త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వేలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆధునిక సౌకర్యాలతో రైళ్లు రూపు దిద్దుకుంటున్నాయి. ఇందుకు వందే భారత్ రైళ్లు ఉదాహరణ. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సెమీ హె స్పీడ్ రైళ్లు రూపుదిద్దుకున్నాయి. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు సేవలందిస్తుండగా.. త్వరలో బుల్లెట్ రైళ్లు కూడా భారత్‌లో మెరుపు వేగంతో పరగులు పెట్టనున్నాయి.
దేశంలో త్వరలో బుల్లెట్ రైళ్లు(Bullet Trains) అందుబాటులోకి రానున్నాయి. ముంబయి-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు త్వరలో పరుగులు పెట్టనుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు జపాన్ పైనే భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది. అటు టెక్నాలజీ పరంగా, ఇటు ఆర్థికపరంగా భారత్‌కు జపాన్ సాయం చేస్తోంది.

ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు(Mumbai-Ahmedabad-Bullet-Train-Project)లో జపాన్ పాత్ర చాలా కీలకం. కాగా.. త్వరలో భారతీయులందరూ గర్వపడేలా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త బుల్లెట్ రైళ్లను నడపబోతున్నారు. అయితే ఇది భారతదేశానికి చెందిన సొంత బుల్లెట్ రైళ్లు కావడం విశేషం. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. భారత్ సొంతంగా బుల్లెట్ రైళ్లను నిర్మించే పని ఇప్పటికే మొదలు కావడం.
ఈ కొత్త బుల్లెట్ రైళ్లు ప్రస్తుతం భారతీయ రైల్వేలు నడుపుతున్న ఏ రైలు కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. భారత్‌కు చెందిన ఈ కొత్త బుల్లెట్ రైళ్లు గంటకు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. భారత్ తయారుచేసే బుల్లెట్ రైళ్లు ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు నడుపుతున్న వాటి వేగంతో పోల్చుకునేలా ఉంటాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చెన్నైలోని ఐసీఎఫ్ (Integral Coach Factory) ఫ్యాక్టరీలో ఈ బుల్లెట్ రైళ్ల తయారీ పనులు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు భారతీయ రైల్వేకు చిహ్నంగా మారుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను చెన్నై ఐసీఎఫ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న విషయం తెలిసిందే..
కాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఏ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతున్నాయో అదే ప్లాట్‌ఫారమ్‌పై భారతదేశం యొక్క స్వంత బుల్లెట్ రైళ్లు నిర్మించబడతాయని సమాచారం. ఈ మేడ్-ఇన్-ఇండియా బుల్లెట్ రైళ్లు దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు తూర్పు ప్రాంతాల్లో సర్వీస్‌లు అందిస్తాయి. ఇది మనం గర్వించదగ్గ విషయం.

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బుల్లెట్ రైళ్లు భారతదేశానికి చాలా అవసరం కానున్నాయి. అధిక వేగంతో ప్రయాణించడం ద్వారా, ఇవి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ బుల్లెట్ రైళ్లు ఆర్థికాభివృద్ధికి ఒక విధంగా దోహదపడతాయని రైల్వే శాఖ భావిస్తోంది.
అయితే ఛార్జీలు ఎక్కువ కాబట్టి బుల్లెట్ రైళ్లు సామాన్యులకు అనుకూలమా? అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టినప్పుడు కూడా మొదట్లో ఛార్జీలు ఎక్కువగానే ఉన్నాయనే విమర్శలను చదివాం. కానీ ఇప్పుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లును అందరూ ఆదరిస్తున్నారు. త్వరలో బుల్లెట్ రైళ్లకు కూడా ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








