వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తొలి 10 నిమిషాలు అసలు మిస్‌ అవ్వద్దు!

యావత్‌ భారత్‌ దేశం ఎదురుచూస్తున్న వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ (ICC IDI World Cup) గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న మ్యాచ్‌ కోసం సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే టిక్కెట్లను విక్రయించారు. ప్రధాని మోడీ సహా ఇతర ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

మ్యాచ్‌ ప్రారంభంలో : ఐసీసీ వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నరేంద్ర మోడీ స్టేడియంలో (Narendra Modi Stadium) 10 నిమిషాల పాటు ఎయిర్‌ షో నిర్వహించేందుకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ (Indian AIrforce) ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్‌షోలో 9 విమానాలు ప్రదర్శన ఇవ్వనున్నట్లు సమాచారం. క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు ఎయిర్‌షోను ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Narendra modi stadium

IAF ఎయిర్‌షో : ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్య కిరణ్‌ బృందం ఈ ఎయిర్‌షోలో పాల్గొనుంది. 1996లో ఈ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందాన్ని ఎయిర్‌ఫోర్స్‌ అధికారిక బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించారు. ఈ బృందం ఎయిర్‌ఫోర్స్‌లోని 52వ స్క్వాడ్రన్‌లో భాగంగా ఉంది.

సూర్యకిరణ్‌ బృందం : భారత వైమానికి దళానికి చెందిన సూర్యకిరణ్‌ బృందం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్‌షోలకు ప్రసిద్ధి చెందింది. చైనా సహా పలు దేశాల్లో నిర్వహించిన అనేక ప్రదర్శనలో ఈ బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ బృందంలో మొత్తం 13 మంది పైలెట్లు ఉన్నారు. ఈ బృందం కోసం సంవత్సరానికి రెండు సార్లు ఎంపికలు నిర్వహిస్తారు. ఎంపికయిన వారు 3 సంవత్సరాలపాటు సూర్యకిరణ్‌ బృందంలో సేవలు అందిస్తారు.

indian airforce surya kiran team air show

హాక్‌ MK 132 ఎయిర్‌క్రాఫ్ట్‌లు: సూర్యకిరణ్‌ అంటే సంస్కృతంలో సూర్యకిరణం అని అర్థం. ఈ బృందం హాక్‌ MK 132 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కలిగి ఉంటుంది. ఈ సూర్యకిరణ్‌ బృందం సాధారణంగా ప్రతి సంవత్సరం 30 ఎయిర్‌షోలను నిర్వహిస్తుంది. భారత్‌లోని 72 నగరాల్లో ఈ బృందం ఎయిర్‌ షోలు నిర్వహించింది. ఈ బృందంలో అత్యంత నైపుణ్యం కలిగిన పైలెట్‌లను మాత్రమే చేర్చుకుంటారు.

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటి దేశం నలుమూలల నుంచి క్రికెట్‌ అభిమానులు నరేంద్ర మోడీ స్డేడియానికి చేరుకుంటున్నారు. వరుస విజయాలతో రోహిత్‌ సేన మంచి జోరు మీద ఉంది. వరల్డ్‌ కప్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగుతోంది. అటు ప్రత్యర్థి ఆస్ట్రేలియా కూడా విజయం కోసం ప్రణాళికలు రచిస్తోంది.

AIr show in ICC ODI FInal match

1983లో కపిల్‌ దేవ్‌ సారధ్యంలో టీమిండియా తొలిసారి వరల్డ్‌ కప్‌ను ముద్దాడింది. అనంతరం 2011లో మహీంద్ర సింగ్‌ ధోనీ నేతృత్వంలో రెండోసారి వరల్డ్ కప్‌ను భారత్‌ తన ఖాతాలో వేసుకుంది. ఈసారి రోహిత్‌ సేన భారత్‌ను విజయపథంలో నడిపిస్తుందని యావత్ భారతం విశ్వసిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, November 18, 2023, 16:17 [IST]
English summary
Indian airforce plans to conduct air show at icc odi final match
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+