ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకూ వైర్‌లెస్ ఛార్జింగ్.. ఫస్ట్ ప్రాజెక్ట్ అదే.!!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు, కార్లపై ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఈవీలు సాంప్రదాయక వాహనాల మాదిరిగా కాకుండా ఛార్జింగ్‌తో నడుస్తాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం వెల్లడైంది.
భారత్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దిశగా దూసుకుపోతోంది. ఈవీ సెగ్మెంట్‌లో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా స్కూటర్లు అత్యంత ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈవీ రంగంలో కొత్త మోడల్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. దేశీ దిగ్గజం టాటా మోటార్స్.. ప్రస్తుతం నాలుగు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది.

కాగా ఇప్పటివరకూ మీరు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్‌ను వైర్ ద్వారా కనెక్ట్ చేసి బ్యాటరీని ఛార్జ్ చేస్తారు. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. ఫోన్లకు వైర్‌లెస్ ఛార్జింగ్ మాదిరిగానే ఈవీలకు కూడా వైర్‌లెస్ ఛార్జింగ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ మేరకు స్టార్టప్ కంపెనీ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్(SIIC), IIT కాన్పూర్‌లో సిమ్యాక్ట్రికల్స్(Simactricals).. ఎలక్ట్రిక్ వాహనాల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది.
అక్టోబర్ 2020లో స్థాపించబడిన సిమాక్ట్రికల్స్(Simactricals On Wireless Charging).. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇటీవలే SanchiConnect ప్రీ-సీడ్ కోహోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా రూ. 75 లక్షలను సేకరించింది. అయితే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలో భాగంగా.. ఈ సంస్థకు అందించిన రూ. 44 లక్షలకు ఈ గ్రాంట్లు అదనం.

టూ వీలర్లు, త్రీ వీలర్లతో పాటు ఫోర్ వీలర్లకు కూడా వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్‌ను సిమ్యాక్ట్రికల్స్ రూపొందించింది. వేర్‌హౌస్ బాట్‌లు, రోవర్లు మరియు డ్రోన్‌లను ఛార్జ్ చేయడానికి ఈ సిస్టమ్‌ను ఉపయోగించవచ్చు. కాగా కంపెనీ తన మొదటి నమూనాను 45 రోజుల్లో అభివృద్ధి చేయగా.. ప్రారంభ ప్రాజెక్ట్‌లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO).. డ్రోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ సొల్యూషన్‌ను రూపొందించింది.
దీని ద్వారా వైమానిక వాహనాల కోసం కూడా వైర్‌లెస్ ఛార్జింగ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఎకో ఫ్రెండ్లీలో భాగంగా ఈవీలను ప్రోత్సహించడానికి సిమాక్ట్రికల్స్‌కు పునాది వేసింది. ఇన్నోవేషన్ పట్ల మక్కువ మరియు EV ఛార్జింగ్ అనుభవాన్ని సులభతరం చేయాలనే నిబద్ధతతో సిమాక్ట్రికల్స్‌ను నడుపుతున్నట్లు సిమ్యాక్ట్రికల్స్ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ మిహిర్ మిశ్రా అన్నారు.

టెక్నాలజీ సౌలభ్యం మరియు సామర్థ్యంలో ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ కీలక పాత్ర పోషిస్తుందని మిహిర్ మిశ్రా పేర్కొన్నారు. ఈ సిస్టమ్ ద్వారా ఛార్జింగ్ త్వరగా పూర్తవుతుందని తెలిపారు. ప్రస్తుతం, సిమాక్ట్రికల్స్ దాని వైర్‌లెస్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా ఐదు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌ల (POCలు)పై సహకరిస్తూ, టూ వీలర్ మరియు త్రీ-వీలర్ తయారీదారులతో నిమగ్నమై పనిచేస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








