ప్రపంచంలోనే శక్తివంతమైన భారతదేశ తొలి హైడ్రోజన్ రైలు గురించి షాకింగ్ అప్‌డేట్! ఎప్పుడు పట్టాలెక్కనుందో తెలుసా?
భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ (Hydrogen Fuel Cell) రైలు ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని చాలా మంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే వాస్తవానికి మొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ రైలు డిసెంబర్ 2024లో ప్రారంభించాలని నిర్ణయించారు. తరువాత మార్చి 31 నాటికి వినియోగానికి అందుబాటులోకి వస్తుందని భావించినప్పటికీ, దీనిని టెస్టింగ్ చేస్తున్న సమయంలో పలు సాంకేతిక సమస్యలు వెలుగులోకి రావడంతో ఈ రైలు ప్రారంభాన్ని మరికొంత కాలం వాయిదా వేశారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఇండియా మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఈ ఏడాది జూన్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైలు మరింత పేలోడ్ మోసుకెళ్లగల సామర్థ్యాన్ని పొందేందుకు మరిన్ని మార్పులు చేయాల్సి ఉంది.
ఎక్కువ పేలోడ్ మోసుకెళ్లడానికి దాని హైడ్రోజన్ ఇంధన కణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించిన సిబ్బంది, రైలును అనుకున్న సమయానికి ప్రారంభించలేకపోయారు. భారతదేశ రైల్వే అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా హైడ్రోజన్ ఇంధన సెల్ రైలు నిలవనుంది. ఇది ప్రత్యేకంగా చారిత్రాత్మక కల్కా-సిమ్లా మార్గంలో ప్రయాణించనుంది. ఈ ప్రాజెక్ట్ భారతదేశ రైల్వే వ్యవస్థను పూర్తిగా పర్యావరణహితంగా మార్చే దిశగా ఒక పెద్ద అడుగు.

ఈ హైడ్రోజన్ ఇంధన సెల్ రైలు 1,200 HP కెపాసిటీతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్‌తో నడిచే రైలుగా చరిత్రలకెక్కనుంది. ఎలాంటి కాలుష్యాన్ని విడుదల చేయకుండా పర్యావరణానికి సున్నా హాని కలిగించే విధంగా ఇంధనంగా హైడ్రోజన్ ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ రైలు కదలికకు కావాల్సిన శక్తిని తయారుచేసుకుని రైలు పరుగులు పెడుతుంది. ఇది కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు.
ఈ ఇంజిన్ పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేయబడింది. ఈ రైలు విజయవంతమైతే, భారతదేశం పర్యావరణహిత రవాణా విభాగంలో ఓ అగ్రగామిగా నిలుస్తుంది. ఇది మరిన్ని హైడ్రోజన్-ఆధారిత రైళ్లకు మార్గదర్శకంగా మారనుందని అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ హైడ్రోజన్ రైలు ప్రారంభంలో హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 89 కి.మీ. మేర ప్రయాణించనుంది. మొత్తం 8 ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌లో 2,638 మంది ప్రయాణీకులను తీసుకెళ్లవచ్చు. డిజైన్ స్వల్ప దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
భారతదేశపు తొలి హైడ్రోజన్ ఇంధన సెల్ రైలు కొత్త శకం ప్రారంభించనున్నప్పటికీ, ఇది కొన్ని సాంకేతిక, వాతావరణ సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సిమ్లా-కల్కా మార్గం వంటి పర్వత ప్రాంతాల్లో హైడ్రోజన్ రైలు నిరాటంకంగా ప్రయాణించడానికి కొన్ని ప్రధాన మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. 5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ లేదా 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలలో లోడ్ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం.
ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో 2,200 కంటే ఎక్కువ మంది ప్రయాణికులతో సిమ్లా- కల్కా మధ్య ప్రయాణాన్ని కొనసాగించడానికి రైలును తక్కువ వేగంతో నడపాల్సి ఉంటుంది. సాధారణంగా హైడ్రోజన్ రైలు పర్వత ప్రాంతాలలో గంటకు 110 కి.మీ వేగంతో పనిచేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకే అటువంటి సమస్యలను ముందుగానే అధిగమించడానికి రాబోయే హైడ్రోజన్ రైలు నమూనాను పెద్ద ఇంధన కణంతో అభివృద్ధి చేస్తున్నారు.
దేశంలోని మొదటి హైడ్రోజన్ ఇంధన రైలును మరింత వేగంగా, భద్రంగా, సమర్థంగా నడిపించేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. సిమ్లా-కల్కా మార్గంలో ఈ రైలును గంటకు 100 కి.మీ. వేగంతో నడిపేందుకు ప్రత్యేక ట్రాక్ అప్‌గ్రేడ్‌లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేశారు. హైడ్రోజన్ రైళ్ల కోసం కేంద్రం రూ.100 కోట్లు ప్రత్యేకంగా కేటాయింపు చేసింది.


Click it and Unblock the Notifications








