దీన్ని ఎవరైనా రీఫండ్ అంటారా?.. రూ.13 వేలతో టికెట్ కొంటే 20 రూపాయలు రిటర్న్.. ఐఏఎస్ ఆఫీసర్ అవాక్..

విమాన ప్రయాణం చేయాలంటే టికెట్‌ ధర వేలల్లో ఉంటుంది. అయితే ఒక్కోసారి మనం జర్నీ క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వస్తే బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ టికెట్లకు విమాన సంస్థలు తమ పాలసీలను బట్టి నగదును ప్రయాణికులకు రీఫండ్ చేస్తుంటాయి.

అయితే ఇక్కడ ఓ ఐఏఎస్‌ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. విమాన టికెట్‌ క్యాన్సల్‌ చేసుకున్న తనకు రీఫండ్ విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. రూ. 13,820 ల విలువైన టికెట్‌ను రద్దు చేసుకుంటే, అన్ని ఛార్జెస్ పోనూ ఆయనకు రూ.20 మాత్రమే వచ్చాయి. పూర్తి సమాచారాన్ని ఈ కథనంలో చదవండి.

Flight-Ticket-Refund

రాహుల్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి ఇటీవల విమానంలో ప్రయాణించేందుకు ఆన్‌లైన్‌లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ టికెట్ కోసం రూ. 13,820 చెల్లించాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల విమాన ప్రయాణం చేయలేకపోయారు. తన ఫ్లైట్‌ జర్నీని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను రాహుల్‌ కుమార్‌ అనే ఐఏఎస్‌ అధికారి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఈ సంఘటన విమానయాన సంస్థలు వసూలు చేసే రుసుములను మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఒక టికెట్‌ని రద్దు చేసుకుంటే క్యాన్సలేషన్ ఛార్జీలతో పాటు, కన్వీనియెన్స్ ఫీజు, కాస్ట్ టు ఎయిర్‌లైన్ అంటూ ఇతర రుసుములు కలిపితే చివరికి ప్రయాణికుడికి దక్కేది కొంతే అని ఈ సంఘటన ద్వారా అర్థమవుతోంది.

Flight-Ticket-Refund

మొత్తంగా ఫ్లెట్‌ జర్నీని రద్దు చేసుకున్నందుకు ఎయిర్‌లైన్ రద్దు రుసుము రూ. 11,800, GI రద్దు ఫీజు రూ. 1200, GI కన్వీనియన్స్ ఫీజు రూ. 800 ఇలా మొత్తం రూ. 13800 కట్‌ చేసుకుని రూ. 20 రీ ఫండ్‌ చేశారు. ఇది చూసి షాక్ అవ్వడం అధికారి వంతైంది. తన రీఫండ్ డబ్బును ఇన్వెస్ట్ చేసేందుకు మంచి ఐడియా ఇవ్వాలని తన ట్విట్టర్ పేజీలో వ్యంగ్యంగా షేర్ చేశారు.

ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌కు లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. దీనిపై యూజర్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తక్కువ ధరలకు టిక్కెట్లను విక్రయించే ఆన్‌లైన్ పోర్టళ్లు, క్యాన్సలేషన్ల రూపంలో భారీగా ఛార్జ్‌ చేస్తూ వాటిని తిరిగి వసూలు చేసుకుంటున్నారు. ఇది సరైంది కాదని ఓ నెటిజన్‌ వెల్లడించారు.

వచ్చిన రీఫండ్ డబ్బులతో వడా పావ్‌ తినవచ్చని ఓ నెటిజన్‌ ఫన్నీగా స్పందించారు. ఎయిర్‌లైన్స్ అధికారిక యాప్, వెబ్‌సైట్ నుంచి మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని.. ధర ఎక్కువగానే ఉంటున్నా, రీఫండ్ సమయంలో వారు థర్డ్ పార్టీ యాప్‌ల కంటే మెరుగ్గా రిఫండ్ చేస్తారని అని మరో యూజర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టైం మిషన్‌ని తయారుచేసుకుని, కాలంలో వెనక్కి వెళ్లి మనం ఎక్కువ ఖర్చు చేసి చింతించే వాటిని మళ్లీ చేయకుండా చేసుకోవాలని ఓ నెటిజన్‌ కామెంట్ చేశారు. ఈ రీఫండ్‌ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వండంటూ.. ఇలా పలు రకాల ఫన్నీ కామెంట్లతో నెటిజన్లు ఈ సంఘటనపై స్పందించారు.

విమాన టిక్కెట్ల రద్దు వల్ల ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే సమస్య ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. విమాన టిక్కెట్ల రద్దు సమయంలో అధిక ఛార్జీలు వసూలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏ కారణం చేతనైనా ప్రజలు విమాన ప్రయాణానికి దూరంగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో విమానయాన సంస్థలు ఈ పని చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 19, 2023, 13:15 [IST]
English summary
Ias officer gets rs 20 refund after canceling a flight ticket
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+