చంద్రుడిపైకి రోడ్డు వేస్తే కారులో వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసా.. ?
ఇప్పటి వరకు ఎవరూ అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధ్రువంపైన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేసి ఇస్రో సత్తా చాటింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. అనంతరం రెండు వారాలుపాటు కీలక పరిశోధనలు చేసింది.
చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతలో వ్యత్యాసం, సల్ఫర్, ఆక్సిజన్ సహా ఇతర మూలకాలను కనుగొంది. దీంతోపాటు రెండు రోజుల క్రితం సూర్యుడిపైన పరిశోధనలు చేసేందుకు ఆదిత్య L1 ప్రయోగాన్ని చేపట్టింది. నిర్ధిష్ఠ కక్ష్యలోకి చేర్చినట్లు ఇస్రో తాజాగా వెల్లడించింది. సుమారు 125 రోజుల ప్రయాణం చేసిన లాంగ్రాజ్ పాయింట్‌కు చేరుకోనుంది.

అయితే తాజా పరిశోధనల కారణంగా భారత్ వ్యాప్తంగా ఇస్రో, అంతరిక్ష పరిశోధనలపై కీలక చర్చ జరుగుతోంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 భూమి నుంచి చంద్రుడి మీద అడుగుపెట్టేందుకు సుమారుగా 41 రోజుల సమయం తీసుకుంది. అయితే ఇక్కడో ఆసక్తికర ప్రశ్న తలెత్తింది.
భూమి నుంచి చంద్రుడి పైకి రహదారి నిర్మాణం చేపట్టేందుకు ఎంత సమయం పడుతుంది. ఆ రోడ్డుపై కారులో అక్కడికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందనే విచిత్రమైన ప్రశ్న కొందరిలో తలెత్తింది. అయితే ఈ ప్రశ్న కొంత వింతగా అనిపించినా.. ఈ ప్రశ్నకు సరైన సమాధానం కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భూమి నుంచి చంద్రుడి మీదకు రోడ్డు నిర్మించే స్థాయిలో సైన్స్ ఇంకా అభివృద్ధి చెందలేదు. దాంతోపాటు అసలు ఈ రెండింటి మధ్య రోడ్డు నిర్మాణం సాధ్యమేనా అనేది తెలియదు. ఎందుకంటే భూమి, చంద్రుడి స్థిరంగా ఉండవు. భూమి సూర్యుడి చుట్టు తిరుగుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ రెండింటి మధ్య రోడ్డు ఒకరకంగా అసాధ్యం.
అయితే ఈ లాజిక్‌లు అన్ని కాసేపు పక్కన పెడితే.. భూమికి చంద్రుడికి ప్రస్తుత దూరం 3,84,400 కి.మీగా ఉంది. ఈ మధ్య రహదారిని నిర్మించి... కారులో సుమారు 100 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తే చంద్రుడిపైకి చేరేందుకు 3,844 గంటలు పడుతుంది.

అంటే భూమిని వదిలి నిరంతరాయంగా 160 రోజులపాటు ప్రయాణం చేస్తే చంద్రుడిని చేరుకోవచ్చు. అయితే నిరంతరాయంగా 100 కి.మీ వేగంతో ప్రయాణించడం సాధ్యం కాదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాకున్నా.. కొందరి ఆసక్తి మేరకు ఈ వివరాలను వెల్లడిస్తు్న్నాం.
సెప్టెంబర్ 3వ తేదీని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ల్యాండర్‌ను మరోసారి సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. ఇస్రో శాస్త్రవేత్తల కమాండ్‌లను అనుసరించిన విక్రమ్ ల్యాండర్ సుమారు 40 సెంటీమీటర్ల ఎత్తుకు లేచి, 30-40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. ఈ ప్రక్రియను హాప్ ఎక్స్‌పరిమెంట్‌గా పిలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ ద్వారా చంద్రుడి నుంచి శాంపిల్స్ సహా మానవసహిత యాత్రలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని ఇస్రో భావిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








