టెస్లా సైబర్‌ట్రక్‌తో ఫోటోలు దిగిన హీరోయిన్ ఎవరో తెలుసా..? దుబాయ్ ఇసుక తిన్నెల్లో యూట్యూబర్‌తో కలిసి ఎంజాయ్..

తెలుగుతో పాటు తమిళ్, మలయాళ చిత్రసీమలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సునయన (sunaina) ఇటీవల కాలంలో సినిమాలు తక్కువగా చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సునయన తెలుగులో మొదటగా కుమార్ వెర్సస్ కుమారి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళయాళం, కన్నడ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కొన్ని టెలివిజన్ సిరీస్‌లలో కూడా నటించింది. ప్రస్తుతం సినిమాల్లో కనిపించనప్పటికి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను ఎప్పటికప్పుడు పలకరిస్తుంది. తాజాగా ఆమె అరబ్ దేశానికి చెందిన యూట్యూబర్‌తో రిలేషన్ షిప్ ఉందని ప్రచారం జరుగుతుంది. దుబాయ్‌కి చెందిన ఖలీద్ అల్ అమెరిలలో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినిమాల్లో యాక్టివ్‌గా లేనప్పటికి దుబాయ్‌లో తన ప్రేమికుడితో కలిసి చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారని తెలుస్తుంది.

వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఇటీవల సునయన ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాకు చెందిన సైబర్‌ట్రక్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన అభిమానులతో దీన్ని పంచుకున్నారు. దుబాయ్‌లో సైబర్‌ట్రక్‌‌తో దిగిన ఫోటో బాగా వైరల్ అవుతుంది. అయితే టెస్లాకు చెందినటువంటి సైబర్‌ట్రక్‌‌ను ఆమె కొనుగోలు చేశారా, లేదా అనేది మాత్రం తెలియరాలేదు.

Sunaina Tesla Cybertruck Electric In Dubai

కానీ తన సొంత కారు పక్కన నిలబడి ఉన్నట్లుగా కారుతో ఫోటో దిగారు. ఇది ప్రస్తుతం ఇండియాలో అమ్మకానికి అందుబాటులో లేదు. అంతర్జాతీయ మార్కెట్ అయినటువంటి అమెరికా, అరబ్ దేశాల్లో మాత్రం కొనుగోలుకు లభిస్తుంది. అమెరికాలో ఇది $79,990 కంటే ఎక్కువ ధరకు అమ్మకానికి ఉంది. దీన్ని 2023 నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. ఈవీ మార్కెట్లో టెస్లాకు మంచి పేరుంది. అందరి అంచనాలకు భిన్నంగా టెస్లా కార్లు ఉంటాయి.

టెస్లా సైబర్‌ట్రక్‌ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే దాదాపు 500 కి.మీల పైనే వరకు ప్రయాణిస్తుంది. ఇది రియర్-వీల్-డ్రైవ్ (RWD),ఆల్-వీల్-డ్రైవ్ (AWD), సైబర్‌బీస్ట్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. సైబర్‌బీస్ట్ వేరియంట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తే, ఇది 2.6 సెకన్లలో 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 209 కి.మీలుగా ఉంది. దీనిలో శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు.

Actress Sunaina Spotted With Tesla Cybertruck

ఈ మోటార్ 845 bhp శక్తిని, 14,000 nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే సైబర్‌ట్రక్‌ ఆల్-వీల్-డ్రైవ్ (AWD)వేరియంట్ 600 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ రేంజ్ వరకు ప్రయాణిస్తుంది. అదే వెనుక చక్రాల డ్రైవ్‌లో కొంచె తక్కువ దూరం వరకు వెళ్తుంది. టెస్లా సైబర్‌ట్రక్‌‌లో 5 మంది వరకు కలిసి హాయిగా ప్రయాణించవచ్చు. ఈ కారులో బోలెడు ఫీచర్స్ ఉన్నాయి.

17-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, పెద్ద విండ్‌షీల్డ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 15-స్పీకర్ సౌండ్ సిస్టం, వెనుక కూర్చున్న ప్రయాణికుల కోసం 9.4-అంగుళాల స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్‌గా) మరిన్ని అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు ఇండియాలో ఇప్పటివరకు అడుగుపెట్టలేదు. ఇక్కడ లాంచ్ అయిన తరువాత ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

Actress Sunaina Spotted With Cybertruck

ఇదిలా ఉంటే ఇటీవల కొంత మంది టెస్లా సైబర్‌ట్రక్‌ ప్రక్కన నిలబడి ఫోటోలు దిగుతూ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ సునయన సైబర్‌ట్రక్‌తో నవ్వుతూ, విజయసంకేతం చూపిస్తూ ఉన్న ఫోటో బాగా వైరల్ అవుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 9, 2025, 14:30 [IST]
English summary
Indian actress sunaina spotted with tesla cybertruck electric car in dubai
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+