పైన ఫెరారీ.. లోన కొరోలా..: కార్ మోడిఫయర్ మ్యాజిక్

టొయాటా కొరోలాకు ఫెరారీకు సంబంధం ఏంటనే కదా మీ సందేహం.. మరేం లేదండి భారత్‌కు చెంది ఓ ఔత్సాహిక కార్ మోడిఫైయర్ "ఎగ్జిక్యూటివ్ మోడ్‌కార్ ట్రెండ్జ్" అనే సంస్థ ఓ టయోటా కొరోలా కారును అచ్చం 'ఫెరారీ ఎఫ్430'గా మార్చేసింది. 1.8 లీటర్ ఇంజన్ సామర్థ్యం కలిగిన కొరోలా మెటల్ బాడీ ఫ్రేమ్‌ను ధృఢమైన ఫైబర్ గ్లాస్‌తో రీప్లేస్ చేయడంతో పాటు కారులోని ఇంటీరియర్స్‌ను కూడా అచ్చం ఫెరారీ ఎఫ్430లో ఉండే మాదిరిగానే తీర్చిదిద్దడం జరిగింది. ఇలా కారు మెటాలిక్ బాడీ భాగాన్ని ఫైబర్‌తో రీప్లేస్ చేయడం వల్ల కారు బరువు తగ్గి వేగం పెరుగుతుంది.
టొయోటా కొరోలాను ఇలా మార్చడానికి కేవలం రూ. 10 లక్షలు మాత్రమే ఖర్చయిందట. మరి కోట్లు వెచ్చించి ఫెరారీ కారును కొనుక్కోలేని వారు ఇలా కొరోలా కారునే ఫెరారీ కారులా మార్చేసుకొని లగ్జరీ కారులో ప్రయాణిస్తున్న అనుభూతిని పొందవచ్చు.


Click it and Unblock the Notifications








