ప్రతి గంటకు ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాం.. రోడ్లపై పెరుగుతున్న ప్రమాదాలు.. అసలు సమస్య ఏమిటి?
ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది రోడ్డు సేఫ్టీ నియమాలు పాటించకపోవడం వలన దేశంలో ప్రతి నిమిషం ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్స్ జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినప్పటికి కూడా కొంత మంది వాటిని పాటించడం లేదు. హెల్మెట్ వేసుకోవడం, సీట్ బెల్ట్ ధరించడం లాంటి అత్యవసర నియమాలను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు.
కొద్ది దూరం కాబట్టి హెల్మెట్ ధరించడం ఎందుకులే అనే అలసత్వం కూడా మన ప్రాణాలను ప్రమాదంలో నెట్టివేస్తుంది. ఒక్క సెకనులో జరిగే ప్రమాదంలో హెల్మెట్ తలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వలన యాక్సిడెంట్‌లో తమ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇవన్నీ వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు.

రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న ఈ రోజుల్లో, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇదిలా ఉంటే తాజా గణాంకాల ప్రకారం, గతంలో దేశవ్యాప్తంగా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగగా, వీటి కారణంగా 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరింత షాకింగ్ విషయం ఏమిటంటే, సుమారు 4 లక్షల మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో 18 నుంచి 45 ఏళ్ల వారు ఎక్కువగా ఉన్నారు.
ఇటీవల కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన పార్లమెంటేరియన్స్ కార్ ర్యాలీ 2025లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రతి ఒక్కరు తామ పాటించాల్సిన రోడ్ సేఫ్టీ నియమాలను హైలెట్ చేశారు. రోడ్డు భద్రత గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇదని ఆయన అన్నారు. గణంకాలు చూసినట్లయితే గతంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.

దేశంలో అల్లర్లు, ఉగ్రవాద దాడుల కంటే కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారే ఎక్కువగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని రోడ్లను సురక్షితమైన ప్రయాణాలకు అనువైనవిగా మార్చాలనే లక్ష్యంతో అనేక చర్యలు తీసుకుంటోంది. అయితే ఇక్కడ ప్రభుత్వం మాత్రమే ప్రమాదాలను తగ్గించలేదు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలు పాటించడం, ఇతరులకు అవగాహన కలిగించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను పూర్తిగా అధిగమించడానికి వీలవుతుంది.
అతివేగంగా వాహనం నడపడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం, మద్యపానం చేసి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వంటి వాటి వల్ల ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని తగ్గించడానికి సిగ్నల్స్ పాటించడం, స్పీడ్ లిమిట్ మీరకపోవడం, మద్యపానం చేసి వాహనం నడపకపోవడం వంటి నియమాలు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుతం రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా ప్రమాదాలకు ఎక్కువ కారణమవుతున్నాయి.

రోడ్డు ప్రమాదాల కారణంగా భారతదేశ జీడిపీలో 3 శాతానికి సమానమైన ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ ఎత్తున జరిమానాలు విధించడంతో పాటు, కొన్ని కేసుల్లో తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా విధిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ఇది అందరి బాధ్యత.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








