Car Dashcam ఎడ్ల బండిని ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు.. వెనక కారు కెమెరాలో రికార్డైన దృశ్యాలు.. వీడియో వైరల్
చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం వహిస్తారు దీని కారణంగా ప్రమాదాలకు గురవుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అలసత్వం వహిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇతరులు చేసే తప్పిదాల వల్ల ప్రమాదం ఎక్కడి నుంచి పొంచి ఉంటుందో అంచనా వేయలేము. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా శ్రద్ధ అవసరం.
మీరు చేసిన తప్పిదాలు కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవ్వవచ్చు. అయితే నేడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ కారణంగా ఏదైనా ప్రమాదాలు జరిగితే అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ప్రమాదం కారు డాష్ కామ్ బోర్డులో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఎడ్ల బండిని ఢీ కొట్టి కారు బోల్తా పడిన సంఘటన తమిళనాడులోని తెన్కాశి - రాజపాళ్యం రోడ్డుపై జరిగింది. వీడియోలో సింగిల్ లేన్ రహదారిపై కారు ప్రయాణిస్తోంది. ఈ వీడియో ప్రకారం హ్యుందాయ్ వెన్యూ కారు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రెప్పపాటులో ఊహించిన విధంగా కారు ప్రమాదానికి గురైంది.
స్పీడుగా వెళుతున్న హ్యుందాయ్ వెన్యూ కారు రోడ్డు పక్కన వెళ్తున్న ఎడ్ల బండిని ఢీకొట్టింది. ఎడ్ల బండి కుడివైపు ఉన్న చక్రాన్ని ఢీ కొట్టి కారు పల్టీ పడింది. డ్రైవర్ అప్రమత్తగా లేకపోవడం వల్లే కారు పల్టీ కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా పైకి లేచి బోల్తా పడిన కారు మళ్లీ యధా స్థానానికి (చక్రలపై) నిలబడింది.

ఈ వాహనంలో ముగ్గురు ప్రయాణికులు ఉండగా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అందులో ఉన్న వారెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అలానే ఎడ్ల బండిపై ఉన్న వ్యక్తికి కూడా ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
భారతదేశంలో ప్రమాదాలకు ప్రధాన కారణాలలో డ్రైవర్ అజాగ్రత్త ఒకటి. ముందు ఉన్న వాహనాలపై డ్రైవర్ దృష్టి పెట్టకపోవడం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫోన్ లో మాట్లాడటం, మెసేజ్ లు పంపడం వల్ల ప్రమాదాలు జరగడం మనం ఎన్నో చూశాం. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇటువంటి వాటికి దూరంగా ఉంటే మీ ప్రాణాలతో పాటు ఇతరులకు ఎలాంటి హాని కలిగించని వారు అవుతారు.

ప్రస్తుతం చాలా కంపెనీలు డాష్ బోర్డ్ కెమెరాలను అందిస్తున్నాయి. రహదారులపై జరిగే ప్రమాదాలు మరియు నేరాలను రికార్డ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రమాదం లేదా నేరం జరిగినప్పుడు వీటి ఫుటేజీ కీలక సాక్ష్యంగా ఉంటుంది, ఇది భీమా క్లెయిమ్లను దాఖలు చేసే ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. అదనంగా, హై-ఎండ్ డ్యాష్ బోర్డు కెమెరాలలో మోషన్-డిటెక్షన్ టెక్నాలజీని కూడా ఉంటుంది.
డ్యాష్ బోర్డ్ కెమెరాను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.యాక్సిడెంట్ లేదా నేరం జరిగినప్పుడు సాక్ష్యంగా అలానే ఒక ప్రమాదంలో మీ నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ఇవి ఉపయోగపడనున్నాయి. ప్రమాదంలో పాల్గొన్న ఇతర డ్రైవర్ ని గుర్తించడానికి, నేరాలను పరిష్కరించడానికి పోలీసులకు సహాయపడటానికి మరియు మీ నష్టానికి మీ భీమా సంస్థను చెల్లించడానికి డాష్కామ్ ఫుటేజీని ఉపయోగించవచ్చు.
రోడ్డుపై జరిగే ప్రతిదాన్ని రికార్డ్ చేసే డాష్కామ్ మీ వద్ద ఉందని తెలుసుకోవడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది సురక్షితంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది. నేరాలకు అడ్డుకట్టగా ఇది సహాయ పడుతుంది. ఇవి సరసమైనవి, ఉపయోగించడానికి సులభమైనవి కాబట్టి డ్యాష్ కామ్ ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








