ఇండియన్ ఆర్మీలో చేరిన కొత్త వెహికల్స్.. పెట్రోల్, డీజిల్‌తో పనే లేదు!

టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న తరుణంలో భారతదేశంలో కేవలం ఎలక్ట్రిక్, సీఎన్‌జీ కార్లు మాత్రమే కాకుండా హైడ్రోజన్ కార్ల హవా కూడా పెరుగుతోంది. పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి స్వచ్ఛమైన ఇంధనంతో నడిచే వాహనాలను అభివృద్ధి చేయడానికి వాహన తయారీ సంస్థలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే హైడ్రోజన్ కార్ల విభాగంలో కార్లు, బస్సులు పుట్టుకొచ్చాయి. కానీ ఇతర వాహనాలతో పోలిస్తే.. వీటి వినియోగం తక్కువే అయినప్పటికీ ఇటీవల ఆర్మీ తన ఫ్లీట్లో ఫ్యూయెల్ సెల్ బస్సులను చేర్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇండియన్ ఆయిల్ సంస్థ భారత సైన్యానికి హైడ్రోజన్ బస్సులను అందించింది. అంటే ఇకపైన ఇండియన్ ఆర్మీ హైడ్రోజన్ పవర్ బస్సులను ఉపయోగిస్తుంది. ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్.. ఇండియన్ ఆర్మీ చీప్ మనోజ్ పాండేకు బస్సులను అందించారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని పరీక్షించడం మరియు అమలు చేయడం కోసం ఇరుపక్షాలు ఎంఓయూపై సంతకాలు చేశాయి.

Indian Army And IOCL Commence Trails For Hydrogen Bus

ఇండియన్ ఆయిల్ నుంచి ఢిల్లీలో వినియోగించడానికి ఇటీవల అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును అందుకున్నప్పటికీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని మోహరించడంపై భారత సైన్యం దృష్టి సారించింది. పర్యావరణ పరిరక్షణలో ఇండియన్ ఆర్మీ కూడా ఓ అడుగు ముందుకు వేసి హైడ్రోజన్ బస్సులను సొంతం చేసుకుంది. ఇండియన్ ఆయిల్ కంపెనీ కూడా ఇలాంటి ఉత్పత్తులను పెంచుతోంది.

భారత సైన్యంలో ప్రస్తుతం 15 ఫ్యూయెల్ సెల్ బస్సులు చేరాయి. ఇవన్నీ ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో నడుస్తాయి. రాబోయే రోజుల్లో ఇండియన్ ఆర్మీ మరిన్ని హైడ్రోజన్ బస్సులను వినియోగించే అవకాశం ఉంది. అప్పుడు దేశంలోని ఇతర నగరాల్లో కూడా వీటిని ఉపయోగించనుంది. పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి హైడ్రోజన్ బస్సుల వినియోగం చాలా అవసరం. ప్రజా రవాణాలో కూడా వీటిని ఉపయోగించాల్సిన అవసరం ఎంతో ఉంది.

Indian Army And IOCL Commence Trails For Hydrogen Bus

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సుల వినియోగం నగరంలోని కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. భారత సైన్యం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమందికి తప్పకుండా ఆదర్శం అవుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఫ్యూయెల్ సెల్ వాహనాలు నగరంలో తిరుగుతాయని సమాచారం. ఇండియన్ ఆర్మీలో హైడ్రోజన్ బస్సులు చేరటం గురించి.. ఇండియన్ ఆయిల్ అధికారులు మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇండియన్ ఆయిల్ కంపెనీ భారత సైన్యానికి అందించిన హైడ్రోజన్ బస్సులలో 37 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఇందులో ఫుల్ ట్యాంక్ చేయాలంటే 30కేజీల హైడ్రోజన్ నింపాల్సి ఉంటుంది. వీటిని ఒక ఫుల్ ట్యాంక్ హైడ్రోజన్‌తో 250 నుంచి 300 కిమీ వరకు నడపవచ్చు. దీన్ని బట్టి చూస్తే హైడ్రోజన్ బస్సులు మంచి పనితీరును అందిస్తాయని తెలుస్తోంది. మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఇతర వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.

Indian Army And IOCL Commence Trails For Hydrogen Bus

ఇక ఇండియన్ ఆర్మీ హైడ్రోజన్ బస్సులను నడపడానికి కావాల్సిన హైడ్రోజన్ కోసం ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2023 మార్చి 21న జరిగినట్లు సమాచారం. ఎన్టీపీసీ కంపెనీ దేశ ఉత్తర సరిహద్దులో గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ మైక్రోగ్రిడ్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత చుషుల్‌లో 200 కిలోవాట్ల సామర్థ్యం గల గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్‌ను నిర్మించారు. ఇవన్నీ హైడ్రోజన్ సరఫరాకు ఉపయోగపడతాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, May 30, 2024, 9:00 [IST]
English summary
Indian army and iocl commence trails for hydrogen bus
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+