Hyundai Venue 2023, వెన్యూ N లైన్ కార్లు విడుదల... ADAS సహా కీలక అప్‌గ్రేడ్..!
హ్యుందాయ్ మోటార్స్ భారత్‌లో అప్‌గ్రేడ్ చేసిన Hyundai venue 2023 మరియు Venue N Line వేరియంట్లను విడుదల చేసింది. హ్యుందాయ్ వెన్యూ టర్బో పెట్రోల్ వేరియంట్ ధర రూ.10,32,600(ఎక్స్‌షోరూం) నుంచి రూ.13,38,100 (ఎక్స్‌షోరూం)గా ఉంది. అదే డీజిల్ వేరియంట్ రూ.13,18,700 నుంచి రూ.13,33,700 (ఎక్స్‌షోరూం)గా ఉంది.
హ్యుందాయ్ వెన్యూ N లైన్ SUV వేరియంట్ ధరలు రూ.11,99,900గా నుంచి రూ.13,89,800 (ఎక్స్‌షోరూం)గా ఉంది. తాజాగా విడుదల చేసిన హ్యుందాయ్ కార్లలో భద్రత కోసం ADAS - అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్‌తో తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీని వేర్వేరు సంస్థలు వేర్వేరుగా పిలుస్తాయి. హ్యుందాయ్ ఈ ఫీచర్‌ను స్మార్ట్‌సెన్స్‌గా పిలుస్తోంది.

హ్యుందాయ్ తాజాగా విడుదల చేసిన కార్లలో ADAS సూట్‌లో ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, ప్రీ డెస్టినెషన్ వార్నింగ్, డ్రైవర్ డిస్ట్రాక్షన్ వార్నింగ్ ఉన్నాయి. దీంతోపాటు హైబీమ్ అసిస్ట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. తక్కువ ధరలో ADAS కలిగిన కారుగా హ్యుందాయ్ వెన్యూ నిలవనుంది.
హ్యుందాయ్ వెన్యూ కప్పా 1.0 టర్బో GDi పెట్రోల్ వెర్షన్‌లో S(O) MT ధర రూ.10,32,600, SX(O) MT ధర రూ.12,44,200, SX(O) MT డ్యూయల్ టోన్ రూ.12.59,200, SX(O) DCT ధర రూ.13,23,100గా ఉంది. SX(O) MT డ్యూయల్ టోన్ ధర రూ.13,33,700గా ఉంది.

అదే హ్యుందాయ్ వెన్యూ N లైన్ కారులో కప్పా 1.0 టర్బో GDi పెట్రోల్ వెర్షన్‌లో N6 MT ధర రూ.11,99,900, N6 MT డ్యూయల్ టోన్ ధర రూ.12,14,900, N8 MT ధర రూ.12,95,900, N8 MT డ్యూయల్ టోన్ రూ.13,10,900, N6 DCT ధర రూ.12,79,500, N6 DCT డ్యూయల్ టోన్ రూ.12,94,500, N8 DCT రూ.13,74,800, N8 DCT డ్యూయల్ టోన్ ధర రూ.13,89,800గా ఉంది.
హ్యుందాయ్ కార్లలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇంతకు ముందు ఈ ఇంజిన్ DCT గేర్‌బాక్స్‌తో మాత్రమే వచ్చేది. హ్యుందాయ్ వెన్యూ 2023 మూడు ఇంజిన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బోఛార్జడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 లీటర్ టర్బోఛార్జడ్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి.

దీంతోపాటు 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ మాన్యువల్, DCT గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు ప్రత్యేకమైనది. అయితే 5-స్పీడ్, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ గేర్‌బాక్స్‌లు నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో డీజిల్ ఇంజిన్‌లకు జతచేయబడ్డాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








