Just In
- 2 hrs ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 2 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 4 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 4 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- Movies
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో పోస్ట్.. అదేంటో చూసారా ?
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో చాలా చురుకుగా ఉంటారు. దేశంలో మరియు విదేశాలలో జరుగుతున్న ఆసక్తికరమైన విషయాలు వారి ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటాడు. ఇటీవల ఆనంద్ మహీంద్రా భారత వైమానిక దళం హెలికాప్టర్ ఫోటోని ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలో వైమానిక దళం హెలికాప్టర్ మహీంద్రా ట్రాక్టర్ ఎత్తడం చూడవచ్చు.

మహీంద్రా ట్రాక్టర్‌కు మాత్రమే 11,000 అడుగుల ఎత్తులో ప్రయాణించే శక్తి ఉందని ఆనంద్ మహీంద్రా రాశారు. ఆనంద్ మహీంద్రా రాసిన ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు 100 కి పైగా రీట్వీట్లు, 2.5 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. లడఖ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ నుండి వేలాది అడుగుల దూరం ప్రయాణించడానికి భారత వైమానిక దళం హెలికాప్టర్లను ఉపయోగిస్తుంది.

ఈ ప్రదేశాలలో, భారీ వస్తువులను రవాణా చేయడానికి వైమానిక దళం ట్రాక్టర్లను ఉపయోగిస్తుంది. మహీంద్రా భారత సైన్యం కోసం సాయుధ వాహనాలను కూడా ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:భారత మార్కెట్లో డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఎస్ బిఎస్ 6 బైక్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

అదనంగా మహీంద్రా యాంటీ ల్యాండ్‌మైన్, క్యారేజ్ వెహికల్ మరియు మిలిటరీ కోసం అనేక తేలికపాటి మరియు భారీ వాహనాలను కూడా ఉత్పత్తి చేస్తుంది.

ఇటీవల, ఆనంద్ మహీంద్రా బీహార్ లో 3 కిలోమీటర్ల కాలువ తవ్విన లాంగ్ భూయాన్ అనే రైతుకు ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన సమాచాన్ని ఇదివరకటి కథనాన్లో తెలియజేయడం జరిగింది. లూంగ్ భూయాన్ తన గ్రామంలో వ్యవసాయానికి నీటి సమస్యను తగ్గించడానికి 30 సంవత్సరాల కృషితో 3 కిలోమీటర్ల పొడవైన కాలువను నిర్మించాడు.
MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన BMW X3 M ; ధర & ఇతర వివరాలు

అతను చేసిన ఈ కృషికి ఫలితంగా ప్రేరణపొందిన ఆనంద్ మహీంద్రా ట్రాక్టర్ బహుమతి ఇచ్చారు. ట్రాక్టర్ గిఫ్ట్ గా పొందిన ఆ వ్యక్తి ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆనంద్ మహీంద్రా ట్రాక్టర్ గిఫ్ట్ గా ఇవ్వడం గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అంతే కాకుండా ఇటీవల ఆనంద్ మహీంద్రా లైబ్రరీగా మార్చబడిన బొలెరో ఫోటోని కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆనంద్ మహీంద్రా ఇండియన్ ఆటోమొబైల్ లో తమకంటూ ఉన్న ప్రత్యేకతను ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కువగా అదరణపొందుతున్న వాహనాల జాబితాలో మహీంద్రా వాహనాలు ఎక్కువగా ఉన్నాయి.