Car accident స్కూటర్‌పైకి దూసుకెళ్లిన కారు.. సీసీ ఫుటేజ్ వైరల్.. ఇక్కడ తప్పెవరిది?
నిత్యం రోడ్డుపై వేల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఈ యాక్సిడెంట్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం మన అరచేతిలో వచ్చి వాలుతున్నాయి. యాక్సిడెంట్స్ వీడియోలు సీసీటీవీలలో రికార్డ్ అవుతున్నాయి. ఇవి కొంచెం భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఓ హైవేపై ఓ ప్రమాద వీడియో వైరల్‌గా మారింది.
భారతీయ రహదారులపై ప్రతిరోజూ అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎంత జాగ్రత్తగా వాహనం నడుపుతున్నా.. ఎదురుగా లేదా వెనుక నుంచి వచ్చేవారు అప్రమత్తంగా లేకపోవడం వల్ల నష్టం వాటిల్లుతుంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ రోడ్డుపై వేగంగా వెళ్తున్న హ్యుందాయ్ వెన్యూ కారు అకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

CCTV ఫుటేజీలో హ్యుందాయ్ వెన్యూ కారు సింగిల్-లేన్ రోడ్డులో వస్తున్నట్లు కనిపిస్తుంది. రహదారి ఖాళీగా ఉండటంతో డ్రైవర్ వేగంగా కారు నడుపుతుండటం గమనించవచ్చు. ఈ క్రమంలో కారు ఒక జంక్షన్‌కి చేరుకోగానే ఓ స్కూటర్ అకస్మాత్తుగా వెన్యూకి ఎదురుగా వస్తోంది. కారు అతివేగంతో ఉండటంతో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు తప్పించుకోలేకపోయారు.
ఈ క్రమంలో వెన్యూ డ్రైవర్ అకస్మాత్తుగా స్కూటర్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత కారు స్కూటర్ తో పాటు కొంచెం దూరం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు గాలిలో ఎగిరి కిందపడ్డారు. అదృష్టవశాత్తూ వారిద్దరికి గాయాలు కాలేదు. వారు సురక్షితంగా బయటపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

అయితే ఇక్కడ తప్పు ఎవరిది? : ఇక ఈ ప్రమాదం విషయానికొస్తే ఇక్కడ తప్పెవరిదో సీసీ ఫుటేజీ చూస్తే అర్థమైపోతుంది. స్కూటరిస్టు, వెన్యూ డ్రైవర్ ఇద్దరూ ఇక్కడ తప్పు చేశారు. రెండు వాహనాలు జంక్షన్‌కు చేరుకున్నాక ఓ సారి రహదారిని పరిశీలించారు. కానీ వారిక్కడ ఆ పని చేయలేదు. దీంతో స్కూటరిస్టు అకస్మాత్తుగా వెన్యూకి ఎదురుగా రాకపోవడంతో డ్రైవర్ బ్రేకులు వేయడానికి సమయం సరిపోలేదు. ఒకవేళ కారు డ్రైవర్ తక్కువ వేగంతో వచ్చిఉంటే ఈ ప్రమాదం తప్పేది.
అదేవిధంగా హ్యుందాయ్ వెన్యూ రాంగ్ లైన్‌లో వస్తుంది. భారత్‌లో వాహనదారులు రహదారికి ఎడమ వైపున డ్రైవ్ చేస్తారు. కానీ హ్యుందాయ్ డ్రైవర్ కుడి వైపుగా వస్తున్నారు. ఈ విషయం గమనించని స్కూటరిస్టు ఎదురుగా రావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్పందించిన సైబరాబాద్ పోలీసులు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని నిర్ధారించారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జంక్షన్లలో వేగాన్ని తగ్గించండి : రహదారి భద్రతను నిర్ధారించడానికి క్రాసింగ్ వద్దకు వెళ్లేటప్పుడు వేగాన్ని తగ్గించాలి. హైవేలపై ప్రయాణించేటప్పుడు పట్టణాలు మరియు గ్రామాల వంటి జనావాస ప్రాంతాల గుండా వెళ్లేటప్పుడు కూడా వేగం తగ్గించడం అవసరం. పాదచారుల క్రాసింగ్‌లు ఉన్నప్పటికీ చాలా మంది వ్యక్తులు సమయాన్ని ఆదా చేయడానికి రోడ్డుపైనే దాడుతుంటారు. అలాంటి రోడ్లపై జంతువులు మరియు పశువులను ఎదుర్కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








