మార్చ్ 12 నుంచి బేగంపేట విమానశ్రయంలో 'ఏవియేషన్ షో'

By Ravi

హైదరాబాద్: ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే వినామాల పండుగ 'ఇండియా ఏవియేషన్ షో'కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయాన్ని వేదికగా చేసుకొని, ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేది వరకు నాల్గవ ఎడిషన్ ఇండియా ఏవియేషన్ షో జరగనుంది.

కేంద్ర పౌర విమానయాన శాఖ, ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్)లు సంయుక్తంగా ఈ 2014వ ఎడిషన్ ఇండియా ఏవియేషన్ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నాయి. దేశ విదేశాలకు చెందిన అనేక దిగ్గజం విమాన కంపెనీలు ఇందులో భాగం పంచుకోనున్నాయి.

ఈ 2014 ఇండియన్ ఏవియేషన్ షోలో పలు రకాల విమానాలు, హెలికాఫ్టర్లను ప్రదర్శించడంతో పాటుగా వివిధ పౌర విమానయాన అంశాలపై చర్చలు, సీఈఓ ఫోరమ్‌లను కూడా ఈ సందర్భంగా నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో 250 మందికి ఎగ్జిబిటర్లు పాల్గొంటారని అంచనా.

India Aviation Show In Hyderabad

విమానాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ 'బోయింగ్' ఈసారి హైదరాబాద్‌లో 737-8 మ్యాక్స్, కొత్త 777-9ఎక్స్ రేంజ్, 777-300ఈఆర్ మరియు 787-8 విమానాలను ప్రదర్శించనుంది. అలాగే, మరో అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎంబ్రార్ కూడా లీనియేజ్ 1000ఈ, లెగస్సీ 650, ఫెనామ్ 300, ఫెనామ్ 100 జెట్ విమానాలను ప్రదర్శించనుంది.

అలాగే, ఎయిర్‌బస్ తమ లగ్జరీ విమానం ఏ380 ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచనుండగా, రైళ్లు మరియు విమానాలను తయారు చేసే ఏకైక సంస్థయిన బంబార్డియర్ కూడా తమ ఛాలెంజర్ 605 బిజినెస్ జెట్ విమానాన్ని ప్రదర్శించనుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 10, 2014, 17:26 [IST]
English summary
The fourth edition of India Aviation, an international exhibition and conference on civil aviation, will take off at Begumpet Airport in Hyderabad on March 12, 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+