జంతువులు, కీటకాల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన కార్లు

By Ravi

జంతువులకు ఆటోమొబైల్స్‌కు సంబంధం ఏంటి? దీని గురించి చెప్పుకోవాలంటే చాంతాడంత లిస్టే అవుతుంది. నేటి ఆధుని మానువుడు అనేక అద్భుతాలు సృష్టించడం వెనుక కొన్ని రకాలం జంతువుల ప్రేరణ తప్పకుండా ఉందనే చెప్పాలి. గాలిలో ఎగిరే పక్షి నుంచి స్ఫూర్తి పొంది విమానం తయారు చేసినట్లుగా, వివిధ జంతువులను నుంచి స్ఫూర్తి పొంది ఆటోమొబైల్ వాహనాలను తయారు చేశారు.

అందుకే, కొన్ని రకాల వాహనాలకు వాటి అర్థాలు వచ్చే పేర్లనో, ఆయా జంతువులు పేర్లనో ఉపయోగించారు. మరికొన్ని సందర్భాల్లో జంతువులు, కీటకాలు, సరీసృపాలను నుంచి స్ఫూర్తి పొంది వాహనాలను డిజైన్ చేశారు. చిరుత, జింక, గుర్రం వంటి జంతువులలో వేగాన్ని స్ఫూర్తి పొంది పెర్ఫామెన్స్‌ కార్లను తయారు చేయటం, అందమైన పురుగులు, చేపల నుంచి స్ఫూర్తి పొంది కార్లను డిజైన్ చేయటం ఇలా వివిధ జీవాల్లోని ఏదో ఒక అంశం నుంచి స్ఫూర్తి పొంది కార్లను తయారు చేయటం జరిగింది.

అలాంటి విశిష్టమైన వాహనాల గురించే ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

చెవర్లే

చెవర్లే

ఆఫ్రికన్ జింకల నుంచి స్ఫూర్తి పొంది చెవర్లే కార్ బ్రాండ్‌కు ఆ పేరు పెట్టినట్లు సమాచారం. ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు 1958 మోడల్ ఇంపాలా కూపే. అప్పట్లో అది అత్యంత ఖరీదైన కారు. 1965వ సంవత్సరం వరకు మాత్రమే ఈ కారును ఉత్పత్తి చేశారు.

జాగ్వార్ ఈ-టైప్

జాగ్వార్ ఈ-టైప్

అడవిపిల్లిగా పిలిచే జాగ్వార్ (ఒకరకమైన పులి) నుంచి స్ఫూర్తి పొంది ఈ కార్ బ్రాండ్‌కు ఆ పేరును పెట్టారు. కార్ లోగోలో కూడా జాగ్వార్‌ను గమనించవచ్చు. ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు జాగ్వార్ ఈ-టైప్. ఆటో ప్రపంచంలో జాగ్వార్ ఈ-టైప్ కూపే ఓ దిగ్గజం. అందమైన డిజైన్, పెర్ఫామెన్స్‌లకు ఈ కారు పెట్టింది పేరు.

ఫోర్డ్ మస్టాంగ్

ఫోర్డ్ మస్టాంగ్

అడవి గుర్రాల నుంచి స్ఫూర్తి పొంది మస్టాంగ్ బ్రాండ్‌కు ఆ పేరు పెట్టారు. 1964లో తొలిసారిగా ఫోర్డ్ ఈ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. పెర్ఫామెన్స్ కార్లకు మస్టాంగ్ పెట్టింది పేరు. అడవి గుర్రాల మాదిరిగా ఫోర్డ్ మస్టాంగ్ కార్లు కూడా చాలా ధృఢంగా ఉంటాయి.

సన్‌బీమ్ టైగర్

సన్‌బీమ్ టైగర్

పులి నుంచి స్ఫూర్తి పొంది బ్రీటీష్ కార్ కంపెనీ సన్‌బీమ్ ఈ కారుకు ఆ పేరును పెట్టింది. 1964వ సంవత్సరానికి చెందిన ఈ టైగర్ మోడల్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ కార్ డిజైనర్ కరోల్ షెల్బీ డిజైన్ చేశారు.

ఫోక్స్‌వ్యాగన్ బీటెల్

ఫోక్స్‌వ్యాగన్ బీటెల్

పేడ పురుగు (బీటెల్) లాంటి ఓ కీటకం నుంచి స్ఫూర్తి పొంది జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ తమ బీటెల్ కారును డిజైన్ చేసింది. దశాబ్ధాలు మారినా ఈ కార్ డిజైన్‌లో మాత్రం పెద్ద మార్పులు రాలేదు. ఈ కారు కూడా చూడటానికి పురుగు ఆకారంలోనే ఉంటుంది.

డాడ్జ్ సూపర్ బీ

డాడ్జ్ సూపర్ బీ

తేనటీగ నుంచి స్ఫూర్తి పొంది డాడ్జ్ కార్ మేకర్ తమ కార్లకు సూపర్ బీ అనే పేరును పెట్టింది. 60వ శతాబ్ధంలో డాడ్జ్ సూపర్ బీ పేర్లతో కార్లను విక్రయించింది. ఆ తర్వాత 2007లో తిరిగి ఈ పేరును ఉపయోగించింది. ప్రతి ఏటా లిమిటెడ్ ఎడిషన్ డాడ్జ్ చార్జర్ సూపర్ బీ మోడళ్లు విడుదలవుతూనే ఉంటాయి.

ప్లైమౌత్ బర్రాక్యుడా

ప్లైమౌత్ బర్రాక్యుడా

నీటిలో సంచరించే ఓ రకమైన భయంకర చేప నుంచి స్ఫూర్తి పొంది ప్లైమౌత్ తమ కారుకు ఈ పేరును పెట్టింది. క్రిస్లర్‌కు చెందిన ప్లైమౌత్ తమ బర్రాక్యుడా కారుకు ఈ పేరును పెట్టింది. అప్పట్లో ఫుల్ సైజ్ టూ డోర్ పెర్ఫామెన్స్ కారు. తొలి బర్రాక్యుడా కారును 1964లో ఉత్పత్తి చేశారు. ఆ తర్వాతి దశాబ్ధానికి కాలానికి చరిత్రలో కలిసిపోయింది.

చెవర్లే కార్వెట్టే స్టింగ్‌రే

చెవర్లే కార్వెట్టే స్టింగ్‌రే

అమెరికాకు చెందిన చెవర్లే అందిస్తున్న పూరాతన కార్ బ్రాండ్ కార్వెట్టేను ప్రస్తుతం స్టింగ్‌రే అని పిలుస్తున్నారు. సముద్రంలో సంచరించే ఓ రకమైన చేప ఆకారంలో వేవ్ డిజైన్‌ను ఈ కారులో గమనించవచ్చు. ఇటీవలే చెవర్లే తమ 2014 కార్వెట్టే స్టింగ్‌రే కారును విడుదల చేసింది.

ఏసి కోబ్రా

ఏసి కోబ్రా

నల్లత్రాచు (కోబ్రా) పాము నుంచి స్ఫూర్తి పొంది కార్లకు ఈ పేరును పెట్టారు. అనేక ఫోర్డ్ వాహనాల్లో కోబ్రా బ్రాండ్‌ను, లోగోను చూడొచ్చు. ప్రత్యేకించి పెర్ఫామెన్స్ కార్లలో ఈ పేరును ఎక్కువగా ఉపయోగించారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న 1962 మోడల్ ఏసి కోబ్రా కారు. అప్పట్లో ఇది అత్యంత పవర్‌ఫుల్ కారుగా నిలిచింది.

ఎస్ఆర్‌టి వైపర్

ఎస్ఆర్‌టి వైపర్

కొండచిలువ పాము నుంచి స్ఫూర్తి పొంది ఈ కారుకు ఆ పేరును పెట్టారు. ఎస్ఆర్‌టి వైపర్ (గతంలో ఈ కారును డాడ్జ్ వైపర్ అని పిలిచేవారు)ను క్రిస్లర్‌కు చెందిన డాడ్జ్ డివిజన్ ఉత్పత్తి చేసేది. ప్రస్తుత వెర్షన్ ఎస్‌ఆర్‌టి వైపర్ కారులో శక్తివంతమైన వి10 ఇంజన్‌ను ఉపయోగించారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 17, 2013, 16:34 [IST]
English summary
Automakers for years have relied on animals to imbued their cars with qualities from their wildlife counterparts. Not just the names, but also how many cars look have a lot to do with animals that capture our imagination. The following list highlights a few such iconic cars and the animals which inspired their makers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+