కేవలం 2.8 కి.మీ మైలేజ్ ఇచ్చిన హ్యుందాయ్ కారు.. సోషల్ మీడియాలో వైరల్ కామెంట్లు..!
గతంలో పోలిస్తే ఆటోమొబైల్ రంగంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఇంజిన్ సహా ఇతర విభాగాల్లో టెక్నాలజీ కారణంగా మైలేజీ కూడా పెరిగింది. కస్టమర్లు కూడా ఇతర స్పెసిఫికేషన్లతోపాటు అధిక మైలేజ్ ఇచ్చే వాహనాలను కోరుకుంటున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది
హ్యుందాయ్ వెన్యూ కారు మైలేజీ వివరాలు చూసి యజమాని సహా నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకుంటే మైలేజీపై భారీ ప్రభావం పడుతుంది. అయితే ఆశ్యర్యకరంగా 18 కి.మీ ఇచ్చే హ్యుందాయ్ వెన్యూ కారు కేవలం 2 కిలోమీటర్లు మైలేజ్‌ని మాత్రమే ఇచ్చింది.

బెంగళూరు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండో నగరం. అక్కడ ట్రాఫిక్ ఎంత అధ్వానంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బెంగళూరు సిటీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న హ్యుందాయ్ వెన్యూ కారు కేవలం 2.8 kmpl మైలేజ్ మాత్రమే ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతోంది.
బెంగళూరులో సాధారణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. నిర్మాణ పనులు, రోడ్ల తవ్వకాలు, రహదారు మరమ్మతులు కారణంగా కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కిలోమీటర్ లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న హ్యుందాయ్ వెన్యూ కారు యాజమాని మైలేజ్ ఫోటోలను షేర్ చేశారు.

కారు ఇన్ట్రుమెంట్ క్లస్టర్ ఫోటోను షేర్ చేశారు. ఈ కారు 52 నిమిషాల్లో కేవలం 2.9 కిలోమీటర్ల ప్రయాణాన్ని మాత్రమే చూపిస్తోంది. మొత్తం ట్రిప్ 2.8 kmpl మైలేజీని చూడవచ్చు. ట్రాఫిక్ చిక్కుకున్న సమయంలో ఎకో మోడ్‌లో వాహనం నడుపుతున్నట్లు యజమాని చెబుతున్నారు.
ఈ కారులో నార్మల్, స్పోర్ట్ అనే మరో రెండు డ్రైవింగ్ మోడ్‌లున్నాయి. ఈ రెండు డ్రైవింగ్ మోడ్‌లో ఏదో ఒకటి యాక్టివేట్ చేసి ఉంటే మైలేజీ ఇంకా తక్కువగా వచ్చేది. హ్యుందాయ్ వెన్యూలో ఎకో మోడ్‌లో ఇంధన ఆదా వ్యవస్థ ఫీచర్ ఉంటుంది.
ఈ కారు పెట్రోల్ ఇంజిన్‌తో 18kmpl మైలేజీ, అదే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 23kmpl మైలేజీ అందిస్తుందని హ్యుందాయ్ తెలిపింది. అయితే మైలేజీతో సంబంధం లేకుండా నెమ్మదిగా వెళ్లే ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఇంధనాన్ని ఆదా చేసే ఫీచర్లు కూడా విఫలం అవుతాయని అని చెప్పేందుకు ఈ ఘటన సాక్ష్యం.
అయితే ఎలాంటి కార్లు అయినా ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు మైలేజీపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసేందుకు వీలుండదు.. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ వేగంగా వాహనాలు కదులుతుంటాయి దీన్నే స్లో మూవింగ్ ట్రాఫిక్ అంటారు.
ఈ సంఘటనపై నెటిజన్లు వైరల్ కామెంట్లు చేస్తున్నారు. తనకు 6 kmpl కంటే ఎక్కువ మైలేజీ ఇచ్చిందని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి సమయంలో కారు డ్రైవింగ్ కంటే నడుచుకుంటూ వెళ్లడం మంచిదని మరొకరు కామెంట్ చేశారు. తన కారు వేగం, మైలేజీ రెండు ఒకేలా ఉన్నాయని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








