90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

భారతదేశంలో రైల్వే బ్రిటీష్ వారి కాలం నుంచి మొదలైంది. ఈ రోజుకి కూడా రైల్వే దేశంలో అతిపెద్ద సంస్థగా ఉంది. భారతదేశంలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్ 'ది డెక్కన్ క్వీన్'. ఈ ది డెక్కన్ క్వీన్ 1930 జూన్ 01 న ప్రారంభమైంది. ఈ ట్రైన్ భారతదేశంలో ప్రారంభమై 2021 జూన్ 01 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రైల్వే విభాగం మరియు ప్రయాణికులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

ది డెక్కన్ క్వీన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ 1930 లో ప్రారంభించినప్పుడు ఇది ముంబై మరియు పూణే మార్గంలో నడిచేది. ఈ మార్గాన్ని గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే (జిఐపిఆర్) ప్రారంభించింది. తరువాత కాలంలో దీనికి సెంట్రల్ రైల్వే అని పేరు మార్చారు. ఇప్పుడు కూడా దీనిని ఇదే పేరుతో పిలుస్తున్నారు.

90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

భారతదేశంలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు కావడంతో పాటు, డెక్కన్ క్వీన్ మొదటి సుదూర ఎలక్ట్రిక్ హాలెడ్ ప్యాసింజర్ రైలు మరియు మొదటి వెస్టిబ్యూల్ రైలుగా ఉండేది. ప్రారంభ రోజుల్లో, ఈ రైలు వారాంతాల్లో మాత్రమే నడిచింది మరియు ప్రత్యేకంగా బ్రిటిష్ వారికే ఉండేది, వారు రేసుల కోసం పూణేకు ఇందులో ప్రయాణించేవారు.

MOST READ:జూన్ 8 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600

90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

తరువాత కాలక్రమంలో 1943 నుండి భారతీయులకు రైలులో ప్రయాణించడానికి అనుమతి కల్పించబడింది. ముంబై మరియు పూణే మధ్య రోజువారీ సర్వీసుని 26 ఏప్రిల్ 1943 నుంచి ప్రారంభించారు. అప్పట్లోనే కల్యాణ్ మరియు పూణే మధ్య దూరాన్ని కవర్ చేయడానికి 2 గంటల 45 నిమిషాలు పట్టేది. అప్పట్లో ఈ ట్రైన్ టికెట్ ధర 8 అణాలు.

90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

ది డెక్కన్ క్వీన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ప్రారంభించిన మొదటి రోజుల్లో 7 బోగీలు చొప్పున 2 ర్యాక్‌లతో రైలును ప్రవేశపెట్టారు. బోగీలు సిల్వర్ స్కార్లెట్ మరియు రాయల్ బ్లూ రంగులలో పెయింట్ చేయబడ్డాయి. దీనిలో ఉపయోగించిన అసలు ర్యాక్‌లు ఇంగ్లాండ్‌లో నిర్మించబడ్డాయి, కాని కోచ్ బాడీలను మాతుంగా వర్క్‌షాప్‌లో నిర్మించారు.

MOST READ:ఫస్ట్ టైమ్ కార్ డ్రైవ్ చేయడానికి సిద్దమైన కుమార్తెతో తండ్రి ఫన్నీ [వీడియో]

90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

1966 లో పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మించిన తరువాత ఇందులో సమగ్రమైన మార్పులు జరిగాయి. తరువాత 1995 లో, ఎక్కువ సీటింగ్ సౌకర్యం కల్పించడానికి మరిన్ని కోచ్ లు ప్రవేశపెట్టడం జరిగింది. మార్చి 2020 లో, పాత బోగీలను ఎల్‌హెచ్‌బి కోచ్‌లతో భర్తీ చేశారు.

90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

ప్రస్తుతం ది డెక్కన్ క్వీన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో ఈ రైలులో 17 బోగీలీ ఉన్నాయి. ఇంకా ఇందులో 4 ఎసి బోగీలు,1 రెస్టారెంట్ బాక్స్, 10 సెకండ్ క్లాస్ సీట్లు మరియు రెండు సెకండ్ క్లాస్ బ్రేక్ వ్యాన్లు ఉన్నాయి. ప్రారంభంలో ఈ రైలు డబ్ల్యుసిపి డిసి సామర్థ్యంతో నడుస్తుంది.

MOST READ:దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

తరువాత దీనిని WCM - 1/2/4/5 DC హైబ్రిడ్ లోకోమోటివ్ చేత నడపబడింది. ఇప్పుడు WCAM-3 లేదా WCAM-2 / 2B DC / AC లోకోమోటివ్‌లో పనిచేస్తుంది. ఈ డెక్కన్ క్వీన్ రైలు కొన్నిసార్లు WCP-7 ఇంజిన్ ద్వారా నియంత్రించబడుతుండటం గమనార్హం. ఏకంగా 90 సంవత్సరాల నిరవధిక సేవను పూర్తి చేసుకున్న భారతదేశంలో మొదటి సూపర్ ఫాస్ట్ గా నిలిచింది.

Image Courtesy: Central Railway

Most Read Articles

English summary
India's First Super Fast Train Celebrates 90th Anniversary. Read in Telugu.
Story first published: Friday, June 4, 2021, 11:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X