భారత దేశపు అత్యంత పొడవైన వంతెన గురించి ఆసక్తికరమైన విషయాలు!

Written By:

అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన వంతెన ఇప్పుడు చివరి దశ పనుల్లో ఉంది. 9.15కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన ఇప్పుడు భారతదేశంలోకెల్లా ఉన్న అత్యంత పొడవైన వంతెనల జాబితాలో ముందు నిలిచింది. ఈ వంతెన గురించి మరిన్ని వివరాలు....

ప్రధాని నరేంద్ర మోడీగారు అతి త్వరలో ఈ వంతెనను ప్రారంభించనున్నార. ఇందుకు గాను అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సరబానంద్ సోనొవాల్ గారు నరేంద్ర మోడీగారిని ఆహ్వానించారు.

అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాలను కలుపుతూ లోహిత్ మరియు బ్రహ్మపుత్రా నదుల మీద నిర్మించిన ఈ వంతెన పొడవు సుమారుగా 9.15 కోలోమీటర్లుగా ఉంది.

వంతెన పొడవు పరంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత పొడవైన వాటిలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఈ వంతెనను సుమారుగా 950 కోట్ల రుపాయలు వెచ్చించి నిర్మించారు.

అస్సాంలోని రాజధాని గౌహతికి 540కిమీల దూరంలో ఉన్న సాదియా నుండి ప్రారంభమయ్యి, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 300కిమీల దూరంలో ఉన్న ధోలా అనే ప్రాంతం వరకు దీనిని నిర్మించారు.

దీనిని పూర్తి స్థాయిలో ప్రారంభించి రాకపోకలకు అనుమతిస్తే, రెండు రాష్ట్రాలలోని రాజధాని ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం సుమారుగా నాలుగు గంటల వరకు తగ్గిపోనుంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో విమానాశ్రయం లేకపోవడంతో ఇప్పటి వరకూ వాయు సేవలు లేవు. అయితే ఈ వంతెన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, రెండు రాష్ట్రాల మధ్య రవాణా సదుపాయం మరింత సరళం కానుంది.

ఈ వంతెన నిర్మాణాన్ని 2011లో ప్రారంభించారు.దీని నిర్మాణం కోసం సుమారుగా రూ. 950 కోట్ల రుపాయల నిధులు విడుదల చేశారు

యుద్ద ట్యాంకులు మరియు భారీ పరిమాణంలో ఉన్న మిలిటరీ వెహికల్స్ కూడా ప్రయాణించేందుకు వీలుగా దీనిని నిర్మించడం జరిగింది.

భారత దేశంలో భారీ వ్యూహాత్మక విలువలు గల రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం ఉన్నాయి. యుద్ద కాలంలో మిలిటరీ దళలాలు ఎక్కువగా ఈ రాష్ట్రాల్లో సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి వారికోసం మెరుగైన రవాణా ఈ వంతెన ద్వారా సాధ్యం కానుంది.

దేశవ్యాప్తంగా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ప్రధాన రహదారుల అభివృద్దికి రూ. 50,000 కోట్ల రుపాయలను కేటాయించగా, ఇందులోని నుండి సేకరించిన 950 కోట్ల రుపాయల మొత్తంతో ఈ వంతెన నిర్మాణం పూర్తి చేసారు.

ప్రస్తుతం ఉన్న బంద్రా-వొర్లి సముద్రం మార్గం మీదుగా ఉన్న 3.55 కిలోమీటర్ల పొడవున్న వంతెన కన్నా ఈ ధోలా-సాదియా వంతెన పొడవైనది.

English summary
Read in Telugu to know about India Longest Bridge Open Soon. Get more details of India Longest Bridge Dhila-Sadiya connecting assam and arunachal pradesh.
Story first published: Thursday, April 20, 2017, 17:14 [IST]
Please Wait while comments are loading...

Latest Photos