రెడ్ కలర్ డ్రెస్సులో అదిరిపోతున్న డాకు మహారాజ్‌ బ్యూటీ.. ఖరీదైన కారుతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

ఊర్వశి రౌటేలా అంటే తెలియని వారు ఉండరు. అటూ బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది. తెలుగులో ఇటీవల కాలంలో స్టార్ హీరోలతో ఐటెం సాంగ్స్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది. మొదటగా ప్రైవేట్ సాంగ్స్‌లలో నటించి ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. గత ఏడాది ఇదే సంక్రాంతి సమయంలో విడువలైన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సాంగ్స్‌కు స్టెప్పులు వేసింది. ఇటీవల సంక్రాతి కానుకుగా వచ్చిన డాకు మహారాజ్‌ సినిమాలో కూడా నట సింహం సందమూరి బాలయ్యాతో కూడా చిందులు వేసింది. ఈ మధ్య కాలంలో ముంబైలో హడావుడి చేస్తూ, హైదరాబాద్‌లో కూడా తరుచుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఊర్వశి రౌటేలాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటి ఇటీవల ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న రేంజ్ రోవర్ (Range Rover) కారుతో కనిపించింది. ఆమె ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు రేంజ్ రోవర్ ఎవోక్ (evoque) కారులో హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆమె అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఊర్వశి రౌతేలాకు ఎరుపు రంగు చాలా ఇష్టం. అందుకే ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్బంలో ఇదే కలర్ డ్రెస్‌ను ధరించారు.

Urvashi Rautela Spotted With Range Rover Evoque

ఊర్వశి రౌటేలా రేంజ్ రోవర్ చాలా ఖరీదైనది. ఇండియా మార్కెట్లో దీని ధర రూ.67.90 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఆన్-రోడ్ ధర అయితే ఇది ఏకంగా రూ. 85 లక్షల వరకు కొనుగోలుకు లభిస్తుంది. చేతనిండి సినిమాలు ఉండటం, అలాగే ఐటెం సాంగ్స్‌లలో కూడా నటిస్తుండటం వలన ఊర్వశి రౌటేలా బాగానే సంపాదిస్తుంది. అందుకే ఇంత ఖరీదైన కారును కొనగలిగింది.

రేంజ్ రోవర్ ఎవోక్ కారు గురించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం, ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. వి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 250 PS పవర్, 365 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే 2.0 లీటర్ డీజిల్ 204 PS పవర్, 430 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లలో కూడా 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని ప్రత్యేకంగా ఇచ్చారు.

Actress Urvashi Rautela Spotted With Range Rover

ఇంజిన్‌కు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇది సెలబ్రిటీలు ఎక్కువగా కొనుగోలు చేసే ఖరీదైన కారు కాబట్టి దీని ఫీచర్స్ అన్ని కూడా లగ్జరీగా ఉంటాయి. లోపల క్యాబిన్ థీమ్ చాలా అందంగా ఉంటుంది. 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి. డ్యాష్‌బోర్డుతో అధునాతన ఫీచర్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వైర్‌లెస్ సెల్ ఫోన్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటివి ఉన్నాయి.

ధర ఎక్కువగా ఉంటుందంటే దానర్థం లోపల కూర్చున్న ప్రయాణికుల భద్రతకు సంబంధించి కారులో అధునాతన సేఫ్టీ ప్రమాణాలు ఉంటాయి. మెరుగైన ఎయిర్ బ్యాగులు, కారులో నుంచే చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా, ఇతర సేఫ్టీ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.

Actress Urvashi Rautela Range Rover

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, January 17, 2025, 19:30 [IST]
English summary
Indian actress urvashi rautela spotted with range rover evoque priced at rs 85 lakh onroad
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+