ఫోక్స్‌‌వ్యాగన్ బీటెల్ కారును బంతిలా మార్చేశారు

By Ravi

కారును బంతి (స్పిరికల్) లేక చదరం (స్కేర్) ఆకారంలో మారిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఇండోనేషియాలోని జకార్తాకు చెందిన ఆర్టిస్ట్ ఇక్వాన్ నూర్ ఈ విశిష్టమైన ఆర్ట్‌ను రూపొందించారు. అతను పాత కార్లను సేకరించి, వాటిని ఇలా కళాఖండాలుగా మార్చేసి ఓ విశిష్టమైన లుక్‌ని ఇచ్చేలా చేస్తుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, కార్లను ఇలా జియోమెట్రికల్ షేపుల్లోకి మార్చేస్తాడు.

ఇక్వాన్ నూర్ లేటెస్ట్ కలెక్షన్‌లో ఓ పసుపు రంగు 1593 ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారు చెప్పుకోదగినది. ఆయన ఈ కారును గోళాకారంలోకి మార్చేశాడు. గడచిన నెలలో జరిగిన అర్ట్ బేసెల్ హాంగ్ కాంగ్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఆర్ట్ వెనుక దాగి ఉన్న రహస్యాన్ని నూర్ వెల్లడించలేదు. మరి కార్లను ఇలా క్లిష్టమైన షేపుల్లోకి ఎలా మార్చారా అనేదే కదా మీ సందేహం.

గోళాకారంలో మలచిన ఈ బీటెల్ కారు గమనిస్తే, పూర్తిగా ఒరిజినల్‌గా కారులో ఉండే విడిభాగాలను ఇందులో ఉపయోగించలేదని తెలుస్తోంది. ఈ కారు అద్దాలను గమనిస్తే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నూర్ బీటెల్ కారును కేవలం గోళాకారంలోనే కాకుండా, చతురస్రాకారంలో కూడా మలచాడు. మరి ఈ విచిత్రమైన కార్ ఆర్ట్‌ను మన కూడా చూసొద్దాం రండి..!

ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారును గోళాకారంలోకి మార్చారు

ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారును గోళాకారంలోకి మార్చారు

బంతి షేపులో బీటెల్

బంతి షేపులో బీటెల్

బీటెల్ టైర్లు

బీటెల్ టైర్లు

కలిసిపోయిన బీటెల్ ఫ్రంట్, రియర్ బంపర్స్

కలిసిపోయిన బీటెల్ ఫ్రంట్, రియర్ బంపర్స్

ఒరిజినల్‌గా కనిపించని బీటెల్ కారు అద్దాలు

ఒరిజినల్‌గా కనిపించని బీటెల్ కారు అద్దాలు

ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ స్పిరికల్ ఆర్ట్

ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ స్పిరికల్ ఆర్ట్

ఇక్వాన్ నూర్ కార్ ఆర్ట్

ఇక్వాన్ నూర్ కార్ ఆర్ట్

గోళాకారపు బీటెల్ కారును వీక్షిస్తున్న సందర్శకురాలు

గోళాకారపు బీటెల్ కారును వీక్షిస్తున్న సందర్శకురాలు

బీటెల్ ఆర్ట్ కార్ వద్ద ఫొటోలకు ఫోజులు

బీటెల్ ఆర్ట్ కార్ వద్ద ఫొటోలకు ఫోజులు

గోళాకారంలో బీటెల్

గోళాకారంలో బీటెల్

అర్ట్ బేసెల్ హాంగ్ కాంగ్‌లో

అర్ట్ బేసెల్ హాంగ్ కాంగ్‌లో

ఇక్వాన్ నూర్ బీటెల్ కార్ ఆర్ట్

ఇక్వాన్ నూర్ బీటెల్ కార్ ఆర్ట్

ధీర్ఘచతురస్రాకారంలో బీటెల్ కారు

ధీర్ఘచతురస్రాకారంలో బీటెల్ కారు

బాక్స్ షేపులో మలచిన కారు

బాక్స్ షేపులో మలచిన కారు

ఘనం ఆకారంలో బీటెల్ కారు

ఘనం ఆకారంలో బీటెల్ కారు

క్యూబ్ షేపులో బీటెల్ కారు

క్యూబ్ షేపులో బీటెల్ కారు

బీటెల్ హెడ్‌ల్యాంప్స్

బీటెల్ హెడ్‌ల్యాంప్స్

ఫోక్స్‌వ్యాగన్

ఫోక్స్‌వ్యాగన్

More from DriveSpark

Article Published On: Wednesday, June 5, 2013, 12:51 [IST]
English summary
Ichwan Noor, an artist from Jakarta, Indonesia has a unique style of art. He takes cars and turns them into art - by literally compressing them into geometrical shapes. His latest creation is a yellow 1953 VW Beetle that he has been turned into a perfect, shiny sphere. The art was put on display at last month's Art Basel Hong Kong.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+