Live Video కారును 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ట్రక్కు..!

భారత్‌లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర, జాతీయ రహదారులపై ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. జాతీయ రహదారుల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం, వేగం సహా భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు కూడా అధికంగా ఉన్నాయి.

తాజాగా జరిగిన ఘటనలో హ్యుందాయ్‌ శాంత్రో కారు ట్రక్కు వెనుక భాగాన ఇరుక్కుపోయింది. అలానే సుమారు 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Hyundai santro car dragged upto 2 km

కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో ఓ జాతీయ రహదారిపై భారీ ట్రక్కును హ్యుందాయ్‌ శాంత్రో కారు ఢీకొట్టింది. తర్వాత ట్రక్కు వెనుక భాగాన కారు చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని ట్రక్కు డ్రైవర్‌ గమనించలేదు. దీంతో అలానే వాహనాన్ని డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లిపోయాడు. కారు కూడా ట్రక్కుతోపాటు సుమారు 2 కిలోమీటర్ల దూరం అలానే ముందుకు వెళ్లిపోయింది. కారులో ఉన్న ప్రయాణికులకు ఏం చేయాలో అర్థం కాలేదు.

అదే రోడ్డులో ప్రయాణం చేస్తున్న కొందరు ప్రయాణికులు ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డు చేశారు. మరో ప్రయాణికుడు ట్రక్కు డ్రైవర్‌ను అప్రమత్తం చేసి, పరిస్థితిని వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. శాంత్రో కారులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Hyundai santro car dragged upto 2 km

రహదారులపై అప్రమత్తంగా లేకుంటే ఎంతటి ప్రమాదమో ఈ ఘటన ద్వారా వెల్లడైంది. ట్రక్కు వంటి భారీ వాహనాల ముందు, వెనుక ప్రయాణం చేస్తే ఎలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందో తెలుస్తోంది. ఈ ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో జరిగింది. జులై 17 తేదీన జరిగినట్లు తెలుస్తోంది.

భారత రోడ్లపై భారీ వాహనాల భద్రతా నిబంధనలు ఒకే విధంగా లేవు. ఆ కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సెడాన్‌, హ్యాచ్‌బ్యాక్‌ కార్లు వాటి ఎత్తు కారణంగా భారీ వాహనాలను ఢీకొట్టినప్పుడు... చాలా వరకు ట్రక్కు కిందకు వెళ్లిపోతున్నాయి. ఫలితంగా భారీగా డ్యామేజీ కావడం సహా ప్రయాణికులు గాయపడుతున్నారు.

అదే ఇతర దేశాల్లో భారీ ట్రక్కులు అండర్‌ రన్‌ బార్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వెనుక నుంచి ఏ వాహనం ఢీకొట్టిన.. ట్రక్కులోపలికి వెళ్లిపోకుండా ఈ రన్‌బార్‌ అడ్డుకుంటుంది. అయితే భారత్‌లో అటువంటి నిబంధన లేదు. ఫలితంగా కొన్ని సార్లు భారీ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.

భారీ వాహనాలకు ఉన్న అండర్‌ రన్‌ బార్‌... ప్రమాదాల సమయంలో కీలక పాత్ర పోషిస్తాయి. రన్‌ బార్‌ను కారు బంపర్‌ ఢీకొట్టిన వెంటనే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుంటాయి. ఇవి లేకుంటే ట్రక్కు కిందకు కారు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు సరైన ఘర్షణ లేక ఎయిర్‌బ్యాగ్‌లు కూడా తెరుచుకొనే అవకాశం ఉండదు.

అందువల్ల భారీ ట్రక్కులు, లారీలు, బస్సులు వెంట వాహనాలను డ్రైవ్‌ చేస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్నిసార్లు ఆయా వాహనాల బ్రేక్‌ లైట్లు పనిచేయకున్నా.. వెనుక వచ్చిన వాహనాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందువల్ల రహదారులపై నిరంతర అప్రమత్తంతో వ్యవహరించాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 19, 2023, 14:54 [IST]
English summary
Hyundai santro car stucked under the truck and car dragged upto 2 km
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+