వర్షాకాలంలో కారు డ్రైవింగ్‌ చేస్తున్నారా.. ఈ సమస్యలు లేకుండా చూసుకోండి..!

భారతదేశంలో అనేక రాష్టాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అవుతున్నాయి. అయితే వర్షాకాలం మీ కారు భద్రతపై ఎక్కువ ప్రభావం చూపుతుందని మీకు తెలుసా..?

వర్షాకాలంలో నిత్యం వర్షాలు కురుస్తునే ఉంటాయి. ఫలితంగా వరదలు రావడం సహా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీటితో నిండిపోతున్నాయి. అయితే వర్షాకాలం కారును ఎలా ప్రభావితం చేస్తుందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే కారుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంటుంది.

impact of monsoon on cars

వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచిపోతుంది. అటువంటి రోడ్లపై కారు డ్రైవింగ్‌ చేసినప్పుడు.. వర్షపు నీరు ఇంజిన్‌ కంపార్టుమెంట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఫలితంగా అక్కడ ఉన్న విద్యుత్‌ వ్యవస్థ కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరియు ఆ ఇంజిన్‌ భాగాలు తుప్పు పట్టే అవకాశం ఉంది.

వర్షాకాలం.. కారు బ్రేకింగ్‌ వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. అందువల్ల కారు బ్రేకింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఫలితంగా మీరు అనుకున్న ప్రాంతంలో కారును ఆపలేరు. మరియు చాలా రోడ్లు జారిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఈ కాలంలో కారును కాస్త నెమ్మదిగా డ్రైవింగ్‌ చేయాలి.

impact of monsoon on cars

హైడ్రో ప్లానింగ్‌.. టైర్‌ ట్రెడ్‌ మరియు రోడ్డు పైభాగం మధ్య నీటి పొర కారణంగా... వాహనాలు రోడ్డుతో సరైన సంబంధాన్ని కొనసాగించలేవు. ఈ కారణంగా స్టీరింగ్‌, బ్రేకింగ్‌పై నియంత్రణ తగ్గుతుంది. దీంతోపాటు వర్షాకాలంలో చాలా వరకు విజిబిలిటీ తగ్గుతుంది. భారీ వర్షాల సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

వర్షాకాలంలో కార్లు డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు టైర్ల థ్రెడ్‌ డెప్త్‌ సహా టైర్లలో గాలి (టైర్‌ ప్రజర్‌) సరిగా ఉందో లేదో తనిఖీ చేయాలి. మరియు ఎల్లప్పుడూ టైర్లలో గాలి సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. లేకుంటే టైర్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరియు బ్రేకింగ్‌ వ్యవస్థపై ప్రభావం పడుతుంది.

కారు ముందు, వెనుక విండ్‌ షీల్డ్‌లను ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవాలి. వైపర్లు, డీఫాగర్‌ సమస్యలు ఉంటే వెంటనే మరమ్మతు చేయించుకోవాలి. లేకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో కారు మంచి కండిషన్‌లో ఉన్నాగానీ అధిక వేగంతో డ్రైవింగ్‌ చేయడం మంచిది కాదు.

వర్షాకాలంలో కారు బ్యాటరీని తనిఖీ చేయించుకోవాలని చాలా మంది నిపుణులు సలహా ఇస్తుంటారు. వర్షాకాలంలోని చల్లని పరిస్థితుల కారణంగా కారు బ్యాటరీ పనితీరుపై ప్రభావం పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు. లీకేజీలు ఇతర సమస్యలుంటే మరమ్మతు చేయించుకోవాలని సూచిస్తున్నారు. బ్యాటరీ బోల్డులు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, July 24, 2023, 19:26 [IST]
English summary
Impact of monsoon on cars here are the safety and performance tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+