యూకేలో 'బెస్ట్ ఇన్ క్లాస్' అవార్డును గెలుచుకున్న మైసూర్ మహారాజు కారు.. ఇప్పుడు ఇది ఎవరి వద్ద ఉందంటే..?

పారిశ్రామికవేత్త యోహాన్ పూనావాలాకు చెందిన బెంట్లీ మార్క్ 6 (Bently Mark VI) యూకే లో జరిగిన ఆర్ఆర్ఈసి కాంకోర్స్ డి'ఎలిగాన్స్ (RREC Concours d'Elegance) లో 'బెస్ట్ ఇన్ క్లాస్' అవార్డును గెలుచుకుంది. ఈ ఐకానిక్ క్లాసిక్ కారును 'మైసూర్ 1' (Mysore 1) అనే పేరుతో రిజిస్టర్ చేయబడి ఉంది మరియు ఈ బెంట్లీ మార్క్ 6 క్లాస్-10 విభాగంలో పోటీ పడింది. వాస్తవానికి, ఈ కారు మైసూర్ మహారాజా యాజమాన్యంలో ఉండేది.

యూకేలో 'బెస్ట్ ఇన్ క్లాస్' అవార్డును గెలుచుకున్న మైసూర్ మహారాజు కారు.. ఇప్పుడు ఇది ఎవరి వద్ద ఉందంటే..?

విదేశీ గడ్డపై ఓపెన్ క్లాస్‌లో అవార్డును గెలుచుకున్న భారతదేశానికి చెందిన మొదటి కారుగా బెంట్లీ మార్క్ 6 చరిత్ర సృష్టించింది. ఇంటర్నేషనల్ క్లబ్ ఫర్ రోల్స్ రాయిస్ అండ్ బెంట్లీ ఎంథూసియస్ట్ (RREC) ఈ పోటీని యూకేలో నిర్వహించింది. ఈ క్లబ్ నిర్వహించే వార్షిక ర్యాలీ మరియు కాంకోర్స్ డి'ఎలిగాన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద రోల్స్ రాయిస్ మరియు బెంట్లీ కార్ల యొక్క కలెక్షన్ గా ఉంటుంది. ఇలాంటి క్లాసిక్ వాహనాలను కలిగి ఉన్న యజమానులు వాటిని ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు.

యూకేలో 'బెస్ట్ ఇన్ క్లాస్' అవార్డును గెలుచుకున్న మైసూర్ మహారాజు కారు.. ఇప్పుడు ఇది ఎవరి వద్ద ఉందంటే..?

యోహాన్ పూనావల్లకు చెందిన బెంట్లీ కారు లండన్‌లో అవార్డును గెలుచుకుంది, ఈ కారు 75 ఏళ్ల నాటిది.

రాబ్ ఎంబర్సన్ ట్రోఫీని అందుకున్న సందర్భంగా యోహాన్ పూనావల్లా మాట్లాడుతూ, "బెంట్లీ యొక్క అత్యంత ఆకర్షణీయమైన లైనప్ నుండి వచ్చిన ఈ ఐకానిక్ కారు దాని క్లాస్ లో అత్యుత్తమమైనదిగా రేట్ చేయబడినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మా కష్టపడి పనిచేసే జట్టు యొక్క అంకితభావం మరియు అభిరుచికి నేను దీనిని నిదర్శనంగా భావిస్తున్నాను. అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. తన వద్ద ఉన్న ఈ కారుతో అనుబంధించబడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఈ కారును ముంబైలో వివేక్ గోయెంకా మరియు అలాన్ అల్మెయిడా ఎంతో శ్రద్ధగా పునరుద్ధరించారని, పరిశ్రమ నిపుణులు మరియు మార్కు నిపుణుల నుండి బెంట్లీకి గుర్తింపు లభించడం చాలా ఆనందంగా ఉందని పూనవాలా చెప్పారు.

యూకేలో 'బెస్ట్ ఇన్ క్లాస్' అవార్డును గెలుచుకున్న మైసూర్ మహారాజు కారు.. ఇప్పుడు ఇది ఎవరి వద్ద ఉందంటే..?

ఈ అవార్డు గురించి కారు కన్సల్టెంట్ మరియు క్యూరేటర్ మహ్మద్ లుక్మాన్ అలీ ఖాన్ మాట్లాడుతూ, "ఈ ప్రయాణంలో భాగం కావడం మరియు ఈ చారిత్రాత్మక కారును అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని అన్నారు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమమైన మరియు అత్యంత ముఖ్యమైన బెంట్లీ కార్లలలో ఒకటి అని అన్నారు.

యూకేలో 'బెస్ట్ ఇన్ క్లాస్' అవార్డును గెలుచుకున్న మైసూర్ మహారాజు కారు.. ఇప్పుడు ఇది ఎవరి వద్ద ఉందంటే..?

బెంట్లీ మార్క్ 6 ఈ విజయం సాధించిన మరుసటి రోజున, 'అప్పుడు మరియు ఇప్పుడు' అనే క్యాప్షన్ తో ఈ ఐకానిక్ కారు యొక్క ఆనాటి చిత్రాలను మరియు ప్రస్తుత చిత్రాలను ప్రదర్శించడం జరిగింది. ఈ చిత్రాల కోసం హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్‌లో కారు కోసం ఫోటోషూట్ తీశారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఛాయాచిత్రాల నుండి దృశ్యాలు పునర్నిర్మించబడ్డాయి, ఇక్కడ కారు సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఉన్న ప్రదేశంలో చిత్రీకరించబడటం విశేషం.

యూకేలో 'బెస్ట్ ఇన్ క్లాస్' అవార్డును గెలుచుకున్న మైసూర్ మహారాజు కారు.. ఇప్పుడు ఇది ఎవరి వద్ద ఉందంటే..?

భారతదేశానికి తిరిగి రావడానికి ముందు, కారు బెంట్లీ మోటార్స్ లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయమైన క్రూను కూడా సందర్శిస్తుంది. ఈ అవార్డు గెలుచుకున్న బెంట్లీ మార్క్ 6ని లండన్‌కు చెందిన హాప్పర్ అండ్ కంపెనీ మైసూర్ మహారాజా కోసం నిర్మించింది, ఆ సమయంలో ఆయన ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనవంతుడు. ఈ కారు స్వచ్ఛమైన బంగారం మరియు వెండి షీల్డ్ మరియు బార్, డోర్‌లపై కోట్ ఆఫ్ ఆర్మ్స్, ఫ్లాగ్ స్టాఫ్, ఫోల్డ్-అవుట్ ట్రే మరియు సిల్వర్ టాప్‌తో కట్ గ్లాస్ టాయిలెట్‌లు వంటి అనేక బెస్పోక్ ఫీచర్‌లను పొందుతుంది.

దీని డ్యూయెల్ టోన్ కలర్ కారణంగా ఈ కారును "రబర్బ్ అండ్ కస్టర్డ్ కార్" అని కూడా పిలుస్తారు. బెంట్లీ మార్క్ 6 గతంలో ఇలాంటి ఎన్నో అవార్డులను గెలుచుకుంది. గతంలో, 21 గన్ సెల్యూట్ కాంకోర్స్ డి ఎలిగాన్స్‌లో 'బెస్ట్ ఆఫ్ షో' అవార్డును మరియు సెలూన్ ప్రైవ్‌లో ప్రతిష్టాత్మకమైన 'డ్యూక్ ఆఫ్ మార్ల్‌బోరో అవార్డు'ను గెలుచుకుంది.

యూకేలో 'బెస్ట్ ఇన్ క్లాస్' అవార్డును గెలుచుకున్న మైసూర్ మహారాజు కారు.. ఇప్పుడు ఇది ఎవరి వద్ద ఉందంటే..?

బెంట్లీ మార్క్ 6 కారును 1946 మరియు 1952 మధ్య ఉత్పత్తి చేయబడింది మరియు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బెంట్లీ తయారు చేసిన మొదటి లగ్జరీ కారు కూడా ఇదే. ఈ కారు యొక్క ఆరు సంవత్సరాల ఉత్పత్తి సమయంలో కేవలం 1,000 యూనిట్ల బెంట్లీ మార్క్ 6 కార్లు మాత్రమే నిర్మించబడ్డాయి. అందుకే, ఇది చాలా అరుదైన కారుగా చరిత్రలో నిలిచిపోయింది.

Source: Carandbike

More from DriveSpark

Article Published On: Saturday, July 16, 2022, 10:26 [IST]
English summary
Iconic bentley mark vi owned by yohan poonawalla won rrec best in class award in uk
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+