తిరిగిరాని లోకాలకు ఇండియన్ మహిళా ఫాస్టెస్ట్ బైక్ రేసర్ వీను పాలివల్
భారత దేశపు ఏకైక మహిళా బైక్ రేసర్ వీను పాలివల్ సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మధ్య ప్రదేశ్‌లోని విదీశ్ జిల్లాలో ఈమె మృతి చెందారు. పురుషులు సైతం చేయలేని ఎన్నో రైడింగ్ సాహసాలను ఈమె చేసేది. వీను పాలివల్ గురించి మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

దేశంలోనే ఉత్తమ మహిళా బైక్‌రేసర్లలో టాప్ రేసర్‍గా గుర్తింపు తెచ్చుకున్నారు వీను పాలివల్ (44)

స్నేహితుడు దీపేశ్ తన్వర్‌తో కలిసి తన హ్యార్లీ డేవిడ్సన్ బైకు మీద రైడింగ్‌కు వెళ్లినపుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్యారాస్‌పూర్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది.

హ్యార్లీ డేవిడ్సన్ బైకు మీద రైడింగ్ చేస్తున్న వీను ఒక్క సారిగా బైకును అదుపు చేయలేక పోయింది. దీంతో బైకు బోల్తా పడి తీవ్ర గాయాలపాలయ్యారు. దీపేశ్ వెంటనే స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే తీవ్రగాయాలతో మృతి చెందినట్లు తెలిపారు.

వీను పాలివల్ స్వస్థలం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్. ఈమెకు చిన్నప్పటి నుండి బైకు రేసింగ్ అంటే విపరీతమైన ఇష్టం ఉండేది.

వీను పాలివల్ ప్రత్యేకత: ఈమె హ్యార్లీ డేవిడ్సన్ బైకుల మీద ఇండియన్ రోడ్లలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో రేసింగ్ చేయగలదు.

వీను తన జీవితంలోని బైక్ రేసింగ్ గురించి డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా రైడింగ్‌కు వెళ్లిన వీను పాలివల్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ఇటీవల్ వీను పాలివల్‌ను లేడీ ఆఫ్ ది హ్యార్లీ 2016 గా ప్రకటించారు.

దేశం మొత్తం గర్వించ దగ్గ ఉత్తమ మహిళా రేసర్ వీను పాలివల్ మృతికి సంతాపం తెలుపుతూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.

భారతదేశపు రహస్య ఆయుధం కాళీ గురించి ఆసక్తికరమైన విషయాలు
దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే
ఖరీదైన భిక్షగాడు: ఆడి కారులో వచ్చి అడుక్కుంటాడు


Click it and Unblock the Notifications








