మహీంద్రా వాహనాల డిజైన్ ఇలా ఉంటే.. (స్కెచెస్)

ప్రముఖ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, ప్రస్తుతం దేశీయ విపణిలో కొన్ని ఉత్తమ వాహనాలను అందిస్తోంది. కంపెనీ అందిస్తున్న పాపులర్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ500' మోడ్రన్ డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు ఈ మోడల్‌కి ఉత్పత్తి మించి డిమాండ్ ఉండేది. అయితే, కస్టమర్లను దీని డిజైన్ క్రమంగా బోర్ కొట్టినట్లు అనిపిస్తోంది.

అంతేకాకుండా.. మహీంద్రా గతంలో ప్రవేశపెట్టిన వెరిటో వైబ్ (వెరిటో సెడాన్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన సబ్-4 మీటర్ కారు) కూడా డిజైన్ పరంగా కస్టమర్లను ఆకట్టుకోలేకపోయింది. అలాగే, కంపెనీ తమ లోగాన్‌ను రిఫ్రెష్ చేసి వెరిటోగా పేరు, కొద్దిపాటి డిజైన్ మార్చి ప్రవేశపెట్టింది. ఈ మోడల్ కూడా మార్కెట్లో అంతటి సక్సెస్‌ను సాధించలేకపోయింది.

అలాగే, మహీంద్రా తమ పాపులర్ జైలో ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకొని తయారు చేసిన మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ డిజైన్ కూడా చూపరులను ఆకర్షించలేకపోయింది. ఈ నేపథ్యంలో, మా డ్రైవ్‌స్పార్క్ సీనియర్ ఆటోమోటివ్ ఎడిటర్ సంతోష్ రాజ్ కుమార్, మహీంద్రా వాహనాల డిజైన్ ఇలా ఉంటే బాగుంటుందని, కొన్ని డిజైన్‌లను స్కెచ్ చేశారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

మహీంద్రా వాహనాల డిజైన్ ఇలా ఉంటే..

తర్వాతి స్లైడ్‌లలో మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

వెరిటో వైబ్

వెరిటో వైబ్

మహీంద్రా ప్రవేశపెట్టిన వెరిటో వైబ్‌ను నేటి ఆధునిక కాంపాక్ట్ సెడాన్ డిజైన్‌లను ఇమిటేట్ చేస్తూ, విడుదల చేసి ఉంటే ఈ మోడల్ తప్పకుండా సక్సెస్ అయి ఉండేది. ప్రత్యేకించి ఈ కారు వెనుక డిజైన్ అంతగా ఆకట్టునేలా ఉండదు.

వెరిటో వైబ్ స్కెచ్

వెరిటో వైబ్ స్కెచ్

ఈ స్కెచ్‌లో చూపించినట్లుగా మహీంద్రా తమ వెరిటో వైబ్ రియర్‌ను డిజైన్ చేసి ఉంటే, ఇది తప్పకుండా సక్సెస్ అయి ఉండొచ్చనేది మా అభిప్రాయం. వెనుక వైపు స్లోప్‌గా కాకుండా, షార్ప్ ఎడ్జెజ్‌తో ఓ ప్రాపర్ సెడాన్‌గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. బూట్ డోర్, రియర్ స్పాయిలర్, టెయిల్ ల్యాంప్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఈ మోడల్ తప్పకుండా సక్సెస్ అవుతుంది.

మహీంద్రా బొలెరో

మహీంద్రా బొలెరో

మహీంద్రా నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ బొలెరో. ఈ మోడల్ డిజైన్‌లో ఎలాంటి లోపం లేకపోయినప్పటికీ, గత కొన్నేళ్లుగా ఇందులో కంప్లీట్ ఫేస్‌లిఫ్ట్ రాకపోవటంతో, దీని డిజైన్ కాస్తంత అవుట్‌డేటెడ్‌గా అనిపిస్తుంది. మరి ఈ ఎస్‌యూవీ మేము ఇచ్చిన మోడ్రన్ డిజైన్ టచ్ ఎలా ఉందో తర్వాతి స్లైడ్‌లో చూడండి.

బొలెరో స్కెచ్

బొలెరో స్కెచ్

మేము మహీంద్రా బొలెరో బేసిక్ డిజైన్‌ను మార్చకుండా, ఫ్రంట్ డిజైన్‌ను మార్చుతూ స్కెచ్ చేయటం జరిగింది. హెడ్‌లైట్స్, మెష్ గ్రిల్, ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్‌లను చతురస్రాకారంలో డిజైన్ చేశాము. ఇది బొలెరో బాక్స్ షేప్ డిజైన్‌కి చక్కగా మ్యాచ్ అవుతుంది. అలాగే, పెద్ద టైర్లు, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, ర్యాలీ ఇన్‌స్పైర్డ్ మడ్ ఫ్లాప్స్, బ్రష్డ్ ఫినిష్ స్కిడ్‌ప్లేట్‌తో కూడిన ఫ్రంట్ వంటి మార్పులను ఈ స్కెచ్‌లో చూడొచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా అందిస్తున్న ఎక్స్‌యూవీ500 డిజైన్ ది బెస్ట్, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, కంపెనీ ఇందులో కంప్లీట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందనేది మా అభిప్రాయం. కనీసం మహీంద్రా ఫ్రంట్ డిజైన్ మారినా కూడా స్వాగతించదగిన విషయమే. ఇదే అంశాన్ని మేము మా స్కెచ్ రూపంలో చూపడం జరిగింది. తర్వాతి స్లైడ్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్కెచ్‌ను చూడండి.

ఎక్స్‌యూవీ500 స్కెచ్

ఎక్స్‌యూవీ500 స్కెచ్

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫ్రంట్ డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు చేయటం జరిగింది. ఇందులో ప్రధానంగా హెడ్‌లైట్స్, గ్రిల్, ఎయిర్ డ్యామ్స్, ఫ్రంట్ బంపర్ డిజైన్‌ను మార్చాము. ప్రస్తుతం హెడ్‌లైట్స్‌కి దిగువన ఉన్న ఇండివిడ్యువల్ లైట్స్‌తో కూడిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్‌కి బదులుగా ఆడి స్టైల్ బార్ టైప్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్‌ని డిజైన్ చేశాము. ఫాగ్ ల్యాంప్ పొజిషనింగ్‌ని మార్చి, వాటిని రౌండ్ షేపులో డిజైన్ చేసి, ఫ్రంట్ బంపర్‌లో అమర్చాము. అల్లాయ్ వీల్ డిజైన్‌ను కూడా మార్చాము.

మహీంద్రా వెరిటో

మహీంద్రా వెరిటో

రెనో లోగాన్ సెడాన్‌ను మహీంద్రా వెరిటోగా పేరు మార్చి, లోగాన్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసి కంపెనీ విడుదల చేసింది. అప్పట్లో లోగాన్ సెడాన్‌ను ఎక్కువగా టాక్సీ కోసం ఉపయోగించడంతో, వెరిటో ఓ ఫ్యామిలీ సెడాన్‌గా సక్సెస్‌ను సాధించలేకపోయింది. వెరిటో డిజైన్ కూడా చాలా సాదాసీదాగా ఉంటుంది. మరి దీనిని మేము స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందో తర్వాతి స్లైడ్‌లో చూడండి.

మహీంద్రా వెరిటో స్కెచ్

మహీంద్రా వెరిటో స్కెచ్

వాస్తవానికి మహీంద్రా వెరిటో సెడాన్‌ను ఓ మంచి స్పోర్టీ సెడాన్‌గా, ప్రీమియంగా మార్చవచ్చు. ఈ స్కెచ్‌లో మేము వెరిటోకి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ జోడించాము. గ్రిల్, ఎయిర్‌డ్యామ్ స్టయిలింగ్‌ని మార్చాము. పెద్ద అల్లాయ్ వీల్స్, లోప్రొఫైల్ టైర్లతో వెరిటోను మరింత స్పోర్టీగా డిజైన్ చేశాము.

మహీంద్రా క్వాంటో

మహీంద్రా క్వాంటో

మహీంద్రా అందిస్తున్న పాపులర్ జైలో ప్లాట్‌ఫామ్‌పై తయారైన క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ కస్టమర్లను ఆకట్టుకోవటంలో విఫలమైంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడ్రన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డిజైన్‌లతో పోల్చుకుంటే క్వాంటో డిజైన్ చాలా బోరింగా అనిపిస్తుంది. మరి క్వాంటోను మేము స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందో తర్వాతి స్లైడ్‌లో చూడండి.

మహీంద్రా క్వాంటో స్కెచ్

మహీంద్రా క్వాంటో స్కెచ్

మహీంద్రా క్వాంటో రియర్ డిజైన్‌ను గమనిస్తే, సెంటర్‌లో ఉన్న రియర్ డోర్ మౌంటెడ్ స్పేర్‌ను వీల్‌ను కుడివైపుకు తీసుకురావటం జరిగింది. ఈ మార్పు వలన ఇది పెద్ద ఎస్‌యూవీల మాదిరిగా స్టయిలిష్‌గా ఉంటుంది. అలాగే బెటర్ ఆఫ్-రోడింగ్ కోసం పెద్ద చక్రాలు, వెడల్పాటి టైర్లను జోడించాము.

మరి మహీంద్రా కార్లు ఇలా ఉండే మీకు నచ్చుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
We know that beauty lies in the eyes of the beholder, and that beauty is relative. This certainly holds true for automobiles as well. India has a flourishing auto industry, with indigenous cars battling it out on our roads with autos developed by foreign carmakers. However, not all cars designed here are good lookers, and often miss the right finishing touch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X