క్షణ కాలంలో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారత దేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు

By Anil

ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న నియంతర రేఖ వెంబడి పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రసైన్యం కాశ్మీర్ భూబాగంలోకి చొరబడింది. భారతీయ ధళాలు ఆదమరిచి ఉన్నపుడు దాడులు చేసి ఉగ్రి సెక్టారులో సుమారుగా 18 మందిని పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకగా పాకిస్తాన్‌కు గట్టి బుద్ది చెబుతూ పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా దాడులు నిర్వహించారు.

సర్జికల్ స్ట్రైక్స్‌లో ధుృవ్ హెలికాప్టర్ కీలక పాత్ర పోషించింది. కేవలం ధుృవ్ హెలికాప్టర్ ద్వారానే భారత ధళాలు భీబత్సాన్ని సృష్టించాయి. మరిన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్న మొత్తం 10 శక్తివంతమైన యుద్ద విమానాల్ని ఒక్క సారిగా వినియోగిస్తే కొన్ని నిమిషాలలోనే పాకిస్తాన్ బూడిదవడం ఖాయం.

10. ఇల్యూషిన్ ఐ1-78

10. ఇల్యూషిన్ ఐ1-78

సోవియట్ రష్యా నిర్మించిన నాలుగు ఇంజన్‌లు గల ఇల్యూషిన్ ఐ1-78 అనే రెండు యుద్ద విమానాలను 2003 తొలి భాగంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొనుగోలు చేసింది. తరువాత అక్టోబర్ 8, 2016 న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరేడ్‌ రోజున ప్రజల సందర్శనార్థం ఐ1-78 ఎమ్‌కెఐ విమానాన్ని ప్రదర్శించారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

ఇందులో Aviadvigatel D-30KP అనే నాలుగు ఇంజన్‌లను వినియోగించారు. ఒక్కొక్కటి సుమారుగా 27,000 పౌండ్ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

ఈ యుద్ద విమానం యొక్క గరిష్ట వేగం గంటకు 850కిలోమీటర్లుగా ఉంది. మరియు దీని రేంజ్(పరిధి) 7,300 కిలోమీటర్లుగా ఉంది.

09. లాక్‌హీడ్ మార్టిన్ సి-130జె సూపర్ హెర్క్యులెస్

09. లాక్‌హీడ్ మార్టిన్ సి-130జె సూపర్ హెర్క్యులెస్

ఈ రవాణా విమానాన్ని అమెరికా ఆధారిత లాక్‌హీడ్ మార్టిన్ అనే సంస్థ తయారు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాక్‌హీడ్ నుండి 2008 ప్రారంభంలో సుమారుగా ఎనిమిది విమానాలను కొనుగోలు చేసింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

ప్రత్యేక ఆపరేషన్స్ కోసం వినియోగించేందుకు వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొనుగోలు చేసింది. మరియు సైన్యానికి వీలుగా ఉండేందుకు ఇందులో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన అధునాతన సాంకేతిక పరికరాలను అమర్చారు. దీని గరిష్ట వేగం గంటకు 671కిలోమీటర్లుగా ఉంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

లాక్‌‌హీడ్‌ మార్టిన్‌కు చెందిన సి-130జె విమానంలో రోల్స్ రాయిస్‌కు చెందిన ఎఇ3100డి3 టర్బోప్రాప్ అనే నాలుగు ఇంజన్‌లను అందించారు. ఇందులోని ప్రతి ఇంజన్‌కు 6-బ్లేడ్లు గల డౌటీ ఆ391 అనే ప్రొపెల్లర్‌ను అనుసంధనానం చేశారు.

08. హెచ్ఏఎల్ తేజాస్

08. హెచ్ఏఎల్ తేజాస్

సింగల్ సీట్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ విమానాన్ని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) మరియు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంయుక్తంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు న్యావి విభాగాల కోసం అభివృద్ది చేసారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

హెచ్‌ఏఎల్ తేజాస్ యుద్ద విమానంలో సాధారణ ఎలక్ట్రిక్ ఎఫ్404-జిఇ-ఎఫ్2జె3 టర్బోఫ్యాన్ ఇంజన్‌ను అందించారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

హెచ్‌ఏఎల్ తేజాస్ విమానం గరిష్టంగా మ్యాక్ 1.8 గా ఉంది. అంటే గంటకు 2,205 కిలోమీటర్లు మరియు ఇది 15,200 కిలోమీటర్ల గరిష్ట ఎత్తుకు చేరుకోగలదు.

07. బోయింగ్ సి-17 గ్లోబ్‌మాస్టర్

07. బోయింగ్ సి-17 గ్లోబ్‌మాస్టర్

బోయింగ్ సంస్థ సి-17 విమానాన్ని అతి పెద్ద మిలిటరీ సామ్రాజ్యంలో రవాణా కోసం విరివిగా వినియోగిస్తున్నారు. 1980లో మొదటి సారిగా ఈ విమానాన్ని అమెరికన్ మిలిటరీలో ప్రవేశపెట్టారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

బోయింగ్ సి-17 విమానం నాలుగు ప్రాట్ అండ్ విట్నీ ఎఫ్117 పిడబ్ల్యూ టర్బోఫ్యాన్ ఇంజన్‌లు కలవు. మిగతా వాటితో పోల్చితే సుమారుగా 10 శాతం ఇంధనాన్ని తక్కువగా వినియోగించుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 829కిలోమీటర్లు మరియు దీని పరిధి 4,482 నుండి 10,390 కలోమీటర్ల వరకు ఉంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

భారీ బరువులను తరలించడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2009లో ఈ సి-17 గ్లోబ్‌మాస్టర్ విమానాన్ని ఎంచుకుంది. తరువాత 2010 జనవరిలో సుమారుగా 10 సి-17 విమానాలను కొనుగోలు చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్.

06. సెపెక్యాట్ జాగ్వార్

06. సెపెక్యాట్ జాగ్వార్

ఆంగ్లో-ఫ్రెంచ్ జెట్ యుద్ద విమానాన్ని సెపెక్యాట్ రూపొందిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుమారుగా 40 విమానాల కోసం జాగ్వార్‌కు ఆర్డరిచ్చింది. మరియు 120 వరకు లైసెన్స్ ఆధారిత జాగ్వార్ విమానాలను షాంషెర్ అనే పేరుతో హెచ్‌ఏఎస్ రూపొందిస్తోంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

ఈ విమానాల్లో రోల్స్‌రాయిస్‌కు చెందిన లేదా టర్బోమెకా అడౌర్ ఎమ్‌కె 102 టర్బోఫ్యాన్లు గల రెండు ఇంజన్‌లను కలిగి ఉంది, ఇందులోని ఒక్కో ఇంజన్ సుమారుగా 5,115 పౌండ్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

ఈ జెట్ గరిష్టంగా గంటకు 1,699కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

05. మికోయాన్ మిగ్-27

05. మికోయాన్ మిగ్-27

రష్యాలోని సోవియట్ యూనియన్ లోని మికోయాన్ డిజైన్ బ్యూరో వారు మిగ్-27 విమానాన్ని మొదటిసారి డిజైన్ చేశారు. గగన తలం నుండి భూ తలం మీదకు దాడులు నిర్వహించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుమారుగా 170 మిగ్ -27 విమానాలను కలిగి ఉంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

మిగ్-27 యుద్ద విమానాన్ని మిగ్ శ్రేణిలో ఉన్న 23 రకం యొక్క డిజైన్‌ను పోలి ఉంటుంది. అయితే ముందువైపు ముక్కు భాగంలో చాలా మార్పులు సంభవించాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

మికోయాన్ మిగ్-27 యుద్ద విమానంలో ఖట్చాతురోవ్ ఆర్-29బి-300 టుర్బో జెట్ ఇంజన్ కలిగి ఉంది. ఈ యుద్ద విమానం గరిష్టంగా గంటకు 1,885 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

04. దస్సాల్ట్ మిరేజ్ 2000

04. దస్సాల్ట్ మిరేజ్ 2000

నాలుగవ తరానికి చెందిన ఈ యుద్ద విమానాన్ని ఫ్రెంచ్‌కు చెందిన దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ అభివృద్ది చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1980ల కాలంలో సుమారుగా 19 మిరేజ్ 2000 మోడల్ యుద్ద విమానాలను కొనుగోలు చేసింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

మొత్తం 49 యుద్ద విమనాల్లో 42 విమానాలు సింగల్ సీటర్ మరియు 7 విమానాలు ఇద్దరు సీటింగ్ సామహర్థ్యంతో ఉన్నాయి. 2004లో 10 మిరేజ్ యుద్ద విమానాలను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం సుముఖత చూపించింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

ఈ యుద్ద విమానంలో SNECMA M53-P2 afterburning turbofan సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. దీని గరిష్ట వేగం గంటకు 2,336 కిలోమీటర్లుగా ఉంది.

03.మికోయాన్ మిగ్-29

03.మికోయాన్ మిగ్-29

సోవియట్ యూనియన్‌లోని మికోయాన్ సంస్థ ఈ మిగ్-29 యుద్ద విమానాన్ని డెవలప్ చేసింది. మిగ్-29 విమానానికి ప్రపంచ వ్యాప్తంగా మొదటి కొనుగోలుదారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

ఈ మికోయాన్ మిగ్-29 యుద్ద విమానాన్ని ప్రత్యేకించి 1999లో కాశ్మీర్‌లో జరిగిన కార్గిల్ యుద్దంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వినియోగించింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

సాంకేతికంగా ఇందులో Klimov RD-33 afterburning turbofan అనే రెండు ఇంజన్‌లు కలవు. దీని గరిష్ట వేగం గంటకు 2,400కిలోమీటర్లుగా ఉంది.

02. మికోయాన్ గురేవిచ్ మిగ్-21

02. మికోయాన్ గురేవిచ్ మిగ్-21

రష్యాలోని సోవియట్ యూనియన్‌లో మికోయాన్ డిజైన్ బ్యూరో వారు గురేవిచ్ మిగ్-21 విమానాన్ని డిజైన్ చేసారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంధిక మొత్తంవో గురేవిచ్ మిగ్-21 విమానాలను నిర్వహిస్తున్న వాటిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మూడవ స్థానంలో ఉంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద సుమారుగా 252 యూనిట్ల గురేవిచ్ మిగ్-21 విమానాలు ఉన్నాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

ఇందులో టుమన్స్కీ ఆర్25-300 సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 15,650 పౌండ్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని వేగం గంటకు 2,175కిలోమీటర్లుగా ఉంది.

01. సుఖోయ్ ఎస్‌యు-30ఎమ్‌కెఐ

01. సుఖోయ్ ఎస్‌యు-30ఎమ్‌కెఐ

రష్యాకు చెందిన సుఖోయ్ డిజైన్ బ్యూరో ఆధారంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్ క్రింద సుఖోయ్ ఎస్‌యు-30ఎమ్‌కెఐ విమానాలను ఉత్పత్తి చేయడం జరిగింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

2014 నాటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సరిగ్గా 200 ఎస్‌యు-30ఎమ్‌కెఐ యుద్ద విమానాలను కలిగి ఉంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న శక్తివంతమైన పది యుద్ద విమానాలు

ఎస్‌యు-30ఎమ్‌కెఐ విమానంలో Lyulka Al-31FP thrust vectoring turbofans గల రెండు ఇంజన్‌లు ఉన్నాయి. వీటి గరిష్ట వేగం గంటకు 2,100 కిలోమీటర్లుగా ఉంది.

  
Most Read Articles

English summary
Read In Telugu: Top 10 Indian Air Force Aircraft In 2016 — Ready To Take Up Any Challenge
Story first published: Wednesday, October 12, 2016, 13:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more