యువతను ఎయిర్‌ఫోర్స్‌లోకి ఆహ్వానించేందుకు సరికొత్త 3డి గేమ్
భారత వైమానిక దళం ప్రస్తుత తరం యువతను తమ వైపుకు ఆకర్షించుకునేందుకు ఓ సరికొత్త 3డి మొబైల్ ఫోన్ గేమ్‌ను విడుదల చేసింది. ఈ గేమ్ పేరు 'గార్డియన్ ఆఫ్ ది స్కైస్' (Guardian Of The Skies). ఈ గేమ్ ద్వారానైనా యువత భారత వైమానిక దళంలో చేరేందుకు ఆసక్తి కనబరచగలరని ఐఏఎఫ్ అధికారులు భావిస్తున్నారు.
మనదేశ యువతలో అత్యుత్తమ యువతీ, యువకలతో కనెక్ట్ అయ్యేందుకు మరియు వారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరేలా ప్రేరణ ఇచ్చేందుకు గాను ఈ 3డి గేమ్‌ను విడుదల చేశామని ఎయిర్ మార్షల్ సుకుమార్ తెలిపారు. ఐఏఎఫ్‌లో చేరడానికి యువత నుంచి ధరఖాస్తులు వస్తున్నప్పటికీ, వారి అత్యుత్తమైన అబ్బాయిలు, అమ్మాయిలను ఎంచుకోవటం ముఖ్యమని ఆయన వివరించారు.
గార్డియన్ ఆఫ్ ది స్కైస్ 3డి గేమ్‌ను ఓ ఇండిపెండెంట్ ప్రైవేట్ వెండర్ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇందులో మొదటి దశ గేమ్‌ను గురువారం నాడు విడుదల చేశారు. రెండవ దశకను అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నారు. ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలి, దేశాన్ని ఎలా కాపాడుకోవాలనే థీమ్‌తో ఈ గేమ్‌ను రూపొందించారు. ఈ గేమ్ టీజర్‌ను క్రింది వీడియోలో చూడొచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/2kBWk7b3cQk?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








