కారులో చైల్డ్ సీట్ ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ చైల్డ్ సీట్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

కారు కొనుగోలు చేసే యజమానులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి మరియు పాటించాల్సిన అంశాలలో ముఖ్యమైనది, దాని సీటింగ్ సామర్థ్యం గురించి. అందులోనూ ప్రత్యేకించి, చిన్న పిల్లలు ఉండే వాహన యజమానులు చైల్డ్ కార్ సీట్ గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వాహనంలో సీటింగ్ సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ప్రయాణించడం చాలా అసౌకర్యంగా ఉంటుంది మరియు అది సురక్షితం కూడా కాదు.

కారులో చైల్డ్ సీట్ ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ చైల్డ్ సీట్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

ఉదాహరణకు, ఒక సాధారణ 5 సీటర్ కారులో ఐదుగురు వ్యక్తులకు సరిపోయే సీట్ బెల్టులు మాత్రమే ఉంటాయి. అలాంటి 5-సీటర్ కారులో ఆరవ వ్యక్తి కూర్చున్నప్పుడు ఏదైనా అనుకోని విపత్తు జరిగితే ప్రమాదంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే, చైల్డ్ కారు సీట్ విషయంలో కూడా కార్ కంపెనీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని, ఐఎస్ఓ ఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ యాంకర్లను అందిస్తుంటాయి. ఇవి కారు వెనుక సీటులో చైల్డ్ సీట్ ను అమర్చడానికి ఉపయోగపడే ఇనుప హుక్ ల మాదిరిగా ఉంటాయి.

కారులో చైల్డ్ సీట్ ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ చైల్డ్ సీట్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

చైల్డ్ కార్ సీట్ లేదా బేబీ కార్ సీట్ అంటే ఏమిటి?

బేబీ సీట్ లేదా చైల్డ్ కార్ సీట్ అనేది శిశువుల కోసం అదనంగా ఉపయోగించే ఓ ప్రత్యేకమైన సీటు. అదనపు కుషన్లతో కూడిన ఈ ప్రత్యేకమైన సీటింగ్ అమరిక ముందు సీటు వెనుక వెనుక సీటుకు నేరుగా ఎదురుగా ఉండేలా అమర్చేందుకు గానూ రూపొందించబడినది. ఇవి నాణ్యమైన మరియు మన్నికైన పదార్థాలతో తయారు చేయబడి ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు కూడా, కారు సీటులో ఉండే శిశువు రక్షణ అందించేలా ఇవి డిజైన్ చేయబడి ఉంటాయి.

కారులో చైల్డ్ సీట్ ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ చైల్డ్ సీట్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

ఈ చైల్డ్ కారు సీటును ప్రత్యేకమైన సీట్ బెల్టుల సాయంతో బిగించవచ్చు. ఆఫ్టర్ సేల్స్ ఎక్విప్‌మెంట్ లో భాగంగా ఈ చైల్డ్ సీట్లు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల అవసరం మరియు శిశువు యొక్క వయస్సు లేదా బరువును బట్టి ఇవి వివిధ రూపాల్లో లభిస్తాయి. ప్రతి చైల్డ్ కార్ సీట్ ఐఎస్ఓ సర్టిఫైడ్ సీట్ బెల్టుల సాయంతో వస్తుంది, వీటిని కారు వెనుక భాగంలో అందించే చైల్డ్ సీట్ హుక్స్ సాయంతో బిగించుకోవాలి. ప్రస్తుతం, మార్కెట్లో అందుబాటులో దాదాపు అన్ని కార్లు కూడా చైల్డ్ సేఫ్టీ సీట్ బెల్ట్ హుక్స్ తో లభిస్తున్నాయి.

కారులో చైల్డ్ సీట్ ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ చైల్డ్ సీట్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

ఇవి ఎందుకు ముఖ్యమైనవి?

కొన్ని సర్వే గణాంకాలు మరియు పరిశోధన ఫలితాల ప్రకారం, శిశు మరణాలు & గాయాల జాబితాలో మోటారు వాహన ప్రమాదాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే, సరైన జాగ్రత్తలు తీసుకోవటం మరియు కారులో పిల్లలో ప్రయాణించేటప్పుడు చైల్డ్ కార్ సీట్లను తప్పనిసరిగా ఉపయోగించడం వలన పిల్లలకు గాయాల ప్రమాదాన్ని సుమారు 71 శాతం మరియు మరణాల ప్రమాదాన్ని 28 శాతం వరకూ తగ్గించవచ్చని గణాంకాలు చెబుతున్నాయి.

కారులో చైల్డ్ సీట్ ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ చైల్డ్ సీట్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

ప్రస్తుత కాలంలో కారు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. అజాగ్రత్తతో కూడిన డ్రైవింగ్ మరియు పేలవమైన రహదారి పరిస్థితులు కూడా కారు ప్రమాదాలకు ప్రధాన కారకాలుగా చెప్పుకోవచ్చు. కారు సీట్ల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, కారు క్రాష్ అయితే ఏమి జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

కారులో చైల్డ్ సీట్ ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ చైల్డ్ సీట్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

ప్రమాదం జరిగినప్పుడు, సీటు బెల్ట్ లేదా చైల్డ్ సీటు లేకుండా కారులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులెవరైనా సరే వాహనం వెళ్తున్న వేగంతో యాక్సిడెంట్ జరిగినప్పుడు వారు క్యాబిన్‌ నుండి బయటకు విసిరివేయబడతారు. సీటులో హాయిగా కూర్చున్న ప్రయాణించే ప్రయాణికుల పరిస్థితి ఇలా ఉంటే.. ఒడిలో పెట్టుకున్న పాపను తలచుకుంటేనే శరీరం జలదరిస్తింది కదూ. అందుకే బేబీ కార్ సీట్లు చాలా అవసరం, వీటిని సరిగ్గా అమర్చుకుంటే ప్రమాదాల వలన జరిగే భారీ నష్టాన్ని ముందుగానే అడ్డుకోవచ్చు.

కారులో చైల్డ్ సీట్ ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ చైల్డ్ సీట్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

అంతేకాకుండా, ఏదైనా కారులో ప్రమాదం జరిగినప్పుడు చైల్డ్ సీట్లు అమర్చబడిన ముందు మరియు వెనుక సీట్ల మధ్య ప్రాంతం తక్కువగా ఉంటుందని పరీక్ష ఫలితాలు చూపిస్తున్నాయి. గణాంకపరంగా, ఇటువంటి సీట్లు ప్రమాదాల సమయంలో పిల్లల ప్రాణాంతక ప్రమాదాలను 54 శాతం తగ్గించగలవని తేలింది. కాబట్టి మీరు ఉపయోగించిన కారు మరియు శిశువు వయస్సును బట్టి సరైన బేబీ సీటును కొనుగోలు చేసి అమర్చడం ద్వారా నిర్భయంగా పిల్లలతో ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.

కారులో చైల్డ్ సీట్ ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ చైల్డ్ సీట్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

అంతేకాకుండా, గ్లోబల్ NCAP పరీక్షలలో కూడా, పిల్లల భద్రత కోసం ప్రత్యేక అంచనాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి చైల్డ్ ప్రొటెక్షన్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న కార్లను ముందుగానే చూసి ఎంచుకుంటే మరీ మంచిది. వీటన్నింటికీ మించి కారును కొనుగోలు చేసిన తర్వాత ఆఫ్టర్ సేల్స్ మార్కెట్ నుండి కొనుగోలు చేసిన చైల్డ్ సీట్ల నాణ్యతను కూడా తనిఖీ చేయడం చాలా ముఖ్యం.

కారులో చైల్డ్ సీట్ ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ చైల్డ్ సీట్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి?

బేబీ సీట్లు సాధారణంగా లోహపు హుక్కులు మరియు ధృడమైన హార్డ్ ప్లాస్టిక్ పదార్ధాలతో తయారు చేయబడతాయి, కాబట్టి అవి అంత సులువుగా దెబ్బతినవు. కొన్ని ఉత్పాదక సంస్థలు తమ కార్లకు అదనపు యాక్సెసరీగా కూడా ఇటువంటి సీట్లు కూడా అందిస్తుంటాయి. బ్రాండెడ్ కార్ సీట్లు ఎల్లప్పుడు మంచి నాణ్యతను కలిగి ఉంటాయి. మరి మీ పాప లేదా బాబుతో ప్రయాణిస్తున్నప్పుడు మీరు కూడా చైల్డ్ కార్ సీట్ ఉపయోగిస్తున్నారు కదూ..!?

More from DriveSpark

Article Published On: Tuesday, March 1, 2022, 17:08 [IST]
English summary
Important things to know about child seat explained in detail
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+