2012 ఇండియన్ గ్రాండ్ ప్రిలో సెలబ్రిటీల సందడి: ఫోటోలు

By Ravi

గడచిన ఆదివారంతో ముగిసిన 2012 ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. అక్టోబర్ 26 నుంచి 28 వరకూ జరిగిన ఈ రేస్ కార్యక్రమంలో మొదటి రెండు రోజులు ప్రాక్టీస్ సెషన్, క్వాలిఫైయింగ్ సెషన్‌లు జరుగగా మూడవ రోజున (ఆదివారం) ఫైనల్ రేస్ జరిగింది. రెండవ రోజు క్వాలిఫైయింగ్ రేస్‌లో అర్హత సాధించి అగ్రగామి నిలిచిన జర్మన్ రెడ్ బుల్ టీమ్ రేసర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఫార్ములా రేస్ గ్రేటర్ నోయిడాలో గడచిన సంవత్సరం ముస్తాబు చేసిన బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగింది. సుమారు లక్ష మందికి పైగా ఈ రేస్‌ను వీక్షించడానికి వచ్చారు. ఇందులో పలువురు బాలీవుడ్ తారలు, ఇండియన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు, క్రీడాకారులు, పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఓవైపు గ్రిడ్ గర్ల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా మరోవైపు సెలబ్రిటీలు ప్రధాణ ఆకర్షణగా నిలిచారు. 2012 ఇండియన్ గ్రాండ్ ప్రికి విచ్చేసిన సెలబ్రిటీలు, ముద్దుగుమ్మలను ఈ క్రింది ఫోటో ఫీచర్‌లో చూడొచ్చు.

బాలీవుడ్ కలర్

బాలీవుడ్ కలర్

ఇండియన్ గ్రాండ్ ప్రిలో బాలీవుడ్ కలర్ ఎక్కువగా కనిపించింది. ఈ కార్యక్రమంలో బాలీవుడు నటులు షాన్, విక్రమార్కుడు హిందీ రీమేక్‌లో అనుష్క పాత్రను పోషించి అదుర్స్ అనిపించుకున్న సోనాక్షి సిన్హా, రేస్ కార్ల ప్రియుడు అజయ్ దేవగన్‌లు అట్రాక్షన్‌గా నిలిచారు.

నేహా ధూపియా

నేహా ధూపియా

బాలీవుడ్ ముద్దుగుమ్మ నేహా ధూపియాకు వేగంగా వెళ్లే కార్లంటే భలే క్రేజ్. 2012 ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ కార్యక్రమానికి విచ్చేసిన ఈ బాలీవుడు భామ ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని ఆస్వాధించింది.

హర్బజన్ సింగ్

హర్బజన్ సింగ్

ఈ కార్యక్రమంలో క్రికెటర్ హర్బజన్ సింగ్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచి రేస్‌కు విచ్చేసిన ప్రేక్షకులకు వీనుల విందు కల్పించారు. ఫెరారీ పిట్‌ సభ్యులతో సీరియస్ డిస్కషన్స్ చేస్తూ ఇదిగో ఇలా కెమెరాకు చిక్కాడు.

మందిరా బేడీ

మందిరా బేడీ

ఇండియన్ గ్రాండ్ ప్రిలో బాలీవుడ్ అందాల తార మందిరా బేడీ హాట్ దుస్తులలో తళుక్కుమని మెరిసారు.

ఒమర్ అద్భుల్లా

ఒమర్ అద్భుల్లా

ఫార్ములా వన్ రేస్ కేవలం సామాన్యులకు మాత్రమే కాదు, మాకు కూడా అంటున్నారు జమ్మూ అండ్ కాష్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా.

సానియా - షోయబ్

సానియా - షోయబ్

2012 ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ కార్యక్రమానికి భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లు కూడా విచ్చేశారు.

విషాల్ డాడ్లానీ

విషాల్ డాడ్లానీ

గ్రాండ్ ప్రిని వీక్షేందుకు వచ్చిన ప్రేక్షకులను ఉత్సాహ పరిచేందుకు గాయకుడు విషాల్ డాడ్లానీ తనవంతు ప్రయత్నం చేశాడు.

సోనాలీ బింద్రే

సోనాలీ బింద్రే

ఇంద్ర, ఖడ్గం, మురారి, మన్మధుడు, శంకర్ దాదా ఎమ్‌బిబిఎస్ వంటి తెలుగు చిత్రాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ భామ సోనాలీ బింద్రే తన భర్తతో సహా ఈ రేస్‌ను తిలకించేందుకు విచ్చేసింది.

గగన్ నారంగ్

గగన్ నారంగ్

ఇటీవల జరిగిన లండన్ ఒలంపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టిన షూటర్ గగన్ నారంగ్ ఫార్ములా వన్ జెండా ఊపుతూ కెమెరాకు చిక్కాడు.

గ్రాండ్ ప్రి విజేతల పాయింట్లు

గ్రాండ్ ప్రి విజేతల పాయింట్లు

గ్రాండ్ ప్రి తర్వాత పొజిషన్ డ్రైవర్ పాయింట్ల వివరాలు ఇలా ఉన్నాయి:

1. సెబాస్టియన్ వెటెల్ - 240 పాయింట్స్

2. ఫెర్నాండో అలోన్సో - 227 పాయింట్స్

3. కిమి రైక్కోనెన్ - 173 పాయింట్స్

4. మార్క్ వెబ్బర్ - 167 పాయింట్స్

5. లెవిస్ హ్యామిల్టన్ - 165 పాయింట్స్

గ్రిడ్ గర్ల్స్

గ్రిడ్ గర్ల్స్

ఆదివారంతో ముగిసిన 2012 ఇండియన్ గ్రాండ్ ప్రిలో అందమైన గ్రిడ్ గర్ల్స్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

More from DriveSpark

Article Published On: Monday, October 29, 2012, 17:57 [IST]
English summary
If you were glued to your television during the weekend, you would have witnessed the roaring Indian GP. This was the second outing for Formula 1 racers on the Buddh International Circuit. The Indian GP, is one of the most sensational Grand Prix races on the Formula 1 calendar.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+