డ్రోన్ ద్వారా మెడికల్ డెలివరీకి శ్రీకారం.. ట్రయిల్ టెస్ట్ స్టార్ట్

భారతదేశం రోజురోజుకి అభివృద్ధి వైపు నడుస్తున్న క్రమంలో కొత్త వాహనాలు మార్కెట్లో అవతరిస్తున్నాయి. అంతే కాదు కొన్ని పద్ధతుల్లో కూడా కొత్త విధానాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే ఇటీవల మెడికల్స్ వంటి వాటిని అవసరమైన వారికి అందించడానికి, మెడికల్ డ్రోన్ ట్రయల్ ప్రారంభించబడింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి మెడికల్ డ్రోన్ డెలివరీ ట్రయల్.

డ్రోన్ ద్వారా మెడికల్ డెలివరీకి శ్రీకారం.. ట్రయిల్ టెస్ట్ స్టార్ట్

ఈ సర్వీస్ బెంగళూరు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరిబిదానూర్ లో ప్రారంభమైంది. దీనిని బెంగళూరుకు చెందిన త్రాటిల్ ఏరోస్పేస్ సిస్టమ్స్ నేతృత్వంలో ఈ డ్రోన్ డెలివరీని పరీక్షిస్తోంది. ఈ పరీక్షను సివిల్ ఏవియేషన్ ఏజెన్సీ (డిజిసిఎ) మార్చి 2020 లో ఆమోదించింది.

డ్రోన్ ద్వారా మెడికల్ డెలివరీకి శ్రీకారం.. ట్రయిల్ టెస్ట్ స్టార్ట్

అయితే ప్రస్తుతం దేశంలో అధికంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏజెన్సీ నుండి అనుమతి పొందడంలో ఆలస్యం జరిగింది. ఈ డెలివరీ డ్రోన్ రాబోయే 30 నుంచి 45 రోజులు పరీక్షించబడుతుంది. ఈ పరీక్ష బెంగళూరులోని 80 కిలోమీటర్లలో 30 నుంచి 45 రోజులు డ్రోన్ ద్వారా వైద్య పరికరాలు మరియు అవసరమైన మందులను పంపిణీ చేస్తుంది.

డ్రోన్ ద్వారా మెడికల్ డెలివరీకి శ్రీకారం.. ట్రయిల్ టెస్ట్ స్టార్ట్

ఈ ట్రైయల్ టెస్ట్ ఈ డ్రోన్ లో ఏదైనా టెక్నీకల్ ప్రాబ్లమ్ మరియు డెలివరీలో ఏదైనా సమస్యను గుర్తించడానికి నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రయోగంలో రెండు రకాల డ్రోన్‌లను ఉపయోగిస్తారు. ఇందులో ఒకటి దాని పేలోడ్ సామర్థ్యం 1 కిలోలు ఉండేది, మరోకటి దాని పే లోడ్ సామర్త్యం 2 కిలోలు వరకు ఉండెది.

డ్రోన్ ద్వారా మెడికల్ డెలివరీకి శ్రీకారం.. ట్రయిల్ టెస్ట్ స్టార్ట్

ఈ డ్రోన్‌ల డెలివరీకు సాఫ్ట్‌వేర్ రాన్ డింట్ మద్దతు ఇస్తుంది. భారతదేశంలో విస్తృత ప్రాంతంలో రవాణా చేయడానికి వీలుగా డ్రోన్ అనుకూలించబడతాయి. ఇది ఆపరేటర్లకు చాలా వరకు అనుకూలంగా కూడా ఉంటుంది. డ్రోన్ల బియాండ్ విజువల్ లైన్ సైట్ (బివిఎల్ఓఎస్) పైలట్ విమానాలను నిర్వహించడానికి యుఎఎస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం 20 యూనిట్లకు షరతులతో కూడిన మినహాయింపును మే నెలలోనే జారీ చేసింది.

డ్రోన్ ద్వారా మెడికల్ డెలివరీకి శ్రీకారం.. ట్రయిల్ టెస్ట్ స్టార్ట్

కోవిడ్19 వ్యాక్సిన్‌ను మారుమూల ప్రాంతాలకు అందించడానికి డ్రోన్‌లను ఉపయోగించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాన్పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) అధ్యయనం ప్రకారం, మానవరహిత వైమానిక వాహనాల కరోనా వ్యాక్సిన్లను మానవరహిత వైమానిక వాహనాలకు అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

డ్రోన్ ద్వారా మెడికల్ డెలివరీకి శ్రీకారం.. ట్రయిల్ టెస్ట్ స్టార్ట్

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తరపున హెచ్‌ఎఎల్ ఇన్‌ఫ్రా టెక్ సర్వీసెస్ లిమిటెడ్ యుఎవిల నుండి వ్యాక్సిన్లు మరియు మందులను పంపిణీ చేయడానికి జూన్ 11 న ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఇఒఐ) ను ఆహ్వానించింది. భవిష్యత్ లో ఈ డ్రోన్ల సర్వీస్ మరింత ముమ్మరం కానుంది. ఇది చాలా వరకు అంటురోగాల భారీ నుంచి కూడా కాపాడుతుంది.

Note: Images are representative purpose only.

Most Read Articles

English summary
Indias First Medical Drone Delivery Trial Started. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X