బుల్లెట్‌ రైలు తొలి స్టేషన్‌ నిర్మాణ పనులపై కీలక ప్రకటన.. ఎప్పటికి పూర్తవుతుందంటే?

భారత్‌దేశంలోని ఎన్నో అంచనాలతో ప్రారంభమైన తొలి బుల్లెట్ ట్రైన్‌ కారిడార్‌లో రైలు స్టేషన్‌ (India's First Bullet train) నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. బుల్లెట్‌ ట్రైన్‌ మార్గంలో ట్రాక్‌లు మాత్రమే కాకుండా రైలు స్టేషన్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఆ కారణంగా నాణ్యమైన, నిర్ధిష్ట పద్ధతుల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం నిర్మాణాలు వేగంగా సాగుతుండగా.. ఇప్పటి వరకు బుల్లెట్‌ ట్రైయిన్‌ స్టేషన్‌ నిర్మాణాలు 15 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది.

ఎప్పటికి పూర్తవుతుంది: ముంబై- అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో ( Mumbai Ahmedabad high speed rail corridor) కీలకమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్‌ భారత్‌దేశ తొలి బుల్లెట్‌ రైలు స్టేషన్‌గా ఉంది. ఇక్కడ 15 శాతం సివిల్‌ వర్క్ పూర్తయినట్లు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (NHRCL) సోమవారం ప్రకటన చేసింది. ఈ స్టేషన్‌ను పూర్తిస్థాయిలో 2027 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Bullet train

ఏకైక భూగర్భ రైల్వే స్టేషన్‌ : బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్‌... ఈ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో ఉన్న ఏకైన భూగర్భ రైల్వే స్టేషన్‌గా ఉంది. భూమి నుంచి 24 మీటర్ల లోతులో ఫ్లాట్‌ఫాం నిర్మాణం చేపడుతున్నారు. ఈ స్టేషన్‌ ఆరు ఫ్లాట్‌ఫాంలతో నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం 4.8 హెక్టార్లలో నిర్మాణాలు జరుగుతున్నాయని NHRCL తెలిపింది.

ఈ స్టేషన్‌లో మూడు అంతస్తులు ఉంటాయని తెలిపింది. ఫ్లాట్‌ఫాం, కాన్‌కోర్స్‌, సర్సీస్ ఫ్లోర్‌ ఉంటాయని తెలిపింది. ఈ నిర్మాణంలో నిర్దిష్ట సమయంలో కార్మికుల గరిష్ఠ సంఖ్య 6000కి చేరుకోవచ్చు. 17 నుంచి 21 మీటర్ల లోతు వరకు 3382 సెకాంట్‌ పైల్స్‌ను ఏర్పాటు చేస్తారు. మరియు 2.5 మీటర్ల నుంచి 3.5 మీటర్ల వరకు గ్రౌండ్‌ యాంకర్లు, వాలర్‌లతో బలోపేతం చేస్తారు.

Bullet train bandra and kurla complex station work status

కీలక భద్రతా చర్యలు : బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్‌ నిర్మాణంలో ముంబై ఎయిర్‌ క్వాలిటీ మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు నేషనల్ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది. నిర్మాణ ప్రక్రియ అంతా పర్యావరణ అనుకూలతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. నిర్మాణ ప్రాంతంలో దూళిని తగ్గించేందుకు ఫాగ్‌గన్‌, టార్ఫాలిన్‌, గ్రీన్‌ నెట్‌లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వీల్‌ వాష్‌ సహా గాలి నాణ్యతను కొలిచే పరికరాలను ఏర్పాటుచేశారు.

2027 నాటికి పూర్తిస్థాయిలో : బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్‌ నిర్మాణంలో భాగమైన కార్మికులు వ్యక్తిగత రక్షణ పరికరాలను ఎల్లప్పుడూ కలిగి ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరియు ఆ ప్రాంతంలో కఠినమైన భద్రతా చర్యలను అమలుచేస్తు్న్నట్లు NHRCL తెలిపింది. ప్రస్తుతం ఈ స్టేషన్‌ నిర్మాణం 15 శాతం పూర్తవగా.. 2027 నాటికి పూర్తిస్థాయిలో చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

Bullet train first station work latest news

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 29, 2023, 17:11 [IST]
English summary
India first bullet train station bandra and kurla complex station 15 percent work completed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+