గుంటలో పడిన హ్యుందాయ్ వెన్యూ ఎట్టకేలకు బయటపడింది.. ఎలా అనుకుంటున్నారా?

చూస్తుండగానే కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ అమాంతం నేలలోకి కుంగిపోయిన సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ముంబై నగరంలో జరిగింది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్ సమీపంలో పార్క్ చేసి ఉన్న కారు క్రింద అకస్మాత్తుగా పెద్ద గుంట ఏర్పడి, క్షణాల్లో కారు అందులోకి జారిపోయింది.

గుంటలో పడిన హ్యుందాయ్ వెన్యూ ఎట్టకేలకు బయటపడింది.. ఎలా అనుకుంటున్నారా?

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. నివేదికల ప్రకారం, ఆ హ్యుందాయ్ వెన్యూ కారు పార్క్ చేసిన ప్రదేశంలో ఒకప్పుడు పెద్ద బావి ఉండేదట. దానిని అక్కడున్న బిల్డింగ్ యజమానులు దానిని మట్టితో పూడ్చేసి, దానిపై తారు రోడ్డు వేసి, పార్కింగ్ ప్రదేశంగా మార్చేశారు.

గుంటలో పడిన హ్యుందాయ్ వెన్యూ ఎట్టకేలకు బయటపడింది.. ఎలా అనుకుంటున్నారా?

ఇటీవల కాలంలో ముంబై మహానగరంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. ఈ కారణంగానే అక్కడ పూడ్చివేసిన బావిలోకి నీరు వచ్చింది. ఈ విధంగా నీరు రావడం వల్ల కారు పార్క్ చేసిన చోట మట్టి కుంగిపోయి, కారు కూడా క్షణాల్లోనే అందులోకి వెళ్లిపోయింది.

గుంటలో పడిన హ్యుందాయ్ వెన్యూ ఎట్టకేలకు బయటపడింది.. ఎలా అనుకుంటున్నారా?

మునిగిపోయిన వెన్యూ కారు పక్కనే మరికొన్ని కార్లు కూడా పార్క్ చేసి ఉన్నాయి. కానీ వాటికి ఏమాత్రం ప్రమాదం జరగలేదు. ఈ బావిలోకి కూరుకుపోయిన హ్యుందాయ్ వెన్యూ 4 మీటర్ల పొడవు ఉంటుంది. కానీ అదృష్టవశాత్తూ సంఘటన జరిగిన సమయంలో ఎవరూ కారులో లేరు.

గుంటలో పడిన హ్యుందాయ్ వెన్యూ ఎట్టకేలకు బయటపడింది.. ఎలా అనుకుంటున్నారా?

హ్యుందాయ్ వెన్యూ ఆ గుంటలోకి వెళ్ళిపోయిన చాలా సమయం తరువాత చాలా కష్టంతో దానిని బయటకు తీయడం జరిగింది. దీనిని రాత్రి, ఒక క్రేన్ సహాయంతో ఎట్టకేలకు బావి నుంచి బయటకు తీసారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేసి ఉంచుతారు. ప్రస్తుతం ఇలాంటి వాటిని పోలీసులు అడ్డుకుంటున్నారు.

గుంటలో పడిన హ్యుందాయ్ వెన్యూ ఎట్టకేలకు బయటపడింది.. ఎలా అనుకుంటున్నారా?

కారు అక్కడ గుంటలో పడిన తర్వాత, బయటకు తీయబడింది. కానీ కారు ఏమైనా దెబ్బతినిందా అనేదానిపై స్పష్టమైన సమాహారం అందుబాటులో లేదు. అయితే ఇక్కడ ఫోటోలను గమనించినట్లయితే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

గుంటలో పడిన హ్యుందాయ్ వెన్యూ ఎట్టకేలకు బయటపడింది.. ఎలా అనుకుంటున్నారా?

మునిగిపోయిన కొన్ని గంటల తర్వాత కారును పైకి ఎత్తడం వల్ల ఈ కారులోని ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. కారు లోతైన లోయలో పడి పైకి ఎత్తినప్పుడు దెబ్బతింది. కారు ముందు భాగంలో చాలా ఎక్కువగా దెబ్బతిన్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు. ఏది ఏమైనా మొత్తానికి ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Most Read Articles

English summary
Car Rescued From Sinkhole Mumbai Latest Update Of Hyundai Venue Mishap. Read in Telugu.
Story first published: Tuesday, June 15, 2021, 13:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X