ఫలించిన కల; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

ప్రపంచం రోజు రోజుకి అభివృద్దివైపుకి పరుగులు తీస్తున్న తరుణంలో అనేకరకాల కొత్త వాహన సర్వీసులు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఎగిరే వాహనాలు కూడా తయారవుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఎయిర్ టాక్సీ సర్వీస్ ప్రారంభించబడింది. ఈ ఎయిర్ టాక్సీ సర్వీస్ భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీ సర్వీస్. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఫలించిన కల ; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

భారతదేశంలో ప్రారంభించబడిన ఈ ఎయిర్ టాక్సీ సర్వీస్ హర్యానా రాష్ట్రంలో ప్రారంభించబడింది. దీనిని హర్యానా ముఖ్యమంత్రి 'మనోహర్ లాల్ ఖత్తర్' గురువారం చండీగర్-హిసార్ ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఈ సర్వీస్ ప్రారంభించబడింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ మొదటి ప్రయాణీకులకు బోర్డింగ్ పాస్లు ఇవ్వడం ద్వారా సర్వీస్ ప్రారంభించడం జరిగింది.

ఫలించిన కల ; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

ఈ సర్వీస్ ను ఎయిర్ టాక్సీ ఏవియేషన్ ప్రారంభించినట్లు అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ సర్వీస్ కోసం ఎయిర్ టాక్సీ నాలుగు సీట్ల విమానాలను ఉపయోగిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఎయిర్ టాక్సీలలో పైలట్ కాకుండా మరో ముగ్గురు ప్రయాణీకులు ప్రయాణించవచ్చు.

MOST READ:కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

ఫలించిన కల ; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

ఈ ఎయిర్ టాక్సీ సహాయంతో, చండీఘర్ నుండి హిసార్ వరకు ఉన్న దూరాన్ని కేవలం 45 నిమిషాల్లో కవర్ చేయవచ్చు. అంటే చండీఘర్ నుంచి హిసార్ చేరుకోవడానికి పట్టే సమయం కేవలం 45 నిముషాలు మాత్రమే. కావున ఈ ఎయిర్ టాక్సీ సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.

ఫలించిన కల ; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

ఎయిర్ టాక్సీ సేవను ప్రారంభించిన తరువాత మనోహర్ ఖత్తర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ 'ఉదయ్' స్కీమ్ కింద ఈ సర్వీసును ప్రారంభించారు. విమాన ప్రయాణం చాలా సరసమైనదిగా ఉండే విధంగా ఈ ప్రణాళికను ప్రవేశపెట్టారని తెలిపారు.

MOST READ:కొత్త ఆడి ఎ4 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. పూర్తి వివరాలు

ఫలించిన కల ; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

ఎయిర్ టాక్సీ ఏవియేషన్ హిసార్ నుండి చండీగర్ వరకు 1,755 రూపాయలు వసూలు చేస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి మనోహర్ ఖత్తర్ తెలిపారు. ఈ సర్వీస్ ని పొందాలనుకునే వినియోగదారులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ సర్వీస్ పొందగలరు.

ఫలించిన కల ; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సంస్థ ప్రైవేట్ బుకింగ్ సదుపాయాన్ని కూడా కల్పించింది. దీని కోసం అదనపు అమౌంట్ కూడా వసూలు చేయబడుతుంది. ప్రారంభంలో, హిసార్ మరియు చండీగర్ మధ్య రోజువారీ విమానాలు ఉంటాయి.

MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

ఫలించిన కల ; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

ఒక ప్రయాణీకుడు మాత్రమే టికెట్ రిజర్వు చేసినప్పటికీ, వారి కోసం కూడా ఈ విమానం ఎగురుతుంది. అంటే ఒక్క ప్రయాణికుడు ఉంటె కూడా ఈ సర్వీస్ పొందవచ్చు. గురువారం నుండి చండీగర్-హిసార్ విమాన సర్వీసును ప్రారంభించిన ఈ సంస్థ జనవరి 18 న హిసార్ నుండి డెహ్రాడూన్ వరకు మరియు జనవరి 23 న హిసార్ నుంచి ధర్మశాల వరకు తన సర్వీసులను ప్రారంభించనుంది.

ఫలించిన కల ; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

ఇటీవల కొత్త స్కీమ్ ప్రకారం, వాడుతున్న పాత ప్రభుత్వ వాహనాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఎందుకంటే దీని ద్వారా కొత్త స్క్రాపింగ్ విధానాన్ని అమలు చేయడానికి యోచిస్తోంది. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ సంబంధిత విభాగాలకు తెలియజేశారు.

MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

ఫలించిన కల ; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

15 సంవత్సరాల వయస్సు గల ప్రభుత్వ వాహనాలను గుర్తించాలని ప్రధాని సంబంధిత విభాగాలకు సూచించారు. పాత ప్రభుత్వ వాహనాలను తొలగించడం ద్వారా స్క్రాపింగ్ విధానానికి ప్రభుత్వం తన సంకల్పం యొక్క సందేశాన్ని ఇవ్వాలనుకుంటుంది. ఈ విధానం ద్వారా చాల వాహనాలు తొలగించబడే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Indias' First Air Taxi Service Starts Between Hissar To Chandigar. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X