హైదరాబాద్‌ రోడ్లపై రూ.5.6 కోట్ల కారు.. ఇండియాలో మొదటి మెక్‌లారెన్‌ ఆర్టురా డెలివరీ.. ఎవరూ కొన్నారో తెలుసా!

ఇండియాలో లగ్జరీ కార్ల వాడకం క్రమంగా పెరుగుతుంది. చాలా మంది ధనవంతులు సాధారణ కార్ల కంటే అధునాతన ఫీచర్లతో, స్పోర్ట్ మోడల్ లుక్‌ని కలిగి ఉండే సూపర్ కార్లను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విదేశీ కంపెనీలు కూడా తమ వ్యాపారాన్ని పెంచుకోడానికి లోకల్‌గా షోరూమ్‌లను ప్రారింభిస్తూ, కస్టమర్లకు వేగంగా డెలివరీ చేస్తున్నాయి. తాజాగా విదేశీ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ కారును హైదరాబాద్‌లో ఒక కస్టమర్ డెలివరీ అందుకున్నాడు. ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌కు చెందిన సాత్విక్ చోప్దార్‌ ఇండియాలో మొట్టమొదటి సారిగా మెక్‌లారెన్ ఆర్టురా(mclaren artura) లగ్జరీ కారు డెలివరీని తీసుకున్నాడు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సాత్విక్, అతని కుటుంబం ఈ కారును స్వీకరించినట్లుగా వీడియో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతుంది.మెక్‌లారెన్ అనేది బ్రిటీష్ లగ్జరీ కారు తయారీ సంస్థ.

ఇది మొదటగా ఇండియాలో 2022లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తరువాత అదే ఏడాదిలో ముంబై నగరంలో ఫస్ట్ షోరూమ్‌ను ఓపెన్ చేసింది. అప్పటి నుంచి క్రమంగా తన వాహనాలను ఇండియా మార్కెట్లోకి విడుదల చేస్తూ లోకల్‌గా ఉన్న ఇతర లగ్జరీ కార్ల తయారీ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇండియాలో ఆర్టురా, 720ఎస్ కూపే, కన్వర్టిబుల్, 765 ఎల్‌టీ, జీటీ ఉన్నాయి.

India First Mclaren Artura Delivery

మెక్‌లారెన్ ఆర్టురా లగ్జరీ కారు ధర హైదరాబాద్‌లో రూ.5.6 కోట్లుగా ఉంది. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక సూపర్ స్పోర్ట్స్ కారు. ఇది అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఫీచర్లతో వచ్చింది. అందుకే దీని ధర ఇంత భారీగా ఉంది. ఆర్టురా స్టార్ట్ చేసిన 3 సెకన్లలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుంది. ఇది గరష్టంగా గంటకు 330కి.మీ వేగంతో దూసుకుపోతుంది.

యువ వ్యాపారవేత్త సాత్విక్ చోప్దార్‌కు చిన్నప్పటి నుంచి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. వారి కుటుంబం వ్యాపార రంగంలో ఉంది. ఇప్పటికే అతని వద్ద BMW Z4, బీటిల్, ఉరుస్ S, పోర్షే కేమాన్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అతని వద్ద ఉన్న కార్లు కూడా ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో కనిపించాయి. ఇప్పుడు తాజాగా మెక్‌లారెన్ ఆర్టురాను సైతం తన గ్యారేజీలో చేర్చుకున్నాడు.

India First Mclaren Artura Delivery

సాత్విక్ కొనుగోలు చేసిన ఆర్టురా కూపే మోడల్. ఇది స్పైడర్‌గా కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ లగ్జరీ కారు గురించిన వివరాల్లోకి వెళితే, ఇది పీహెచ్‌ఈవీ, 3.0-లీటర్ ట్విన్-టర్బో హైబ్రిడ్ V6 ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇంజిన్ 680 hp పవర్, 720 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రధానంగా ఇంజిన్ ఒక్కటే 585hp పవర్‌ను విడుదల చేస్తుంది.

ఇది ఎలక్టిక్ మోటార్‌ను సైతం కలిగి ఉంది. మోటార్ 95hp పవర్, 225Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్ కారులో ఇంజిన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జోడించారు. ఎలక్ట్రిక్ మోటార్ కోసం 7.4kWh బ్యాటరీ ప్యాక్‌ను కారులో అమర్చారు. ఈ ఆప్షన్‌లో టాప్ స్పీడ్ గంటకు 130 కి.మీ గా ఉంది. బ్యాటరీని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది రెండున్నర గంటల్లో 0 - 80 శాతం ఛార్జ్ అవుతుంది.

Mclaren Artura Priced Rs 5 6 Crore Delivery

మెక్‌లారెన్ ఆర్టురా బరువు కేవలం 1,498 కిలోలు. దీని బాడీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కార్బన్-ఫైబర్ టబ్‌, అల్యూమినియంతో తయారు చేసిన వెనుక సబ్ ఫ్రేమ్ ఉంది. ఇది 66 లీటర్ల ఇంధన ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. వెడల్పు 2,080 మి.మీ, పొడవు 4,539 మి.మీ, ఎత్తు 1,193 మి.మీ, వీల్‌బేస్ పరిమాణం 2,640 మి,మీ. ముందు 19 అంగుళాలు, వెనుక 20 అంగుళాల వీల్స్ ఉన్నాయి.

లోపల క్యాబిన్‌లో కూడా USB ఛార్జింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మెక్‌లారెన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే,డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, భద్రత కోసం ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఈ-మోడ్, కంఫర్ట్, స్పోర్ట్, ట్రాక్ అనే డ్రైవింగ్ మోడ్‌ ఆప్షన్లను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 13, 2024, 12:54 [IST]
English summary
India first mclaren artura priced rs 5 6 crore delivery here the video
Read more on: #mclaren #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+