దివికేగిన బ్రిటన్ రాణి 'ఎలిజబెత్ II' కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?

ప్రపంచంలో 'క్వీన్ ఎలిజబెత్' అనేపేరు తెలియని వారు దాదాపు ఉండరు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ధనవంతురాలు మరియు 70 సంవత్సరాల కంటే కూడా కూడా సింహాసనాన్నిఅధిస్టించి పాలన సాగించిన రాణి. కాబట్టి ఎలిజబెత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. 90 సంవత్సరాలు దాటినా హుందాగా సమర్థవంతమైన పాలన కొనసాగించిన "క్వీన్ ఎలిజబెత్ II" నిన్న (గురువారం) కన్ను మూసారు.

బ్రిటిష్ రాజకుటుంబానికి అధిపతి, క్వీన్ ఎలిజబెత్ II లగ్జరీ జీవితాన్ని అనుభవించి 96 సంవత్సరాల వయసులో స్కాట్లాండ్ లోని బాల్మోరల్ కోటలో మరణించారు. అయితే మరణానికి ముందు క్వీన్ ఎలిజబెత్ II ఎటువంటి కార్లు వినియోగించేది, వాటి వివరాలు ఏమిటి అనే విషయాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

దివికేగిన 'క్వీన్ ఎలిజబెత్ II': ఈమె జీవితంలో ఉపయోగించిన కార్లు ఎలా ఉన్నాయో చూసారా..!!

ముందుగా క్వీన్ ఎలిజబెత్ II ఎలాంటి కార్లు ఉపయోగించింది అని తెలుసుకోవడానికంటే ముందుగా ఆమె జీవితం గురించి కూడా కొంత సమాచారం తెలుసుకుందాం.

దివికేగిన 'క్వీన్ ఎలిజబెత్ II': ఈమె జీవితంలో ఉపయోగించిన కార్లు ఎలా ఉన్నాయో చూసారా..!!

క్విన్ ఎలిజబెత్ II పూర్తి పేరు 'ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ'. క్విన్ విక్టోరియా కేవలం 25 సంవత్సరాల వయసులోనే రాజరిక బాధ్యతలు చేపట్టి ఏకంగా 63 సంవత్సరాల 7 నెలల 2 రోజులు పరిపాలించి ఎక్కువ రోజులు రాజ్యం పాలించిన మహారాణికి కీర్తి గడించింది. అంతకంటే ముందు ఈమె రెండవ ప్రపంచ యుద్ధలో కూడా పాల్గొందని సమాచారం. ఆ తరువాత ఫిలిప్ రాజును వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమెకు నాలుగు సంతానం.

దివికేగిన 'క్వీన్ ఎలిజబెత్ II': ఈమె జీవితంలో ఉపయోగించిన కార్లు ఎలా ఉన్నాయో చూసారా..!!

అత్యంత ఖరీదైన గ్రాండ్ కోటలు మరియు ఇతర ఆస్తులను కలిగి ఉన్న రాణి ఎలిజిబెత్ II అత్యంత ఖరీదైన కార్లను కూడా కలిగి ఉంది. ఇందులో రోల్స్ రాయిస్ నుంచి ల్యాండ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు వరకు ఉన్నాయి.

దివికేగిన 'క్వీన్ ఎలిజబెత్ II': ఈమె జీవితంలో ఉపయోగించిన కార్లు ఎలా ఉన్నాయో చూసారా..!!

బెంట్లీ లిమోసిన్ (Bentley Limousine):

క్విన్ ఎలిజబెత్ II ఉపయోగించే అత్యంత ఖరీదైన కార్లలో బెంట్లీ యొక్క లిమోసిన్ ఒకటి. ఇది తన గోల్డెన్ జూబ్లీకి ముందు 2002 లో తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా విలాసవంతమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

దివికేగిన 'క్వీన్ ఎలిజబెత్ II': ఈమె జీవితంలో ఉపయోగించిన కార్లు ఎలా ఉన్నాయో చూసారా..!!

బెంట్లీ లిమౌసిన్ కారు 6.75 లీటర్ వి8 ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 400 బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా దీని వేగం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ లగ్జరీ కారు ధర రూ. 10 మిలియన్ పౌండ్లు.

దివికేగిన 'క్వీన్ ఎలిజబెత్ II': ఈమె జీవితంలో ఉపయోగించిన కార్లు ఎలా ఉన్నాయో చూసారా..!!

రోల్స్ రాయిస్ ఫాంటమ్:

ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ధనవంతులు ఎక్కువ ఇష్టపడే వాహనాల్లో రోల్స్ రాయిస్ తప్పకుండా ఉంటుంది. ఈ కారణంగానే ఇప్పటికే చాలామంది ధనవంతులు ఈ ఖరీదైన బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు. క్విన్ ఎలిజబెత్ II కూడా ఈ రోల్స్ రాయిస్ యొక్క ఫాంటమ్ కారుని కలిగి ఉంది.

దివికేగిన 'క్వీన్ ఎలిజబెత్ II': ఈమె జీవితంలో ఉపయోగించిన కార్లు ఎలా ఉన్నాయో చూసారా..!!

అయితే ఎలిజబెత్ II గ్యారేజీలో బెంట్లీ స్టేట్ లిమోసిన్ రాకముందు, రోల్స్ రాయిస్ ఫాంటమ్ IV ప్రత్యేకమైన మోడల్ ఉపయోగంలో ఉండేది. ఇది ప్రపంచంలోని అరుదైన కార్లలో ఒకటి. ఈ మోడళ్లన్నీ ప్రత్యేకంగా దేశాధినేతలకు మాత్రమే విక్రయించబడ్డాయి. ఇది అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది 5.7 లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, స్ట్రెయిట్-ఎయిట్ ఇంజన్‌ కలిగి ఉంటుంది.

దివికేగిన 'క్వీన్ ఎలిజబెత్ II': ఈమె జీవితంలో ఉపయోగించిన కార్లు ఎలా ఉన్నాయో చూసారా..!!

ల్యాండ్ రోవర్:

ఖరీదైన కార్ల జాబితాలో ల్యాండ్ రోవర్స్ కూడా ఉన్నాయి. ఈ కారు ఎలిజిబెత్ II కి ఇష్టమైన కారు. ఎక్కువగా ఈమె ఈ కారునే ఉపయగించేది. ఈమె తన గ్యారేజిలో ల్యాండ్ రోవర్ సిరీస్ 1 నుండి తాజా ల్యాండ్ రోవర్ డిఫెండర్ దాదాపు 30 కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈమెకు ల్యాండ్ రోవర్ మీద ఎంత ప్రేమ ఉందొ అర్థమవుతుంది.

దివికేగిన 'క్వీన్ ఎలిజబెత్ II': ఈమె జీవితంలో ఉపయోగించిన కార్లు ఎలా ఉన్నాయో చూసారా..!!

డైమ్లర్:

క్వీన్ ఎలిజబెత్ II గ్యారేజిలో డైమ్లర్ సూపర్ V8 LWB కారు కూడా ఉంది. ఈ కారు కూడా చాలా ఆకర్షణీయమైన కలర్ లో ఉంటుంది. రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కారును మాత్రమే కాకుండా దీనిని కూడా క్వీన్ ఎలిజబెత్ ఎక్కువగానే వినియోగించింది.

దివికేగిన 'క్వీన్ ఎలిజబెత్ II': ఈమె జీవితంలో ఉపయోగించిన కార్లు ఎలా ఉన్నాయో చూసారా..!!

ఆస్టన్ మార్టిన్:

క్వీన్ ఎలిజబెత్ II యొక్క 21 వ పుట్టినరోజు సందర్భంగా ప్రిన్స్ ఫిలిప్ చార్లెస్ 1965 ఆస్టన్ మార్టిన్ డిబి6 వోలాంటేను గిఫ్ట్ గా అందించాడు. ఇది కూడా ఎలిజబెత్ II గ్యారేజిలో ఉంది.

దివికేగిన 'క్వీన్ ఎలిజబెత్ II': ఈమె జీవితంలో ఉపయోగించిన కార్లు ఎలా ఉన్నాయో చూసారా..!!

ఇదిలా ఉండగా రాణి ఎలిజబెత్ II మహారాణి హోదాలో తన జీవితంలో దాదాపు వందకుపైగా దేశాల్లో పర్యటించారు. ఇందులో ఎక్కువసార్లు కెనడాకు వెళ్ళింది. భారతదేశంలో కూడా 1961, 1983, 1997 సంవత్సరాల్లో మూడు పర్యటించారు. 1961 లో క్విన్ ఎలిజిబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ మొదటిసారి భారత్ లో పర్యటించారు. అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు గణతంత్య దినోత్సవ వేడుకల్లో ఈమె పాల్గొంది.

దివికేగిన 'క్వీన్ ఎలిజబెత్ II': ఈమె జీవితంలో ఉపయోగించిన కార్లు ఎలా ఉన్నాయో చూసారా..!!

ఆ తరువాత 1983 లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నపుడు మరోసారి పర్యటించింది. ఈ పర్యటన సందర్భంగా మదర్ థెరిసాకు గౌరవ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ను రాణి ఎలిజబెత్ II బహుకరించారు. 1997 లో మళ్ళీ భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె మూడవ సారి అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ మెమోరియల్ ను సందర్శించారు. ఈ విధంగా రాణి ఎలిజబెత్ II భారతదేశంలో కూడా పర్యటించింది.

More from DriveSpark

Article Published On: Friday, September 9, 2022, 16:44 [IST]
English summary
Iconic car collection of queen elizabeth details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+