భారతదేశంలో కూడా ఎగిరే కార్లు రాబోతున్నాయా..? సుజుకి మోటార్ నెక్స్ట్ ప్లాన్ అదేనా..?
ఎగిరే కారు (Flying Car), ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు ప్రధానంగా దృష్టిపెట్టిన నెక్స్ట్ లెవల్ కమ్యూటింగ్ సెగ్మెంట్ ఇది. అంటే, త్వరలోనే రోడ్లపై పరుగులు తీసే కార్లు పోయి, గాలిలో చక్కర్లు కొట్టే ఎగిరే కార్లు మన ముందుకు రాబోతున్నాయన్నమాట. భారతదేశంలో కూడా మనం ఇలాంటి కార్లను చూసే అవకాశం ఉంది. ఈ మేరకు జపాన్ కి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ (Suzuki Motor) ఫ్లయింగ్ కార్ల తయారీ సంస్థ అయిన స్కైడ్రైవ్ (Skydrive) భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

సుజుకి మరియు స్కైడ్రైవ్ సంస్థలు కలిసి ఓ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేసేందుకు ఈ డీల్ పై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్యం కింద రెండు కంపెనీలు ఫ్లయింగ్ కార్ల పరిశోధన, అభివృద్ధి, తయారీ మరియు మార్కెటింగ్‌ను చేపట్టనున్నాయి. ఈ డీల్‌లో భాగంగా, సుజుకి మరియు స్కైడ్రైవ్ కంపెనీలు తమ ప్రధాన మార్కెట్ ను భారతదేశంగా ఎంచుకున్నాయి. జపాన్ కి చెందిన సుజుకి మోటార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు, ఇది మనదేశంలో మారుతి సుజుకి యొక్క మాతృ సంస్థ.

ఇక ఫ్లయింగ్ కార్ కంపెనీ అయిన స్కైడ్రైవ్ విషయానికి వస్తే, ఈ కంపెనీ ప్రస్తుతం బ్యాటరీతో నడిచే కాంపాక్ట్ టూ-సీటర్ ఫ్లయింగ్ కార్‌ను అభివృద్ధి చేసే పనిలో చాలా బిజీగా ఉంది. ఈ ఫ్లయింగ్ కారు యొక్క తుది డిజైన్‌ను సిద్ధం చేసిన తర్వాత, కంపెనీ దీనిని భారీ మొత్తంలో ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. స్కైడ్రైవ్ తమ మొట్టమొదటి ఎగిరే కారును 2025లో జపాన్‌లోని ఒసాకా నగరంలో జరగనున్న వరల్డ్ ఎక్స్‌పోలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

సుజుకి మరియు స్కై డ్రైవ్ సంస్థలు అభివృద్ధి చేస్తున్న ఈ ఫ్లయింగ్ కార్ పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ తో పనిచేస్తుందని సమాచారం. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు ఉన్న చోటు నుండే గాలిలోకి ఎగిరేలా మరియు నిటారుగా ల్యాండ్ అయ్యేలా (వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) ఉంటుందని తెలుస్తోంది. ఈ లైట్ వెయింట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల పరిశోధన, అభివృద్ధి మరియు మార్కెటింగ్ కోసం ఇప్పటికే ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు సుజుకి మోటార్ మరియు స్కైడ్రైవ్ సంస్థలు తెలిపాయి.

ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ల కోసం కొత్త మార్కెట్లను తెరవడానికి కూడా కృషి చేస్తామని రెండు కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. సుజుకి మోటార్ ఇటీవలే భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు మరియు బ్యాటరీల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం దాదాపు 1.37 బిలియన్ డాలర్ల పెట్టుబడిని కూడా వెచ్చించనున్నట్లు కంపెనీ పేర్కొంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, సుజుకి మోటార్ భారతదేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్ తో పాటు భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల కోసం పెరిగే డిమాండ్ ను కంపెనీ ముందుగానే అంచనా వేస్తోంది. ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ 2021 సంవత్సరంలో మూడు రెట్లు పెరిగింది. రానున్న కొన్ని సంవత్సరాల్లో ఇది మరింత భారీ సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, భారతదేశంలో సున్నా ఉద్గారాలను సాధించేందుకు ప్రభుత్వం 2070 నాటికి జీరో కార్బన్ ఎమిషన్ ను లక్ష్యంగా పెట్టుకుంది.

కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఈ లక్ష్యంలో, స్వచ్ఛమైన శక్తి సాంకేతికత (ప్యూర్ ఎనర్జీ టెక్నాలజీ), బ్యాటరీ నిల్వ (బ్యాటరీ స్టోరేజ్) మరియు హైడ్రోజన్ ఇంధనం (హైడ్రోజెన్ ఫ్యూయెల్) వంటి సున్నా ఉద్గార వనరుల వినియోగాన్ని ప్రోత్సహించనుంది. ఎగిరే కార్లు మరియు టాక్సీల కోసం భారతదేశం కేంద్రంగా ఉన్నందున, సుజుకి మోటార్ భవిష్యత్తులో అనేక వర్గాలలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు.

సుజుకి మోటార్ ఇప్పటికే టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిని ప్రారంభించింది. అదే సమయంలో, కంపెనీ ఇప్పుడు ఫ్లయింగ్ కార్ల విభాగంలోకి ప్రవేశించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని విస్తరించాలనుకుంటోంది. ఒక నివేదిక ప్రకారం, 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ టాక్సీ మార్కెట్ 1,700 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేయబడింది.

రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం అనుసరిస్తున్న అర్బన్ ఎయిర్ మొబిలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (పట్టణ వాయు చలనశీలత పర్యావరణ వ్యవస్థ) ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ యొక్క ఉదాహరణ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతోంది. ఈ ఎయిర్ మొబిలిటీ సిస్టమ్ కొత్త తరం అధునాతన సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది, ఇది భవిష్యత్తులో రోడ్లపై ట్రాఫిక్ ను తగ్గించేందుకు తద్వారా రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా తగ్గించేందుకు సహకరించనుంది. తెలుగులో లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ను గమనిస్తూ ఉండండి.
(గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన చిత్రాలు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే అని గమనించండి.)


Click it and Unblock the Notifications








