ఇండియా బైక్ వీక్ 2015: డ్రైవ్‌స్పార్క్ అడ్వెంచరస్ ట్రిప్

By Ravi

బైకర్ల పండుగ 'ఇండియా బైక్ వీక్ 2015'కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే దేశం నలువైపుల నుంచి బైకర్లు తమ ద్విచక్ర వాహనాలపై గోవా చేరుకుంటున్నారు. మా డ్రైవ్‌‌స్పార్క్ బృందం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కవర్ చేసేందుకు ఈరోజు ఉదయం తెల్లవారు జామున గోవాకు బయలుదేరింది. ఉదయం 3.20 నిమిషాలకు మా టీమ్ మహీంద్రా బొలెరో వాహనంలో గోవాకు బయలుదేరింది.

ఎప్పుడూ వెళ్లే రూట్‌లో కాకుండా ఈ సారి కాస్తంత కొత్తగా కొత్త రూట్ ట్రై చేద్దామని మా టీమ్ ప్రయత్నించింది. బెంగుళూరు-హుబ్లి హైవేపై వెళ్తూ హుబ్లికి కొంచెం ముందు బన్కాపూర్ వద్ద మలుపు తీసుకున్నాం. అక్కడే ఓ ప్రమాదానికి గురై పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఓ బ్లూ కలర్ మినీ కారును చూశాం. బన్కాపూర్ నుంచి యెల్లాపూర్‌కి బయలుదేరాము.

మరిన్ని ప్రయాణ విశేషాలను ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి..!

ఇండియా బైక్ వీక్ 2015: డ్రైవ్‌స్పార్క్ అడ్వెంచరస్ ట్రిప్

ఉదయం 3.20 నిమిషాల ప్రాంతంలో బెంగుళూరు నుంచి గోవా బయలుదేరాము.

ఇండియా బైక్ వీక్ 2015: డ్రైవ్‌స్పార్క్ అడ్వెంచరస్ ట్రిప్

బెంగుళూరు-హుబ్లి హైవేపై వెళ్తూ హుబ్లికి కొంచెం ముందు బన్కాపూర్ వద్ద మలుపు తీసుకున్నాం. బన్కాపూర్ నుంచి యెల్లాపూర్‌కి బయలుదేరాము.

ఇండియా బైక్ వీక్ 2015: డ్రైవ్‌స్పార్క్ అడ్వెంచరస్ ట్రిప్

బన్కాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రమాదానికి గురై ఉన్న ఓ బ్లూ కలర్ మినీ కారును చూశాం.

ఇండియా బైక్ వీక్ 2015: డ్రైవ్‌స్పార్క్ అడ్వెంచరస్ ట్రిప్

యెల్లాపూర్‌కు కొంచెం ముందుగా ఓ పేరులేని రోడ్డు మీదకు వెళ్లాం. మార్గమధ్యంలో దారితప్పి ఓ అడవిలోకి వెళ్లిపోవటం జరిగింది. అక్కడ జిపిఎస్ కూడా పనిచేయలేదు.

ఇండియా బైక్ వీక్ 2015: డ్రైవ్‌స్పార్క్ అడ్వెంచరస్ ట్రిప్

ఆ అడవి గుండా రోడ్లు లేని మార్గంలో కొంత దూరం డ్రైవ్ చేయగా అంబికానగర్ అనే ప్రాంతం చేరుకున్నాం. అప్పటికీ, గోవాకి చేరుకోవాల్సలిన రోడ్డును చేరుకోలేదు.

ఇండియా బైక్ వీక్ 2015: డ్రైవ్‌స్పార్క్ అడ్వెంచరస్ ట్రిప్

అలా కొంత దూరం ప్రయాణించాక ఫారెస్ట్ ట్రైనింగ్ సెంటర్‌కు చేరుకున్నాం. అక్కడే తట్టిహల్లి డ్యామ్ ఉంది. అదేంటో చూద్దామని కారు దిగి అక్కడికి వెళ్లాం.

ఇండియా బైక్ వీక్ 2015: డ్రైవ్‌స్పార్క్ అడ్వెంచరస్ ట్రిప్

మమ్మల్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది లోపలికి బయటి వారిని అనుమతించడం సాధ్యం కాదని చెప్పాడు. ఆ రోడ్డు వెమ్మటే వెళితే ఓ చిన్న ఐలాండ్ (ద్వీపం) వస్తుందని చెప్పాడు. ఇదిగో ఈ ఫొటో క్యాప్చూర్ చేసింది అక్కడే.

ఇండియా బైక్ వీక్ 2015: డ్రైవ్‌స్పార్క్ అడ్వెంచరస్ ట్రిప్

మార్గమధ్యంలో అనేక లారీలు ఇదిగో ఇలా ప్రమాదానికి గురై కనిపించాయి.

ఇండియా బైక్ వీక్ 2015: డ్రైవ్‌స్పార్క్ అడ్వెంచరస్ ట్రిప్

మొత్తానికి చిన్న చిన్న అవాంతరాలను దాటుకుంటూ హైవే ఎక్కేశాం. ఇదిగో అక్కడే హ్యార్లీ డేవిడన్ గ్రూప్ రైడర్లు కనిపించారు. కాసేపు వారితో మాటా మంతీ కలిపాం. తిరిగి గోవాకు పయనమయ్యాం.

ఇండియా బైక్ వీక్ 2015: డ్రైవ్‌స్పార్క్ అడ్వెంచరస్ ట్రిప్

చివరి సాయంత్రం 3.30 నిమిషాలకు గోవా చేరుకున్నాం. రేపు ఉదయాన్నే గోవాలోని వగతోర్ వద్ద జరగనున్న ఇండియా బైక్ వీక్ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమయ్యాం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, February 19, 2015, 17:41 [IST]
English summary
DriveSpark is en route to cover India Bike Week 2015 in an easily recognisable Mahindra Bolero. The team begun from Bangalore at 3:20 am this morning, and are currently counting down the last hundred kilometres or so before destination Goa.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+