పర్వత ప్రాంతంలో చిక్కుకున్న మహీంద్రా SUV.. రంగంలోకి ఆర్మీ.. నెటిజన్ల ప్రశంసలు..!

ఇండియన్‌ ఆర్మీ.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు, ఫొటోలు ఇప్పటికే వైరల్‌ అయ్యాయి. అయితే తాజాగా ఇండియన్‌ ఆర్మీకి సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఆఫ్‌ రోడర్‌, ర్యాలీ డ్రైవర్‌ రత్తన్‌ ధిల్లన్‌ షేర్ చేశారు.

జాతీయ సైనిక దినోత్సరం రోజున (జనవరి 15) ఈ వీడియోను రత్తన్‌ పోస్ట్‌ చేశారు. సైనికులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఓ పర్వత ప్రాంతంలో చిక్కుకున్న మహీంద్రా XUV700 (Mahindra XUV700 SUV) వాహనం రోడ్డు పక్కన ఉన్న చిన్న కాలువలో ఇరుక్కుపోయింది. ఈ వాహనం ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ కారణంగా తనంతట తానుగా బయటకు రావడం కష్టం అయింది.

 indian-army-rescues-mahindra-xuv700

ఈ పరిస్థితిని గమనించిన ఆర్మీ సిబ్బంది క్రేన్‌ సాయంతో మహీంద్రా XUV700 SUVను బయటకు తీశారు. అయితే ఈ సమయంలో మహీంద్రా SUV ఎడమవైపు కొంత డ్యామేజీ అయింది. డోన్‌ ప్యానల్‌, ఫెండర్ల దెబ్బతిన్నాయి. లడఖ్‌ పర్వత ప్రాంతంలోని ఖర్దుంగ్లా పాస్‌ దాటుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

ఈ సంఘటన గురించి రత్తన్‌ ధిల్లాన్‌ తన Xలో పోస్ట్‌ చేశాడు. "భారత్ సైనిక దినోత్సవం రోజు మన సైనికులు చేసిన పనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండు నెలల క్రితం ఖర్దుంగ్లా పాస్‌ వద్దకు రాగానే రోడ్డుపక్కనే మహీంద్రా SUV కాలువలో చిక్కుకుంది. టో ట్రక్కుతో SUVని బయటకు తీశారు. అనంతరం కప్పు కాఫీ ఇచ్చారు" అంటూ రాసుకొచ్చాడు.

mahindra XUV700 SUV rescued on mountain road

ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున తమ స్పందన తెలియజేశారు. జవాన్లపై ప్రశంసలు కురిపించారు. ప్రజలకు సాయం చేయడంలో భారత సైన్యం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని మరో నెటిజన్‌ కామెంట్ చేశారు. పర్వత ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా డ్రైవింగ్‌ చేయాల్సి ఉంటుందని, లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది.

మహీంద్రా XUV700 వాహనం భద్రత పరంగా గ్లోబల్‌ NCAP నుంచి 5-స్టార్‌ రేటింగ్‌ను పొందుతుంది. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న వాహనం 4WD (4 వీల్‌ డ్రైవ్‌) కాకుండా కేవలం ఫ్రంట్ వీల్‌ డ్రైవ్‌ ఆప్షన్‌తో మాత్రమే ఉంది. ఫలితంగా ఇలాంటి పరిస్థితుల్లో బయటకు రావడం చాలా కష్టం.

mahindra XUV700 SUV latest news

మరియు ఈ కారు 7 ఎయిర్‌బ్యాగ్‌, యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్‌ స్బెబిలిటీ ప్రోగ్రాం, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, లేన్‌ కీపింగ్ అసిస్ట్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్ సిస్టమ్‌, ADAS- అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌, ISOFIX యాంకర్స్‌తో వస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, January 19, 2024, 17:50 [IST]
English summary
Indian army forces rescued mahindra xuv700 suv stucked on mountain
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+