యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజెన్ ట్యాంకర్స్ సరఫరా

భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. ఆక్సిజెన్ కొరత కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో, కరోనా రోగులు ఉన్న ఆసుపత్రులకు అత్యంత వేగంగా ఆక్సిజన్ సరఫరా చేయడానికి భారత వైమానిక దళం తమ యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది.

యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజెన్ ట్యాంకర్స్ సరఫరా

భారత వైమానిక దళానికి చెందిన గ్లోబ్ మాస్టర్ సి-17 మరియు ఇల్యూసిన్ ఐఎల్76 యుద్ధ విమానాలలో ఆక్సిజెన్ ట్యాంకర్ ట్రక్కులను రవాణా చేస్తున్నారు. ఈ ట్రక్కులను రోడ్డు మార్గం ద్వారా తీసుకువెళ్లడానికి ఆరు రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో, వీలైనంత త్వరగా వీటిని ఆస్పత్రులకు చేర్చేందుకు ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.

యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజెన్ ట్యాంకర్స్ సరఫరా

దేశవ్యాప్తంగా కరోనా రోగులకు చికిత్స అందించే ఆసుపత్రులలో ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఒక ప్రధాన సమస్యగా మారింది. ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా రోగులు చనిపోతున్న సంఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేస్తున్నాయి.

MOST READ:డ్రోన్ సర్వీస్ ద్వారా కరోనా వ్యాక్సిన్ మరింత వేగవంతం; ఐసిఎంఆర్

యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజెన్ ట్యాంకర్స్ సరఫరా

తెలంగాణలో కోవిడ్ బాధితుల కోసం, యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్‌ సరఫరాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదం తెలిపారు. యుద్ధ విమానాల్లో ఆక్సిజెన్ ట్యాంకర్ల ద్వారా రాష్ట్రానికి ఆక్సిజన్‌ను తీసుకువస్తున్నారు.

యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజెన్ ట్యాంకర్స్ సరఫరా

ఖాలీ ఆక్సిజన్‌ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయల్దేరాయి. భువనేశ్వర్‌ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి రానుంది.

MOST READ:అలెర్ట్.. అక్కడ కలర్ కోడెడ్ స్టిక్కర్ సిస్టమ్ బంద్; కొత్త సిస్టమ్ స్టార్ట్

యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజెన్ ట్యాంకర్స్ సరఫరా

మొత్తం 8 ఖాళీ ట్యాంకర్లతో కూడిన ట్రక్కులను హైదరాబాద్‌ నుంచి విమానాల్లో తీసుకెళ్లారు. ఈ విధానం ద్వారా అతి త్వరగా ఆక్సిజన్ ట్యాంకర్లు మన రాష్ట్రానికి చేరుకుంటాయి. ఆక్సిజన్‌ సరఫరా కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రయత్నం చేయడం విశేషం.

యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజెన్ ట్యాంకర్స్ సరఫరా

ఈ విషయంలో భారత వైమానిక దళం గ్లోబ్‌మాస్టర్ సి-17 మరియు ఇల్యూసిన్ ఐఎల్-76 మిలిటరీ కార్గో విమానాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. యుద్ధ సమయాల్లో కూడా ఈ విమానాలు సైనికులకు అవసరమైన సామాగ్రిని రవాణా చేయటంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

MOST READ:కరోనా టైమ్‌లో ఆటో సర్వీస్ ఫ్రీ.. కేవలం వారికి మాత్రమే.. ఎక్కడంటే

యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజెన్ ట్యాంకర్స్ సరఫరా

ఈ విమానాలు సాధారణంగా పెద్ద సైనిక ట్రక్కులు, సైనిక పరికరాలు, ఫిరంగులు, ఆయుధాలు మరియు సాయుధ దళాలను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక్కో విమానంలో నాలుగు ఆక్సిజన్ ట్యాంకర్ల చొప్పున మొత్తం ఎనిమిది భారీ ట్యాంకర్లను ఈ విమానంలో లోడ్ చేశారు.

యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజెన్ ట్యాంకర్స్ సరఫరా

రష్యాకు చెందిన ఇల్యూసిన్ ఐఎల్76 కార్గో విమానం సుమారు 40 టన్నుల బరువును మోయగలవు. ఈ విమానం 4 ఇంజన్లతో పనిచేస్తుంది మరియు గంటకు 850 కిమీ వేగంతో ప్రయాణించగలదు. భారత వైమానిక దళంలో 14 ప్రముఖ ఐఎల్76 విమానాలు ఉన్నాయి.

MOST READ:శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజెన్ ట్యాంకర్స్ సరఫరా

ఇక గ్లోబ్ మాస్టర్ సి-17 విషయానికి వస్తే, ఈ విమానాన్ని అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ రూపొందించింది. ఈ విమానంలో 80 టన్నుల సరుకును రవాణా చేయవచ్చు. ఈ విమానం కూడా 4 ఇంజన్లతో నడుస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 830 కిమీ వేగం ప్రయాణిస్తుంది.

Most Read Articles

English summary
IAF Deployed Globemaster C17 And Ilyushin IL76 Planes To Transport Oxygen Trucks To Hospitals. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X