అమెరికాను అడుక్కోవాల్సిన పని లేదు....స్వదేశీ పరిజ్ఞానంతో రానున్న భారతదేశపు న్యావిగేషన్ సిస్టమ్
జిపిఎస్ చాలా చోట్ల ప్రతి ఒక్కరూ ఎన్నో సార్లు వింటూ ఉంటారు. అయితే జిపిఎస్ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. టెక్నాలజీకి సంభందించి చాలా వాటిని నియంత్రించడం, సమాచారం చేరవేయడం, న్యావిగేషన్ చివరికి ఆటోమొబైల్స్‌లో కూడా వీటి వాడకం ఉంది. అంటే దేశం యొక్క సమాచార సాంకేతిక వ్యవస్థకు మూలం ఇదే అన్నమాట. దేశంలో ఏ మూలన ఏం జరుగుతోంది అనే మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు, దీనంతటికీ మూలం జిపిఎస్ అని ముద్దు పేరుతో పిలవబడే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దీని అవసరం దేశం యొక్క ఆర్మీకి కూడా ఎంతో ఉంది.
అయితే దేశ అభివృద్దిలో ఎంతో కీలకంగా ఉండే ఈ జిపిఎస్ వ్యవస్థను నియంత్రించేది మాత్రం అమెరికా. ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు దేశాలు సొంతంగా జిపిఎస్ పరిజ్ఞానాన్ని సృష్టించుకుని ఉపయోగించుకుంటున్నాయి. అయితే భారత్‌కు ఈ పరిజ్ఞానం లేకపోవడం వలన అమెరికా ద్వారా సేవలు వినియోగించుకుంటోంది. ఈ ధోరణిని మారేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన జిపిఎస్ కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ దీనికి చెందిన టెక్నాలజీని సృష్టించింది.
Also Read: దేశీయంగా అత్యంత రద్దీగా ఉండే టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు
ఐఎన్‌ఆర్‌ఎస్ఎస్ అనే దానిని అతి త్వరలో ప్రారంభించనుంది. దీనికి చెందిన పూర్తి వివరాలు క్రింద గల కథనాల తెలుసుకుందాం రండి.

ఐఆర్‌ఎన్ఎస్ఎస్ అనగా
ఐన్‌ఆర్‌ఎస్ఎస్ అనే దానిని జిపిఎస్ స్థానంలో ప్రేవేశపెట్టనున్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కు బదులుగా ఇండియన్ రీజియన్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. జిపిఎస్ ద్వారా జరిగే అన్ని పనులతో పాటు అదనపు పనులకు కూడా ఈ కొత్త వ్యవస్థను ఉపయోగించుకోనున్నాము.

11 శాటిలైట్ల వరకు ప్రయోగించనున్నారు.
ఐఆర్‌ఎన్ఎస్ఎస్ పరిజ్ఞానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మొత్తం ఏడు శాటిలైట్లను ప్రయోగించాల్సి ఉంటుంది. అయితే వీటి సేవలు ప్రారంభించడానికి మొదటిగా నాలుగు శాటిలైట్లను ప్రయోగించనున్నారు. ఆ తరువత మూడు మరియు ఈ మొత్తం ఏడింటిని మరింత మెరుగైన సేవల కోసం 11 కు పెంచనున్నారు.

దీనితో ఏడవ దేశంగా అవతరించనున్న భారత్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్వంత జిపిఎస్ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకున్న వాటిలో అమెరికా, రష్యా, యూరప్, చైనా మరియు జపాన్‌లు ఉన్నాయి. ఈ ఐఆర్‌ఎన్ఎస్ఎస్ ప్రయోగంతో భారత్ కూడా వీటి సరసన చేరిపోయింది.

10 ఏళ్ల కాలపరిమితి
ఇస్రో ఆరవ సారిగా ఎక్స్ఎల్ వర్షెన్‌కు చెందిన 44.4-మీటర్లు పొడవైన పిఎస్‌ఎల్‌వి శాటిలైట్‌ను 1బి కోసం ఉపయోగిస్తోంది. ఐఆర్‌ఎన్ఎస్ఎస్ 1బి మిషన్ యొక్క కాలపరిమితి ప్రయోగించిన సమయం నుండి 10 సంవత్సరాలుగా ఉంటుంది.

అమెరికా జిపిఎస్ వ్యవస్థకు సమానంగా
ఇస్రో అధికారికంగా ప్రకటించిన వాటిలో భారత్‌కు చెందన ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ అమెరికాకు చెందిన జిపిఎస్, రష్యాకు చెందిన గ్లోనాస్ మరియు ఇతర స్వంత పరిజ్ఞానం కలిగిన దేశలతో సమానంగా ఉంటుందని తెలిసింది.

1ఎ మరియు 1బి
ఐఆర్ఎన్ఎస్ కోసం ముందుగా ప్రారంభించిన 1ఎ దాని కక్ష్యలో సరైన పనితీరును కనబరుస్తోంది. ఇది ముఖ్యమైన 1బి ను ప్రయోగించడానికి ముందుగా అనువైన పరిస్థితులను అధ్యనం చేయడానికి 1ఎ శాటిలైట్ ఉపయోగపడుతుంది.

కక్ష్యలోకి
ఏడు శాటిలైట్లతో కక్ష్యలోకి వెళ్లనున్న 1బి ను ఈ ఏడాది ఏప్రిల్ నాలుగు సరిగ్గా సాయంకాలం 5 గంటల 14 నిమిషాలకు ప్రయోగించనున్నారు. దీనిని శ్రీ హరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించనున్నారు. తరువాత స్లైడర్ల ద్వారా ఈ స్వదేశీ జిపిఎస్ ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోగలరు.

వాతావరణ సమాచారం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఐఎన్ఆర్ఎస్ఎస్ ద్వారా దేశానికి చెందిన గాలిలో మరియు వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను అన్ని వాతావరణ పరిస్థితుల్లో స్థానం మరియు సమయం ఆధారంగా పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

దేశం నలువైపులనూ...
ఐఆర్ఎన్ఎస్ఎస్ కోసం ఇస్రో మొత్తం ఏడు శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశ పెట్టనుంది. అందులో మూడు శాటిలైట్లను భూ స్థిర కక్ష్యలోకి మరియు నాలుగు శాటిలైట్లను భూ సమస్థిత కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. తద్వారా భారతదేశపు మొత్తం భూ భాగపు చుట్టు ప్రక్కలను పర్యవేక్షిస్తుంది.

విమానయాన సేవలకు
దేశీయంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో సమాచార సాంకేతిక వ్యవస్థ కోసం ఈ దేశీయ ఐఆర్‍ఎన్ఎస్ఎస్ పరిజ్ఞానాన్ని రానున్న రెండేళ్లలోపు వినియోగించనున్నారు.

ఆటోమొబైల్ రంగంలో
వెహికల్ ట్రాకింగ్ (ఈ పరిజ్ఞానం ద్వారా వాహనం ఉన్న ప్రదేశాన్ని గుర్తించడం), డ్రైవర్ల కోసం విజువల్ మరియు వాయిస్ న్యావిగేషన్ సిస్టమ్ కోసం ఈ పరిజ్ఞానాన్ని వినియోగించునున్నారు.

న్యావిగేషన్
ప్రతి ఒక్క రంగంలో కూడా న్యావిగేషన్ వ్యవస్థ ఎంతో కీలకమైనది. అందులో ముఖ్యంగా కారులో, సెల్ ఫోన్ ద్వారా జిపిఎస్ న్యావిగేషన్, ఓడలు, నౌకలు, బోట్లు, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ అంతే కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ భారీ విమానాలలో మరియు కొన్ని శాటిలైట్లలో కూడా దీని వినియోగిస్తారు.

నగరాల సర్వే మరియు నిర్మాణ ప్రణాళికల్లో
ఐఎన్ఆర్ఎస్ఎస్ పరిజ్ఞానాన్ని నిర్మాణ రంగం పరంగా వినియోగించే భౌగోళిక సమాచార వ్యవస్థలా కూడా ఇది పనిచేస్తుంది. అంతే కాకుండా సర్వేలలో నిర్ధిష్ట పాయింట్లను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది.

విపత్తుల నిర్వహణ
ఐఆర్ఎన్ఎస్ఎస్ పరిజ్ఞానం ద్వారా రెస్కూ నిర్వహించవచ్చు అంతే కాకుండా ఇందులో ఉండే ప్రత్యేక టెక్నాలజీ ద్వారా శత్రువుల కదలికలు మరియు భూమి ఆక్రమనలను గుర్తించవచ్చు.

ఆట విడుపు మరియు మానసిక విశ్రాంతి కోసం
భవిష్యత్తులో జియో ట్యాగింగ్ అనే పరిజ్ఞానం ద్వారా ఫోటోలు, ప్రదేశం యొక్క ఆధారంగా జరిగే ఆటలకు సంభందించిన వివరాలను ఎన్ఎస్ఎస్ డివైస్‌ల ద్వారా వినియోగించుకోవచ్చు.

భద్రత రంగంలో
జంతువుల భద్రత పరంగా ముందడగు వేస్తున్నారు. అందుకు నిదర్శనం ఈ పరిజ్ఞానం. ఎందుకంటే జంతువులను మరియు వాహనాలను ట్రాకింగ్ చేయడం ద్వారా వాహనాల ద్వారా జరిగే ప్రమాదాలు జరగకుండా ముందుగా సందేశం పంపిస్తుంది.

వ్యవసాయ రంగంలో
పంటలు పండించే ముందు వేయనున్న పంట, నేల రకము మరియు వాతావరణానికి చెందిన సమాచారం దీనికి తెలియజేయడం ద్వారా ఇది అవసరానికి తగ్గట్లుగా సూచనలను ఇస్తుంది. తద్వారా పంట దిగుబడులు పెరుగుతాయి.

గడియారం యొక్క సూచనలు
ఈ పరిజ్ఞానం ద్వారా సమకాలీకరించబడిన సమయం ప్రకారం సమాచారం యొక్క సూచనలు చేస్తుంది.

రక్షణ రంగంలో
రక్షణ రంగంలో ముఖ్యంగా సైన్యానికి ఎంతో ఉపయోగపడే విధంగా మిస్సైల్స్, బాంబులు మరియు ఎయిర్ క్రాఫ్ట్ ల యొక్క దిశను మరియు వాటిని పనితీరులను ఈ పరిజ్ఞానం ద్వారా గమనించవచ్చు. యుద్ద సమయంలో ఇది ఎంతో విలువైన సమాచారాన్ని సైనిక స్థావరాలకు చేరవేస్తుంది.

- పైలట్ మరియు విమాన సిబ్బంది ఎగిరే విమానంలో చేసే 20 చీకటి పనులు
- మూత్రం నుండి కాఫీ చేసుకున్నాం: వ్యోమగాముల అనుభవాలు
- ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ముదురుతున్న యుద్ద వాతావరణం


Click it and Unblock the Notifications








