నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ కారుకు ఇప్పటికే 21,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు రిజిస్టర్ అయినట్లు కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Monday, July 4, 2011, 18:31 [IST]
English summary
Country's second largest car manufacturer Hyundai Motor India Limited (HMIL), presented the All New Fluidic Verna to Virender Sehwag and Piyush Chawla. To encourage Indian Team to win in the recently concluded ICC Cricket World Cup 2011, HMIL had announced, if the World Cup comes home then the winning Indian team will be felicitated with the All New Hyundai Verna cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+