అమ్మకానికి హీరో విజయ్ రోల్స్ రాయిస్ కారు.. రేటెంతో తెలుసా?
సినీతారలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు ఖరీదైన కార్లు ఉపయోగిస్తారని అందరికి తెలుసు. అయితే వీరు అప్పుడప్పుడు తమ కార్లను విక్రయిస్తారు కూడా. గతంలో ఇలాంటి సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అలాంటి మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తమిళ సినీ నటుడు 'విజయ్' (Vijay) తన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) కారును విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
నటుడు విజయ్ తన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 1 కారును అమ్మకానికి ఉంచారు. అయితే దీనిని డీలర్‌షిప్ ద్వారా అమ్మకానికి ఉంచినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కారును అన్ని కోణాల్లోనూ చూడవచ్చు. ఈ కారు ఇప్పటికి కూడా చాలా అద్భుతంగానే ఉంది. గీతలు వంటివి కూడా ఏ మాత్రం లేకపోవడం గమనార్హం.

2012లో విజయ్ ఈ కారును కొనుగోలు చేసినట్లు.. ఇప్పటికి 12 ఏళ్ళు పూర్తవుతున్నా కొత్త కారు మాదిరిగానే ఉంది. ఈ కారు ఇప్పటి వరకు 22000 కిమీ మాత్రమే ప్రయాణించినట్లు ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తోంది. ఈ కారు చాలా సహజమైన స్థితిలో ఉన్నట్లు డీలర్‌షిప్ కూడా స్పష్టం చేసింది. ఫీచర్స్ కూడా అదేవిధంగా ఉన్నాయని స్పష్టంగా వెల్లడించింది.
విజయ్ రోల్స్ రాయిస్ కారును రూ. 2.6 కోట్లకు విక్రయించనున్నట్లు డీలర్‌షిప్ వారు పేర్కొన్నారు. ఈ ధరకు ఎవరు కొనుగోలు చేస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే నటుడు ఈ కారుకు ట్యాక్స్ చెల్లించని కారణంగా గతంలో మద్రాస్ హైకోర్టు రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ సమయంలో ఈ వార్త పెద్ద సంచలంగా మారింది.

నటుడు విజయ్ గతంలో చాలా సందర్భాల్లో తన రోల్స్ రాయిస్ కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. అయితే ఇప్పుడు ఈ కారును ఎందుకు విక్రయించాలనుకుంటున్నారనేదానికి స్పష్టమైన రీజన్ తెలియడం లేదు. అయితే ఈ కారు ఎవరు సొంతం చేసుకుంటారు అనేది తెలియాల్సిన విషయం. ఈ విషయం తెలుసుకోవడానికి సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ కారును అభిమానులు ఎవరైనా కొనుగోలు చేస్తారా? పారిశ్రామికవేత్తలు ఎవరైనా కొంటారా అనేది తెలియాల్సి ఉంది.
ఒక వాహనాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటప్పుడు తప్పకుండా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మన దేశంలో ఏదైనా వాహనం కొనుగోలు చేస్తే ధర కొంత తక్కువగా ఉంటుంది. కానీ సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటే ధర ఎక్కువగా ఉంటుంది, దానికి చెల్లించాల్సిన ఇతర బకాయిలు చాలానే ఉన్నాయి. అవన్నీ చెల్లించాలి. లేకుంటే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక రోల్స్ రాయిస్ విషయానికి వస్తే.. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ ఒకటి. ఈ కోట్ల విలువైన కార్లను మాత్రమే విక్రయిస్తుంది. అయితే రోల్స్ రాయిస్ కార్లు ఇతర బ్రాండ్ కార్ల కంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. అంబానీ ఫ్యామిలీ తొమ్మిది రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








