కారులో కూర్చునే థియేటర్‌లో సినిమా చూడొచ్చు.. భారతదేశంలోనే తొలిసారి..!

మారుతున్న టెక్నాలజీతో పాటే మనుషుల జీవనశైలి కూడా మారుతోంది. అయితే, కొన్ని సార్లు పాత పద్ధతులో ఎంతో బాగుండేది అనిపిస్తుంటుంది. పాతకాలపు రోజుల్లో గ్రామాలలో వీధుల్లో తెరలు కట్టి సినిమాను ప్రదర్శించేవారు. ఊరి ప్రజలంతా ఓ చోట కూర్చొని, సినిమాని ఎంజాయ్ చేసే వారు. దీనినే మనం ఓపెన్-ఎయిర్ థియేటర్ (Open-air Theatre) కాన్సెప్ట్ అంటాం.

కారులో కూర్చునే థియేటర్‌లో సినిమా చూడొచ్చు.. భారతదేశంలోనే తొలిసారి..!

అయితే, రోజులు మారాక, క్రమంగా ఈ కాన్సెప్ట్ కనుమరుగైపోయింది. ప్రజలంతా ఇప్పుడు మల్టీప్లెక్సులు లేదా వారి స్వంత హోమ్ థియేటర్లలోనే సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో, తిరిగి పాత రోజులను గుర్తు చేసేందుకు మరియు ఓపెన్-ఎయిర్ థియేటర్ విధానాన్ని ప్రస్తుత తరానికి పరిచయం చేసేందుకు రిలయన్స్ జియో సంస్థ ముందుకొచ్చింది.

కారులో కూర్చునే థియేటర్‌లో సినిమా చూడొచ్చు.. భారతదేశంలోనే తొలిసారి..!

రిలయన్స్ సంస్థ ఈ ఓపెన్-ఎయిర్ థియేటర్ విధానానికి మోడ్రన్ టచ్ ఇచ్చింది. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) నవంబర్ 5న ముంబైలో కంపెనీ ఆవిష్కరించిన ప్రీమియం షాపింగ్ మాల్ అయిన జియో వరల్డ్ డ్రైవ్ (JWD) లో భారతదేశంలోనే మొట్టమొదటి రూఫ్‌టాప్, ఓపెన్-ఎయిర్, డ్రైవ్-ఇన్ థియేటర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

కారులో కూర్చునే థియేటర్‌లో సినిమా చూడొచ్చు.. భారతదేశంలోనే తొలిసారి..!

ఈ థియేటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇందులో కూర్చోవడానికి సీట్లు ఉండవు. అవును, ఇదొక డ్రైవ్-ఇన్ థియేటర్ (Drive-in Theatre), ఇందులో మీ కారే మీ సీట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఈ ఓపెన్-ఎయిర్ థియేటర్ లోకి నేరుగా మీరు మీ కారుతో ప్రవేశించవచ్చు మరియు కారు లోనుంచి దిగకుండానే మూవీని ఎంజాయ్ చేయవచ్చు.

రిలయన్స్ ఆధ్వర్యంలోని ఈ ఓపెన్-ఎయిర్ డ్రైవ్-ఇన్ థియేటర్ ను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పివిఆర్ సినిమాస్ (PVR Cinemas) ద్వారా నిర్వహించబడుతుంది. ఈ జియో డ్రైవ్-ఇన్ ఓపెన్-ఎయిర్ థియేటర్ (Jio Drive-in Open-air Theatre) లో ఒక్కసారిగా 290 కార్లను నిలుపగల సామర్థ్యం ఉంది.

కారులో కూర్చునే థియేటర్‌లో సినిమా చూడొచ్చు.. భారతదేశంలోనే తొలిసారి..!

అంతేకాకుండా, ఇది పట్టణంలో (ముంబైలో) కెల్లా అతిపెద్ద సినిమా స్క్రీన్‌ ను కూడా కలిగి ఉంటుంది. వీక్షకులకు అసమానమైన సినిమాటిక్ అనుభూతిని అందించేలా ఈ జియో డ్రైవ్-ఇన్ ఓపెన్-ఎయిర్ థియేటర్ డిజైన్ చేయబడింది. ఈ కాన్సెప్ట్ వినోదానికి పూర్తిగా కొత్త నిర్వచనాన్ని ఇస్తుందని, మరీ ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఇతరులతో సంబంధం లేకుండా నేరుగా వారి స్వంత కారు నుండే సినిమాలను చూసే కొత్త మార్గాన్ని తీసుకువస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఓ ప్రకటనలో తెలిపింది.

కారులో కూర్చునే థియేటర్‌లో సినిమా చూడొచ్చు.. భారతదేశంలోనే తొలిసారి..!

జియో వరల్డ్ డ్రైవ్ (JWD) ప్రీమియం షాపింగ్ మాల్ ముంబైలోని వినియోగదారులకు సాంకేతికత, స్టైల్ మరియు అత్యాధునిక ఆవిష్కరణలతో ప్రపంచ స్థాయి రిటైల్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ పేర్కొంది. నగర వాసులకు ఈ JWD మాల్ వినోదం, ఆహారం మరియు పానీయాలు, రిటైల్, కల్చర్ వంటి అనేక వినూత్న కాన్సెప్ట్స్ లను అందిస్తుంది.

కారులో కూర్చునే థియేటర్‌లో సినిమా చూడొచ్చు.. భారతదేశంలోనే తొలిసారి..!

ఈ కాన్సెప్ట్స్ లో చాలా వరకు భారతదేశంలో మొదటిసారిగా ప్రయోగాలు చేయబడుతున్నాయని మరియు భారతదేశానికి ఉత్తమ ప్రపంచ అనుభవాలను తీసుకురావాలనే దృక్పథంతో ఇవి నిర్మించబడ్డాయని రిలయన్స్ తెలిపింది. JWD తో, తాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ రిటైల్ మరియు వినోద అనుభవాలను ముంబైకి తీసుకువస్తున్నామని

రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు.

కారులో కూర్చునే థియేటర్‌లో సినిమా చూడొచ్చు.. భారతదేశంలోనే తొలిసారి..!

ఇది (JWD) కేవలం బ్రాండ్ లేదా స్థలం మాత్రమే కాదని, మునుపెన్నడూ లేని విధంగా కస్టమర్‌లను ఆకర్షించే మరియు నిమగ్నం చేసే వ్యక్తిగత అనుభవాల యొక్క సరికొత్త ప్రపంచం అని ఆమె చెప్పారు. జియో డ్రైవ్-ఇన్ ఓపెన్-ఎయిర్ థియేటర్ ను ప్రారంభించడం ద్వారా ముంబై వాసులకు మరో పునర్నిర్వచనీయ అనుభవానికి తెరతీస్తున్నామని ఇషా అంబానీ అన్నారు.

కారులో కూర్చునే థియేటర్‌లో సినిమా చూడొచ్చు.. భారతదేశంలోనే తొలిసారి..!

ఈ మాల్ లోని అన్ని ఫుడ్ అండ్ బెవరేజెస్ కాన్సెప్ట్‌లు కూడా ఆధునిక కాలపు రుచిని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయని, వీటిలో ప్రతి ఒక్కటి విశిష్టమైన మరియు విస్తారమైన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆరోగ్యకరమైన రీతిలో వాటిని అందిస్తాయని, సాంకేతికత మరియు వ్యక్తిగతీకరించిన సేవతో కలిపి, ఈ ఫుండ్ అండ్ బెవరేజెస్ ఫార్మాట్‌లు ట్రెండ్‌సెట్టర్‌లుగా ఉంటాయని ఇషా అంబానీ తెలిపారు.

కారులో కూర్చునే థియేటర్‌లో సినిమా చూడొచ్చు.. భారతదేశంలోనే తొలిసారి..!

జియో ఓపెన్-ఎయిర్ డ్రైవ్-ఇన్ కాన్సెప్ట్ తర్వాత్, పివిఆర్ సినిమాస్ ఈ మాల్ లో తమ మైసన్ పివిఆర్ (Maison PVR) ప్రాజెక్ట్ ని కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. పివిఆర్ మల్టీప్లెక్స్ థియేటర్ మరియు ప్రివ్యూ థియేటర్ లలో VIP అతిథుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారం వంటి అనేక రకాల సౌకర్యాలను కూడా అందిస్తుంది.

జియో వరల్డ్ డ్రైవ్ మాల్ సుమారు 17.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడి ఉంది. ముంబైలోని అతిపెద్ద షాపింగ్ మాల్‌లలో ఇది కూడా ఒకటి. అంతర్జాతీయ మరియు భారతీయ ప్రీమియం నాణ్యత ఉత్పత్తులు మాత్రమే ఇక్కడ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, ప్రజలు థియేటర్లు మరియు రెస్టారెంట్లకు వెళ్లాలంటే సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కొత్తగా వస్తున్న ఈ ఓపెన్-ఎయిర్ డ్రైవ్-ఇన్ థియేటర్ సినిమా చూసే అనుభవాన్ని పూర్తిగా మార్చేయనుంది.

కారులో కూర్చునే థియేటర్‌లో సినిమా చూడొచ్చు.. భారతదేశంలోనే తొలిసారి..!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఓపెన్ రూఫ్-టాప్ డ్రైవ్-ఇన్ థియేటర్ లో స్నాక్స్ లేదా ఫుడ్ కోసం కస్టమర్లు కారు దిగాల్సిన అవసరం లేదు. ఆర్డర్ చేస్తే, ఫుడ్ నేరుగా వారి కార్ల వద్దకే వేడి వేడిగా సర్వ్ చేయబడుతుంది. ఈ సేవలు కస్టమర్లు తమ వాహనాన్ని విడిచిపెట్టకుండానే వాహనాన్ని ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తాయి. ఇది నిజంగా అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని కల్పిస్తుందని భావిస్తున్నారు. మరి మీరేమంటారు..?

Most Read Articles

English summary
India s first open air roof top drive in theatre set to open in mumbai on 5th november details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X